డిసెంబర్‌ మొదటి వారంలో రిలీజవుతున్న సినిమాలివే! | List of Upcoming Movies Release on OTT and Theatres in December First Week | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే

Published Mon, Nov 29 2021 9:02 PM | Last Updated on Tue, Nov 30 2021 7:35 PM

List of Upcoming Movies Release on OTT and Theatres in December First Week - Sakshi

Telugu Upcoming Web Series & Movies Of December 2021: కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్‌ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వధారణమైపోయింది. మరి డిసెంబర్‌ ప్రారంభంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో చూసేద్దాం..

అఖండ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 2న థియేటర్లలో విడుదలవుతోంది.

మరక్కార్‌: అరేబియన్‌ సుమద్ర సింహం
మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్‌: అరేబియన్‌ సుమద్ర సింహం. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ  చిత్రం థియేటర్‌లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్‌, కీర్తి సురేశ్‌, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

తడప్‌
ఆర్‌ఎక్స్‌ 100.. తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు.. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తడప్‌ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి తడప్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్‌గా కనిపించనుంది. మిలాన్‌ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా డిసెంబర్‌ 3వ తేదీన రిలీజవుతోంది.

బ్యాక్‌ డోర్‌
పూర్ణ లీడ్‌ రోల్‌లో నటించిన మూవీ బ్యాక్‌ డోర్‌. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. బ్యాక్‌ డోర్‌ మూవీ డిసెంబర్‌ 3న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్కైలాబ్‌
సత్యదేవ్‌, నిత్యమీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్‌. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్‌ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదలవుతోంది.

డిసెంబర్‌ మొదటి వారంలో ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

నెట్‌ఫ్లిక్స్‌

ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌ (హాలీవుడ్‌) - డిసెంబర్‌ 1

లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) - డిసెంబర్‌ 1

కోబాల్ట్‌ బ్లూ (హాలీవుడ్‌) - డిసెంబర్‌ 3

ఆహా

మంచి రోజులు వచ్చాయి (తెలుగు) - డిసెంబర్‌ 3

అమెజాన్‌ ప్రైమ్‌

ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ (హిందీ వెబ్‌సిరీస్‌) - డిసెంబర్‌ 3

జీ5

బాబ్‌ విశ్వాస్‌(హిందీ) - డిసెంబర్‌ 3

బుక్‌ మై షో

ఎఫ్‌9 (తెలుగు) - డిసెంబర్‌ 1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement