మారుతి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.
భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్.
సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment