Back Door Movie Review And Rating In Telugu | Poorna Back Door Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Back Door Review: ‘బ్యాక్‌ డోర్‌’మూవీ ఎలా ఉందంటే..,?

Dec 26 2021 11:24 AM | Updated on Dec 26 2021 11:54 AM

Back Door Movie Review And Rating In Telugu - Sakshi

భర్త ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన సమయంలో అరుణ్‌ని ఇంటికి రప్పించుకుంటుంది. ఆ సమయంలో ఏం జరిగింది? మంచి ఇల్లాలుగా ఉన్న అంజలి గీత దాటిందా లేదా?

టైటిల్‌ : బ్యాక్‌ డోర్‌
నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు
నిర్మాణ సంస్థ :  ఆర్చిడ్ ఫిలిమ్స్
నిర్మాత : బి.శ్రీనివాస్ రెడ్డి
దర్శకత్వం : కర్రి బాలాజీ 
సంగీతం : ప్రణవ్‌
ఎడిటర్‌ : చోటా కె. ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్‌ నారోజ్‌

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటించిన తాజా చిత్రం  'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. మంచి సందేశంతో పాటు యూత్‌పుల్‌ అంశాలతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శనివారం (డిసెంబర్‌ 25)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడం.. ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ‘బ్యాక్‌ డోర్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.  

‘బ్యాక్‌ డోర్‌’ కథేంటంటే..
అంజలి(పూర్ణ) భర్త ఓ వ్యాపారవేత్త. ఎప్పుడు ఆఫీస్‌ పనుల్లో బిజీ బిజీగా ఉంటాడు. ఆమె ఇంటి వద్దే ఉంటూ.. ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. ఓ పెళ్లి వేడుకలో ఆమెకు అరుణ్‌(తేజ త్రిపురాన)పరిచయం అవుతాడు. అతని మాటలకు అంజలి అట్రాక్ట్‌ అవుతుంది. అంజలి అందాలకు అరుణ్‌ ఫిదా అవుతాడు. ఇద్దరు రెగ్యులర్‌గా ఫోన్‌ మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేస్తారు. భర్త ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన సమయంలో అరుణ్‌ని ఇంటికి రప్పించుకుంటుంది. ఆ సమయంలో ఏం జరిగింది? మంచి ఇల్లాలుగా ఉన్న అంజలి గీత దాటిందా లేదా? అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే..?
ఈ సినిమాకు హైలైట్‌ పూర్ణనే. ఇల్లాలు అంజలి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. వయసు ఏమో హద్దులు దాటమంటుంది.. మనసు ఏమో తప్పని చెప్పుతుంది. ఈ రెండిటి మధ్య నలిగే హౌస్‌వైఫ్‌గా పూర్ణ తన నటనలో అద్భుతమైన హావభావాలు చూపించింది. యువకుడు అరుణ్‌ పాత్రలో తేజ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఉత్సాహంగా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
పెళ్లయ్యాక మహిళ తన మనసుకు, ఆలోచనలకు ఎలాంటి హద్దులు గీసుకోవాలో తెలియజేసే ఓ మంచి సందేశాత్మక చిత్రమే ‘బ్యాక్‌ డోర్‌’. ‘చూపు వెళ్లిన ప్రతి చోటుకి మనసు వెళ్లకూడదు.. అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు’అనే ఒకేఒక డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో చెప్పేశాడు దర్శకుడు కర్రి బాలాజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను చూపిస్తూనే.. చివరిలో ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. అటు యువతకు నచ్చేలా, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను నిర్మించారు నిర్మాత బి శ్రీనివాస రెడ్డి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రణవ్‌ సంగీతం బాగుంది. ‘రారా నన్ను పట్టేసుకుని’అనే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు.  శ్రీకాంత్‌ నారోజ్‌ సినిమాటోగ్రఫీ ఓకే. అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement