టైటిల్ : @లవ్
నటీనటులు: అభి, సోనాక్షి, రామరాజు తదితరులు
నిర్మాణ సంస్థలు: టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్‌ఎన్ క్రియేషన్స్
నిర్మాతలు: మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ
దర్శకత్వం : శ్రీ నారాయణ
సంగీతం: సన్నీ మాలిక్
స్క్రీన్ ప్లే: శ్రీ నారాయణ
సినిమాటోగ్రఫీ: మహి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
విడుదలతేది: డిసెంబర్ 9, 2022
కథేంటంటే..
గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథగా మొదలవుతుంది ఈ చిత్ర కథ. ఎమ్మెల్యే శర్మ (రామరాజు) తన కూతురు విందు, రామ్ అనే గిరిజన యువకుడిని ప్రేమించిందని తెలిసి.. ఎలాగైనా ఆ ప్రేమను చెడగొట్టాలని ఆ గిరిజన ప్రాంతానికి బయలు దేరతాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శర్మకి ఓ గిరిజన పెద్దాయన పరిచయం అవుతాడు. ఆయన ఎప్పుడో గతంలో తమ ప్రాంతంలో జరిగిన చంద్ర- మాలచ్చిమి అనే జంట తాలూకు ప్రేమ కథ చెబుతాడు. నిజమైన ప్రేమకు ప్రతిరూపం లాంటి ఆ ప్రేమ కథ విన్న తర్వాత శర్మ లో ఎలాంటి మార్పు వచ్చింది?, చివరకు శర్మ తన కూతురు ప్రేమను అంగీకరించాడా?, లేదా ? అసలు అప్పటి జంట ప్రేమ కథ కు - నేటి జంట ప్రేమ కథకు మధ్య కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే..
'@లవ్'.. సున్నితమైన భావోద్వేగాలతో మడిపడిన ఉన్న ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ. సినిమా చూస్తున్నంత సేపు అందమైన అడవి మధ్యలోకి వెళ్లి అక్కడి పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో ప్రేమ, మరియు కులం, ప్రాంతం, జాతి వంటి సున్నితమైన అంశాలను, వాటి వల్ల ఆడవాళ్ళు పడుతున్న ఇబ్బందలను చూపించటం చాలా బాగుంది. నేటి సమాజంలో కొంతమంది కుల మత పిచ్చితో ఎంత మూర్ఖంగా ఉంటారో అని కొన్ని కఠినమైన వాస్తవాల ఆధారంగా కొన్ని సంఘటనలను చాలా వాస్తవికంగా చూపించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫీల్, ఎమోషన్, ఆడవాళ్ళ కి సంబంధించిన సోషల్ మెసేజ్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు.
వీటితో పాటు శ్రీ నారాయణ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. ఈ సినిమాలోని నటీనటులంతా కొత్తవారైనా..చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సన్నీ మాలిక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను చక్కడా చూపించారు. శివ.కె మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాతలు మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ '@లవ్' చిత్రం భావేద్వేగమైన ప్రేమ కథలతో, సున్నితమైన భావోద్వేగాలతో మెప్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment