
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాను రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌కు సంబంధించిన ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.
హై అలర్ట్.. హీట్ వేవ్స్ మరింత పెరగనున్నాయి అని ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
దీంతో వచ్చేనెలలోనే ది రాజాసాబ్ టీజర్ విడుదల కానుందని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని.. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే తనతో డబ్బింగ్ పూర్తి చేసి టీజర్ విడుదల తేదీని రివీల్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి సందడి చేయనుంది.
HIGH ALERT…‼️
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025