Skylab Movie
-
లావణ్య తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టనుంది. వరుణ్ తేజ్‌తో మరికొన్ని రోజుల్లోనే ఏడడగులు వేయనుందీ బ్యూటీ. మెగా ఇంటికి కోడలుగా ఆమె వెళ్తుంది కాబట్టి ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో తన అందచందాలు ప్రదర్శించడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: 'సలార్'ను నమ్ముకున్న శృతిహాసన్) అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం అయ్యాక అంతకు ముందే ఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారట. తమిళ్లో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కొన్ని నెలల క్రితమే లావణ్య ఓకే చెప్పారు. 'స్కైలాబ్' సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్ ఖండేరావ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. కొద్దిరోజుల్లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి నో చెప్పేశారు. (ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) దీనికి ప్రధాన కారణం ఈ వెబ్ సిరీస్‌లో కథ రీత్యా కథానాయిక పాత్ర కాస్తంత బోల్డ్‌గా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయట. కొద్దిరోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలో నటించడం కరెక్ట్ కాదని నిర్ణయించుకున్నదట. ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్ని చూసుకోమని లావణ్య ఓపెన్‌గానే చెప్పేశారట. ఆమె తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేశారట. నిశ్చితార్థం అయిన తర్వాత తాను కొణిదలవారి కోడల్ని కాబట్టి ఇక నుంచి ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పారట. దీంతో ఆమె నిర్ణయాన్ని వారు కూడా కాదనలేకపోయారట. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ లావణ్య నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. -
ఓటీటీలో స్కైలాబ్, రిలీజ్ ఎప్పుడంటే?
Skylab Movie Confirms OTT Release Date: సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్కైలాబ్. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు, నిత్యామీనన్ నిర్మించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కొంత కామెడీ జోడించి సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సోనీ లైవ్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS — SonyLIV (@SonyLIV) January 11, 2022 -
ప్రభాస్ ఇష్యూ ఇంకా బాధపెడుతోంది.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్
‘అలా మొదలైంది’చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ నిత్యామీనన్.. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరరైంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తుంది ఈ భామ. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్ నిర్మాతగా కూడా మారింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిత్యా.. గతంలో చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ ఇష్యూ గురించి మాట్లాడూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాను తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే టాలీవుడ్ సినిమాలు చూసేదాన్నికాదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని,ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైంది. ప్రభాస్ ఇష్యూ నన్ను ఇప్పటికి బాధ పెడుతుంది’అని నిత్యా చెప్పుకొచ్చింది. -
స్కైలాబ్ మీదపడుతుందని భయపడి చచ్చారు..! అందరి గుండెలో దడ పుట్టించిన స్కైలాబ్..!
స్కైలాబ్ ఈ పేరు ప్రస్తుతం 50 సంవత్సరాలు పైబడినవారికి గుర్తుండే ఉంటుంది. 1970 దశకం చివర్లో స్కైలాబ్ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్రయోగించిన అంతరిక్ష స్టేషన్ ఎప్పుడు భూమ్మీద పడిపోతుందో అంటూ కొన్ని దేశాలకి చెందిన ప్రజలు కొన్నాళ్లపాటు బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు. కొంతమందైతే ఇదే మనకు చివరిరోజు అని భావించి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. అదే నేపథ్యంలో స్కైలాబ్ మూవీతో యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావు ముందుకువచ్చిన విషయం తెలిసిందే..అది రీల్ స్కైలాబ్ అయితే రియల్ స్కైలాబ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం... రష్యాకు పోటీగా..! 1960-1970 మధ్యకాలంలో అమెరికా-రష్యా మధ్య స్పేస్‌ను జయించాలనే తీవ్రమైన పోటీ ఉండేది. స్పేస్ టెక్నాలజీలో రష్యా ఒక అడుగు ముందుకేసి 1971లో సెల్యూట్ వన్ అనే స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ స్పేస్ స్టేషన్ హక్కులు కేవలం రష్యాకు మాత్రమే ఉండేవి. వేరే ఇతర దేశాలకు లేవు. దీంతో అమెరికా కూడా ఎలాగైనా తమకు సొంత స్టేషన్ ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. వాటితో బయోకెమికిల్ రిసెర్చ్, సూర్యుడిపై పరిశోధనలు అనేక ఇతర టెస్ట్‌లను చేయడానికి స్కైలాబ్ ఉపయోగించి చేయవచ్చునని అమెరికా భావించింది. మిల్లీ మీటర్ సైజ్ శకలం కొంపముంచింది 1973 మే 14 రోజున సాట్రన్వీ అనే రాకెట్ ద్వారా స్కైలాబ్ను నాసా అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగం లాంచ్ చేసిన సమయంలో నాసాకు చెడు సంఘటన ఎదురైంది. అదేంటంటే ఎర్త్ వాతావరణంలోని ఒక మిల్లీ మీటర్ సైజ్‌లో ఉండే ఒక శకలం స్కైలాబ్ స్పేస్ స్టేషన్‌ను ఢీ కొట్టింది. దీంతో స్కైలాబ్ హిట్ షేల్, సోలార్ ప్యానెల్ దెబ్బతింది. స్కైలాబ్ ఆర్బిట్‌లోకి చేరాక..స్పేస్ స్టేషన్ దెబ్బతిందని నాసా గుర్తించింది. తీవ్రమైన సౌరవేడి నుంచి స్కైలాబ్‌కు రక్షణ లేకుండా పోయింది. అదే నెలలో మే 25 రోజున స్కైలాబ్-2 మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ బృందాన్ని పంపింది. స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన మొదటి సిబ్బంది ప్రత్యామ్నాయ హీట్ షేడ్‌ను ఏర్పాటుచేసి, సోలార్ ప్యానెల్‌ను సరిచేశారు.వ్యోమగాములు ఇక్కడ 28 రోజులు స్కైలాబ్ స్పేస్ స్టేషన్లో గడిపారు. తరువాతి స్కైలాబ్ -3 మిషన్ లో క్రూ 59 రోజులు ఉండగా, నవంబర్‌లో మరో సిబ్బంది 84 రోజులు స్కైలాబ్ స్టేషన్లో ఉన్నారు. సమస్య అక్కడ మొదలైంది..! స్కైలాబ్ స్పేస్స్టేషన్కు రెండు రకాల గైరోస్కోప్స్ ఉన్నాయి. మొదటిది కంట్రోల్ మూమెంట్. ఇది స్పేస్ స్టేషన్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతోంది. రెండోది రేట్ గైరోస్కోప్. స్పేస్ స్టేషన్ ఏ రేట్‌తో కదులుతుందే అనే విషయాన్ని చెప్తుంది. వీటిలో కంట్రోల్ మూమెంట్ గైరోస్కోప్ పనిచేయడం ఆగిపోయింది. ఈ విషయాన్ని నాసా 1975లో గుర్తించింది. ఆ సమయంలో స్కైలాబ్ భూమి నుంచి 433 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అయితే వాతావారణ సాంద్రత, గ్రావిటీ, ఆయా వస్తువు ద్రవ్యరాశి కారణంగా 430 కిమీ కక్ష్యలో తిరిగే ఏ వస్తువైనా కొద్దికొద్దిగా భూమిపైకి వచ్చే అవకాశం ఉంది. నాసా అంచనా ప్రకారం 1980 వరకు కక్ష్యలో ఉంటుందని భావించింది. ఇంకా స్కైలాబ్‌లో ఒక ఏడాదికి సరిపోయే పుడ్, ఆక్సిజన్ ఉన్నాయి. మరికొన్ని పరికరాలను యాడ్ చేసి మరో ఐదు సంవత్సరాల మేర స్కైలాబ్ను ఉంచాలని నాసా భావించగా...మెల్లమెల్లగా స్కైలాబ్ తన కక్ష్యను కోల్పోతూ వచ్చింది. వెంటాడిన దురదృష్టం..! ఎలాగైనా స్కైలాబ్ను తిరిగి యథాస్థానంలో ఉంచాలనుకున్న నాసా చర్యలకు సోలార్ ఫ్లేర్ అడ్డంకిగా మారింది. సోలార్ ఫ్లేర్స్‌తో వాతావరణంలో డెన్సిటీ పెరిగింది. దీంతో 1980లో వస్తోందనకున్న ఉపద్రవం 1979లో రానుందని నాసా గ్రహించింది. ఇక చేసేదేమి లేక స్కైలాబ్ భూమిపై పడనుందని అమెరికా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఎక్కడ పడుతుందనే విషయం ఎవరికీ తెలియదు. లక్ష వరకు ప్రాణాలు పోయే అవకాశం..! స్కైలాబ్ ఎక్కువ శాతం 1979లో జులై 10 నుంచి జులై 14లోపు సౌతాఫ్రికాకు వెయ్యి కిలోమీటర్ల సమీపంలో సముద్రంలో పడుతోందని నాసా అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం...1979 జులై 11 న రాత్రి భూమి వైపుగా రావడం మొదలుపెట్టింది. స్కైలాబ్ భూ వాతావరణంలోకి రాగనే వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో పడే అవకాశం ఉందని నాసా తెలిపింది. సుమారు 2 వేల ముక్కలుగా స్కైలాబ్ భాగాలు విడిపోతాయని పేర్కొంది. స్కైలాబ్ ఒకవేళ జనవాసాల మీద పడితే లక్షకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అది కాస్త 5000కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ మహాసముద్రంలో పడగా..మిగతావి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పడ్డాయి. ఆస్ట్రేలియాలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు ఊపిరిపిల్చుకున్నాయి. మిల్లీమీటర్ సైజులో ఉన్న ఒక చిన్న అంతరిక్ష శకలం..స్కైలాబ్‌కు తాకడంతో భారీ ప్రమాదాన్నే కొనితెచ్చింది. అప్పటినుంచి నాసా అంతరిక్ష ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్కైలాబ్ కనిపెట్టినవి..! ఆ సమయంలో అంత ఎత్తున వ్యోమగాములు మరమ్మతులు చేయడం అదే తొలిసారి. సౌర తుఫాన్‌కు సంబంధించిన విషయాలను స్కైలాబ్ అందించింది. స్పేస్‌లో మానవుడు ఎలా ఉండాలో తదితర విషయాలు మొదటిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లో గ్రావిటీ వంటి విషయాలను కూడా తెలుసుకోవడంలో ఉపయోగపడింది. చదవండి: టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..! -
‘స్కైలాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : స్కైలాబ్ నటీనటులు : సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ: బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ నిర్మాతలు : పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్ దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: రవితేజ గిరిజాల విడుదల తేది : డిసెంబర్ 4, 2021 విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్’.నిత్యామీనన్ హీరోయిన్. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై సినిమాపై ఆసక్తి పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘స్కైలాబ్’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1979 నాటికాలంలో సాగుతుంది. కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి గ్రామానికి చెందిన గౌరి(నిత్యామీనన్).. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకుని హైదరాబాద్‌లో ప్రతిబింబం పత్రికలో చేరుతుంది. ఎప్పటికైనా తన పేరుతో వార్త అచ్చువేయించుకుంటానని తండ్రితో సవాల్ చేస్తుంది. అయితే తన రాతల వల్ల పత్రికకు ఇబ్బందులు తప్ప లాభమేమిలేదని పత్రిక ఎడిటర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. రైటర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గౌరి. అదే గ్రామానికి చెందిన డాక్టర్ ఆనంద్(సత్యదేశ్) సస్పెండై సొంతూరికి వచ్చి క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం ఎక్కువ. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. వీరితో పాటు అదేగ్రామానికి చెందిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతుంటాడు. వివాదంలో ఉన్న తాత భూమి అమ్మితే చాలు.. అప్పులన్ని తీర్చి హాయిగా బతకొచ్చని భావిస్తాడు. ఇలా వేరు వేరు సమస్యలో సతమతమవుతున్న ఈ ముగ్గురు.. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందనే పుకార్లు వస్తాయి. ఆ సమమంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్కైలాబ్ నిజంగానే బండలింగంపల్లి గ్రామంలో పడిందా? ఈ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్ ఆనంద్, సుభేదార్ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్’మిగతా కథ. ఎవరెలా చేశారంటే... జర్నలిస్ట్ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. హీరోయిన్లా కాకుండా.. గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక సత్యదేశ్, రాహుల్ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. డాక్టర్ ఆనంద్‌గా సత్యదేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆనంద్ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ? 1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అప్పట్లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే కథ ఎప్పటికీ ముందుకుసాగదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో అయినా కథలో వేగం పెరుగుతుందనుకుంటే.. అక్కడ కూడా అంతే. స్లోగా సాగుతూ.. బోర్ కొట్టిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్స్, సంభాషణలు బాగున్నాయి. అలాగే అంతర్లీనంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా సందర్భానుసారం వస్తాయి. రీ రికార్టింగ్ కూడా ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ‘స్కైలాబ్’ప్రయోగం విఫలమైనా.. ప్రయత్నం మాత్రం బాగుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
డిసెంబర్ మొదటి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
Telugu Upcoming Web Series & Movies Of December 2021: కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వధారణమైపోయింది. మరి డిసెంబర్ ప్రారంభంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో చూసేద్దాం.. అఖండ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలవుతోంది. మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు. తడప్ ఆర్ఎక్స్ 100.. తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తడప్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి తడప్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్గా కనిపించనుంది. మిలాన్ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా డిసెంబర్ 3వ తేదీన రిలీజవుతోంది. బ్యాక్ డోర్ పూర్ణ లీడ్ రోల్లో నటించిన మూవీ బ్యాక్ డోర్. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. బ్యాక్ డోర్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్కైలాబ్ సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో వచ్చే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ♦ ద పవర్ ఆఫ్ ది డాగ్ (హాలీవుడ్) - డిసెంబర్ 1 ♦ లాస్ ఇన్ స్పేస్ (వెబ్ సిరీస్) - డిసెంబర్ 1 ♦ కోబాల్ట్ బ్లూ (హాలీవుడ్) - డిసెంబర్ 3 ఆహా ♦ మంచి రోజులు వచ్చాయి (తెలుగు) - డిసెంబర్ 3 అమెజాన్ ప్రైమ్ ♦ ఇన్ సైడ్ ఎడ్జ్ (హిందీ వెబ్‌సిరీస్) - డిసెంబర్ 3 జీ5 ♦ బాబ్ విశ్వాస్(హిందీ) - డిసెంబర్ 3 బుక్ మై షో ♦ ఎఫ్9 (తెలుగు) - డిసెంబర్ 1 -
అందుకే నిర్మాతగా మారాను: నిత్యా మీనన్
‘‘నిర్మాతగా ‘స్కైలాబ్’ నా తొలి చిత్రం. డబ్బులు సంపాదించడానికి నిర్మాతను కాలేదు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ‘స్కైలాబ్’ సినిమా ఆరంభం నుంచే నేను నిర్మాత కాదు. ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను’’ అని నిత్యా మీనన్ అన్నారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రకథానాయిక, నిర్మాత నిత్యా మీనన్ మాట్లాడుతూ – ‘‘స్కైలాబ్ గురించి దర్శకుడు విశ్వక్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. స్కైలాబ్ గురించి మా తల్లిదండ్రులతో చర్చించగా, అప్పట్లో స్కైలాబ్ గురించిన భిన్నమైన కథనాలను చెప్పారు. స్కైలాబ్ భూమి మీద పడిపోతే చనిపోతామనే భ్రమలో చాలామంది తాము కూడబెట్టుకున్న ఆస్తులను ఖర్చు చేసేశారట. మరికొందరైతే బంగారు నాణేలు మింగేశారని చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి అంశాలు నేనీ సినిమా చేసేందుకు దోహదం చేశాయి. బండిలింగంపల్లిలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథే ఈ చిత్రం. ఇందులో నేను జర్నలిస్టు గౌరి పాత్రలో కనిపిస్తాను. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలతో నాకు పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే గౌరి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తెలంగాణ యాసలో మాట్లాడాను. అది చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇది థియేట్రికల్ సినిమా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నందు వల్లే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాను. లాక్డౌన్లో కాస్త బ్రేక్ దొరికింది. ప్రస్తుతం తమిళంలో ధనుశ్‌తో, మలయాళంలో 19(1)ఎ చిత్రాలతో పాటు హిందీలో ‘బ్రీత్ 3’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నిర్మాతగా వినూత్న సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.