Nithya Menon Shocking Comments on Prabhas Issue - Sakshi
Sakshi News home page

ఆ విషయాన్ని పెద్దది చేసి రాశారు.. ప్రభాస్‌ ఇష్యూపై నిత్యా షాకింగ్‌ కామెంట్‌

Published Sat, Dec 11 2021 4:01 PM | Last Updated on Sat, Dec 11 2021 4:09 PM

Nithya Menon Shocking Comments on Prabhas Issue - Sakshi

ఆ విషయాన్ని పెద్దది చేసి రాశారు... చాలా బాధపడ్డాను

‘అలా మొదలైంది’చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ నిత్యామీనన్‌.. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరరైంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తుంది ఈ భామ. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్‌ 4న విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్‌ నిర్మాతగా కూడా మారింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిత్యా.. గతంలో చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.  

ఈ క్రమంలో ప్రభాస్‌ ఇష్యూ గురించి మాట్లాడూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాను తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే టాలీవుడ్‌ సినిమాలు చూసేదాన్నికాదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్‌ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని,ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైంది. ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికి బాధ పెడుతుంది’అని నిత్యా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement