Back Door Movie
-
డిఫరెంట్ జానర్లో సినిమాలు తీస్తా: కర్రి బాలాజీ
కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా నటించిన చిత్రం 'బ్యాక్ డోర్'. యూత్‌పుల్ అంశాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా.. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తన తొలి సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులు దర్శకుడు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్’మూవీని సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.నా ప్రతి సినిమాను కూడా డిఫరెంట్ జానర్లో రూపొందిస్తాను. ఈ క్రమంలోనే నా తదుపరి సినిమాను ఆనంద భైరవి పేరుతో మీ ముందుకు తీసుకురానున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, రాయ్ లక్ష్మి, మురళి శర్మ, రాశి సహా పలువురు ఫేమస్ యాక్టర్స్ భాగమవుతున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తాం. ముందు ముందు ఇలాగే ప్రేక్షకులు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
‘బ్యాక్ డోర్’మూవీ రివ్యూ
టైటిల్ : బ్యాక్ డోర్ నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు నిర్మాణ సంస్థ : ఆర్చిడ్ ఫిలిమ్స్ నిర్మాత : బి.శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం : కర్రి బాలాజీ సంగీతం : ప్రణవ్ ఎడిటర్ : చోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్ పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. మంచి సందేశంతో పాటు యూత్‌పుల్ అంశాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం శనివారం (డిసెంబర్ 25)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడం.. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ‘బ్యాక్ డోర్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘బ్యాక్ డోర్’ కథేంటంటే.. అంజలి(పూర్ణ) భర్త ఓ వ్యాపారవేత్త. ఎప్పుడు ఆఫీస్ పనుల్లో బిజీ బిజీగా ఉంటాడు. ఆమె ఇంటి వద్దే ఉంటూ.. ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. ఓ పెళ్లి వేడుకలో ఆమెకు అరుణ్(తేజ త్రిపురాన)పరిచయం అవుతాడు. అతని మాటలకు అంజలి అట్రాక్ట్ అవుతుంది. అంజలి అందాలకు అరుణ్ ఫిదా అవుతాడు. ఇద్దరు రెగ్యులర్‌గా ఫోన్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. భర్త ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన సమయంలో అరుణ్‌ని ఇంటికి రప్పించుకుంటుంది. ఆ సమయంలో ఏం జరిగింది? మంచి ఇల్లాలుగా ఉన్న అంజలి గీత దాటిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు హైలైట్ పూర్ణనే. ఇల్లాలు అంజలి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. వయసు ఏమో హద్దులు దాటమంటుంది.. మనసు ఏమో తప్పని చెప్పుతుంది. ఈ రెండిటి మధ్య నలిగే హౌస్‌వైఫ్‌గా పూర్ణ తన నటనలో అద్భుతమైన హావభావాలు చూపించింది. యువకుడు అరుణ్ పాత్రలో తేజ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఉత్సాహంగా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పెళ్లయ్యాక మహిళ తన మనసుకు, ఆలోచనలకు ఎలాంటి హద్దులు గీసుకోవాలో తెలియజేసే ఓ మంచి సందేశాత్మక చిత్రమే ‘బ్యాక్ డోర్’. ‘చూపు వెళ్లిన ప్రతి చోటుకి మనసు వెళ్లకూడదు.. అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు’అనే ఒకేఒక డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో చెప్పేశాడు దర్శకుడు కర్రి బాలాజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను చూపిస్తూనే.. చివరిలో ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. అటు యువతకు నచ్చేలా, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను నిర్మించారు నిర్మాత బి శ్రీనివాస రెడ్డి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రణవ్ సంగీతం బాగుంది. ‘రారా నన్ను పట్టేసుకుని’అనే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ ఓకే. అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘బ్యాక్ డోర్’ కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర బృందం. కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, అడిషన్ ఎస్పీ కె.జి.వి. సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈట్ సినిమా... డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమాగా’అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు ‘బ్యాక్ డోర్’వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో ‘బ్యాక్ డోర్’ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
Back Door: థియేటర్స్‌లోనే ‘బ్యాక్ డోర్’.. విడుదల ఎప్పుడంటే..?
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు.. డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ..."బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
బ్యాక్ డోర్ విడుదల వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ?
Back Door Movie Postponed: నటి పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'. ఈ సినిమా విడుదల పలు అనివార్య కారణాలతో వాయిదా పడింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్‌గా థియేటరికల్ హక్కులు "కె.ఆర్. ఫిల్మ్ ఇంటర్నేషనల్" అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్న తెలిసిందే. కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ 'బ్యాక్ డోర్ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున ఈనెల 3కు బదులుగా ఈ నెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాను ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. -
డిసెంబర్ మొదటి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
Telugu Upcoming Web Series & Movies Of December 2021: కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వధారణమైపోయింది. మరి డిసెంబర్ ప్రారంభంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో చూసేద్దాం.. అఖండ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలవుతోంది. మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు. తడప్ ఆర్ఎక్స్ 100.. తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తడప్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి తడప్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్గా కనిపించనుంది. మిలాన్ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా డిసెంబర్ 3వ తేదీన రిలీజవుతోంది. బ్యాక్ డోర్ పూర్ణ లీడ్ రోల్లో నటించిన మూవీ బ్యాక్ డోర్. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. బ్యాక్ డోర్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్కైలాబ్ సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో వచ్చే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ♦ ద పవర్ ఆఫ్ ది డాగ్ (హాలీవుడ్) - డిసెంబర్ 1 ♦ లాస్ ఇన్ స్పేస్ (వెబ్ సిరీస్) - డిసెంబర్ 1 ♦ కోబాల్ట్ బ్లూ (హాలీవుడ్) - డిసెంబర్ 3 ఆహా ♦ మంచి రోజులు వచ్చాయి (తెలుగు) - డిసెంబర్ 3 అమెజాన్ ప్రైమ్ ♦ ఇన్ సైడ్ ఎడ్జ్ (హిందీ వెబ్‌సిరీస్) - డిసెంబర్ 3 జీ5 ♦ బాబ్ విశ్వాస్(హిందీ) - డిసెంబర్ 3 బుక్ మై షో ♦ ఎఫ్9 (తెలుగు) - డిసెంబర్ 1 -
డిసెంబర్ 3న థియేటర్స్‌లో ‘బ్యాక్ డోర్’
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు ‘కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్’ అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్సులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, ప్రముఖ నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ... నా మీద నమ్మకముంచిన ‘బ్యాక్ డోర్’ నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం’అన్నారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
‘బ్యాక్ డోర్' కచ్చితంగా విజయం సాధిస్తుంది: కె.రాఘవేంద్రరావు
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్" టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్’అన్నారు. రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
కుర్రకారును కట్టి పడేసే అంశాలతో 'బ్యాక్ డోర్'
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ‘బ్యాక్ డోర్’లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు... అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతోపాటు... హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. తను నటించిన "బ్యాక్ డోర్" క్లీన్ యు తో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్.