sanjay datt
-
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆగిపోయిన దర్శన్ సినిమాలు.. సంజయ్ దత్ మాదిరి జైలు నుంచి రాగలడా..?
రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా దర్శన్ ఉండటం వల్ల తను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు పూర్తి కావచ్చిన డెవిల్ సినిమా షూటింగ్ ఇప్పుడు అర్దాంతరంగ ఆగిపోయింది. అయితే, దర్శన్ జైల్లో ఉండగానే ‘డెవిల్’ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చా అనే చర్చ కన్నడ చిత్రసీమలో జరుగుతోంది. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉదంతాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలులో శిక్ష అనుభవిస్తూనే సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. దాన్ని ఉదాహరణగా పెట్టుకుని దర్శన్ కూడా ‘డెవిల్’ సినిమాను పూర్తి చేయగలడా? అని ఆయన అభిమానులు చర్చిస్తున్నారు. ‘కాటేరా’ సినిమా తర్వాత దర్శన్ ‘డెవిల్’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిలన్ ప్రకాష్, దర్శన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'డెవిల్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 'డెవిల్' సినిమా షూటింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి స్థానంలో ఉన్నప్పటికీ దర్శన్ జైలులోనే ఉండాల్సి రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ దత్ జైలులో ఉండగానే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. 2013లో పెరోల్ పొంది ‘జంజీర్’ సినిమాతో పాటు పోలీస్ గిరి చిత్రాల్లో నటించారు. జైలులో శిక్ష అనుభవిస్తూనే ఈ రెండు సినిమాల పనులను ఆయన పూర్తి చేశారు.ఇప్పుడు దీన్నే ఉదాహరణగా తీసుకుని దర్శన్ ఫ్యాన్స్ కూడా ‘డెవిల్’ సినిమా తీస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. దర్శన్ కూడా పెరోల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొనవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఇది ఇప్పట్లో సాధ్యం కాదని న్యాయవాదులు అంటున్నారు.దర్శన్ ఇప్పటికీ నిందితుడుగానే ఉన్నారని వారు తెలుపుతున్నారు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టులో వాదనలు జరగాలి. ఆ తర్వాత దర్శన్ నేరం చేసినట్లు దోషిగా తేలితే శిక్షను న్యాయమూర్తి ప్రకటిస్తారు. ఆ తర్వాతే పెరోల్‌పై బయటకు వచ్చి షూటింగ్లో పాల్గొనవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. అదికూడా అర్దాంతరంగా ఆగిపోయిన సినిమాల్లో మాత్రమే నటించే ఛాన్స్ ఉంటుందని వారు తెలిపారు. చార్జిషీట్ సమర్పించే వరకు అంతా వేచి చూడాల్సిందేనని లాయర్లు తెలుపుతున్నారు. -
రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే పిల్లలకు పేర్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఎందుకంటే?
యాక్షన్ ప్రిన్స్, శాండల్‌వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్‌కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది. అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా.. ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్‌లో ఆయనకు మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా.. అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు. దీనిపై మాట్లాడిన ధృవ సర్జా.. అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు. -
'డబుల్ ఇస్మార్ట్' కోసం బిగ్ బుల్‌ను దించిన పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. 'లైగర్'తో దెబ్బతిన్న పూరీ 'డబుల్ ఇస్మార్ట్' కోసం పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. (ఇదీ చదవండి: సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే) ఇక సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కుడా రిలీజ్ చేశారు. అందులో సిగరెట్ తాగుతూ సంజయ్ దత్ కనిపిస్తుండగా ఆయనపై గన్స్ అన్నీ పాయింట్ చేసి ఉన్నాయి. ఇందులో 'బిగ్ బుల్'గా సంజయ్ దత్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. గతంలో కేజీఎఫ్ 2లో అధీర పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై సంజయ్ కూడా ట్వీట్ చేశాడు. డైరెక్టర్ పూరిజగన్నాధ్, రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్లో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ సంజయ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా) ఇక 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది. It takes me immense pride to be working with the director of the masses #PuriJagannadh ji and the young energetic Ustaad @ramsayz 🤗 Glad to be Playing the #BIGBULL in this sci-fi mass entertainer #DoubleISMART Excited to be teaming up with this super-talented team and Looking… pic.twitter.com/SrIAJv6yy1 — Sanjay Dutt (@duttsanjay) July 29, 2023 -
కేజీఎఫ్2 ఫస్ట్ రివ్యూ: వరల్డ్ క్లాస్ మూవీ.. క్లైమాక్స్ చూసి షాకవుతారు!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎన్నో రికార్డులను సృష్టించింది. దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ చరిత్రలో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇక ఇప్పుడు అందరి చూపు కేజీఎఫ్ చాప్టర్ 2 పైన పడింది. మరో నాలుగు రోజుల్లో..అంటే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్’ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతోనే యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలు పెంచుకోవడం సహజం. అందుకు తగ్గట్టుగానే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో కేజీఎఫ్ 2 విడుదల కోసం సీనీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుంది? ఆర్ఆర్ఆర్ రికార్డుని బద్దలు కొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఐదు స్టార్లు ఇచ్చాడు ఓ సినీ క్రిటిక్. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని తనకు తాను డప్పు కొట్టుకునే ఉమైర్ సంధు సినిమా రిలీజ్‌కు ముందే కేజీఎఫ్2 చూశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. కేజీఎఫ్ కేవలం కన్నడ బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ అని ప్రశంసల జల్లు కురిపించాడు. ‘కేజీఎఫ్ 2 కన్నడ ఇండస్ట్రీకి కిరీటం లాంటింది. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు.. ప్రతి సీన్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. డైలాగ్స్ చాలా షార్ప్‌గా, ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సంగీతం బాగుంది. బీజీఎం అయితే అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా టెరిఫిక్‌గా ఉంది. కేజీఎఫ్ 2 కేవలం శాండల్‌వుడ్ బాక్ల్‌బస్టర్ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ అయితే అందరికి షాకిస్తుంది’అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
సల్మాన్, సంజయ్‌తో సహా జైలు కూడు తిన్న బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుదు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోరి ఆర్థర్ రోడ్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అయితే జైల్లో ఖైదు అయిన వారిలో ఆర్యన్ ఏమీ ఫస్ట్ సెలబ్రిటీ కాదు..అతని కంటే ముందు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు జైలుకెళ్లారు. కొంత మంది బెయిల్‌పై విడుదలైయితే...మరికొంత మంది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంతకీ జైల్లో చిప్పకూడు తిన్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే.. సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ ఐదేళ్ల శిక్ష విధించింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు., మొదట ఆయన్ను ఉంచింది ఆర్థర్ రోడ్ జైలులోనే. సంజయ్ దత్ 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో సంబంధం ఉందనే అభియోగంపై బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించాడు. మొదట్లో అతన్ని ర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచి, ఆ తర్వాత పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. ఫర్దీన్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్ 2001లో ముంబై పోలీసులకు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. ఫర్దీన్ ఖాన్ కేసు కోర్టుకు కూడా వెళ్లింది. ఆయన కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్సకు అంగీకరించడంతో ఎలాంటి శిక్షా పడలేదు. సొనాలి బింద్రే ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ వివాదంలో ఒక మతాన్ని కించపరిచిన కారణంగా జైలు కెళ్లిన సోనాలి బింద్రే. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయింది రియా చక్రవర్తి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అతనికి డ్రగ్స్ సరఫరా చేసిన పలువురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో, సుశాంత్ అప్పటి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షావిక్ చక్రవర్తి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు చిక్కుకున్న తర్వాత రియా చక్రవర్తిని సెప్టెంబర్ 7 న ఎన్‌సిబి విచారించింది. ఒక నెల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నటి బెయిల్‌పై విడుదలైంది. షైనీ అహుజా పనిమనిషిని అత్యాచారం చేసిన కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన శైనీ ఆహూజా. 2009 జూన్‌లో అరెస్ట్ అయిన గ్యాంగ్‌స్టర్ హీరో షైనీ అహుజాకు 2011 లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు ఆయన ఆర్థర్ రోడ్ జైలులో ఖైదీగా కాలం గడిపాడు. రాజ్‌కుంద్రా ఇటీవల అశ్లీల చిత్రాల నిర్మాణం, ముంబైల్ యాప్స్‌లో వారి పబ్లిష్ చేశారనే అభియోగం కింద శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి, బెయిల్ మంజూరయ్యేంత వరకు రెండు నెలల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. -
సంజయ్ దత్‌ను కలిసిన కంగనా
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ శుక్రవారం సీనియర్ నటుడు సంజయ్ దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి దిగిన ఫోటోను ఆమె తన ట్వీటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ సంజయ్ సర్, నేను ఒకే హోటల్లో ఉన్నామని తెలిసి ఆయనను కలిశాను. ఆయన గతంలోకంటే చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని కంగనా ట్వీట్ చేశారు. జయలలిత బయోపిక్ తలైవి సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న కంగనా ఇవాళ ఉదయం సంజు బాబాను కలిశారు. మరోవైపు సంజయ్ దత్ యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కాగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సంజయ్ దత్ విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. -
సంజయ్ అనారోగ్యం నన్ను కలచివేస్తోంది: మెగాస్టార్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సీనీయర్ నటుడు సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ 3వ స్టేజ్‌లో ఉన్నట్లు వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. ఆనంతరం ఆయన నిన్న ముంబై ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన ఈ వ్యాధి నుంచి బయటపడాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి సైతం సంజయ్ దత్ ఆరోగ్యంపై చలిస్తూ ట్వీట్ చేశాడు. (చదవండి: సంజయ్ దత్ ఆరోగ్యంపై స్పందించిన మాన్యత) Dearest @duttsanjay bhai , pained to know you are confronted with this health situation.But you are a fighter & have vanquished many crises over the years. Have no doubts you will come out of this with flying colors too.All our love and prayers for your speedy recovery. pic.twitter.com/uMTf3sN5R3 — Chiranjeevi Konidela (@KChiruTweets) August 12, 2020 ‘‘డియర్ సంజయ్ భాయ్... మీరు ఇంతటి అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. కానీ మీరు ఓ ఫైటర్. ఎన్నో ఏళ్లుగా అనేక ఓడిదుడుగులను చుశారు. వాటిని మీరు అధిగమించారు కూడా. అలాగే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కూడా త్వరలో కోలుకుంటారనండంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యాధి నుంచి కూడా తప్పక బయటపడతారని ఆశిస్తున్నాను. మీరు త్వరలో కోలుకోని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ మెగాస్టార్ ట్వీట్ చేశాడు. (చదవండి: సంజయ్‌దత్‌కు క్యాన్సర్!) -
నో నాన్ వెజ్
సంజయ్ దత్ మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. ఎంత ఇష్టం అంటే ముంబైలో ఆయన రెసిపీతో ఓ హోటల్లో ‘చికెన్ సంజు బాబా’ అనే వంటకాన్ని కూడా వడ్డిస్తారట. అయితే ఇప్పుడు ఆయన నాన్ వెజ్‌కి నో చెబుతున్నారట. సంజయ్ శాకాహారిగా మారిపోయారని బాలీవుడ్ టాక్. లాక్ డౌన్ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారట సంజు భాయ్. క్వారంటైన్ సమయం మొదలయిన దగ్గర నుంచి కేవలం శాకాహారాన్నే తీసుకుంటున్నారని సమాచారం. ఇదే పద్ధతిని సంజయ్ దత్ భవిష్యత్తులోనూ పాటించాలనుకుంటున్నారట. -
‘మున్నాభాయ్’ నటుడు అదృశ్యం.. మూడేళ్లయినా
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా ‘ మున్నాభాయ్ ఎంబీబీఎస్’. ఈ సినిమాని తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ గా రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన పాత్రను బాలీవుడ్లో విశాల్ థక్కర్ పోషించాడు. కాగా మున్నాభాయ్ పార్ట్ 3 కోసం ఇటీవల చర్చలు జరుగుతుండగా ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. మూడేళ్ల క్రితం డిసెంబరు 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ ఆచూకీ నేటికీ దొరకకపోవడం లేదు. విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిజానికి అతడు జీవించి ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు. డిసెంబరు 31, 2015న రాత్రి 10:30 గంటల సమయంలో ‘స్టార్ వార్స్’ సినిమాకు వెళ్దామని విశాల్ తన తల్లిని అడిగాడు. తాను రానని చెప్పడంతో ఆమె వద్ద రూ. 500 తీసుకుని ఒక్కడే వెళ్లాడు. ఆ తర్వాత తండ్రికి మెసేజ్ చేస్తూ న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నానని, ఉదయం వస్తానని తెలిపాడు. ఉదయం ఇంటికి వస్తానన్న కుమారుడు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి దుర్గ (60) జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాల్ అదృశ్యంపై పోలీసులు మాట్లాడుతూ.. ‘2016 జనవరి 1వ తేదీన థానేలోని గాడ్ బందర్ రోడ్డులో ఉదయం 11:45 గంటలకు ప్రియురాలితో ఉన్నాడు. షూటింగ్ కోసం అంధేరి వెళ్లినట్లు సమాచారం. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్నది అతడి ఫేస్బుక్లో చివరి పోస్ట్. న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం 12:10 నిమిషాలకు ఆ పోస్ట్ చేశాడు. తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అప్పటినుంచీ అతడి బ్యాంకు లావాదేవీలు జరగలేదు’ అని చెప్పారు. విశాల్ అదృశ్యం కావడానికి సరిగ్గా రెండు నెలల ముందు అతడి ప్రియురాలు విశాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే,ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు సమాచారం. సినిమాలు లేకపోవడం, అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అతడు మానసికంగా దెబ్బతిని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మూడేళ్లయినా తమ కుమారుడి ఆచూకి లభించకోవడంలో విశాల్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - సంజయ్ దత్
-
మరోసారి పెరోల్ ఇవ్వండి: సంజయ్‌దత్
సాక్షి, ముంబై: తన భార్య మాన్యతా దత్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 30 రోజులపాటు పెరోల్ మంజూరు చేయాలని సంజయ్ దత్ పుణే రీజియన్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సెలవు పొడగించాలని ఆయన మూడు రోజుల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కమిషనర్ ఇంతవరకు ఆయన ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మాన్యతా దత్‌కు కాలేయంలో ట్యూమర్ కావడంతో శుక్రవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు క్షయ కూడా సోకినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా సంజయ్ దత్ గత డిసెంబరు 21న కూడా 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. భార్య ఆరోగ్యం కోసమే ఈ ప్రయత్నమని దత్ సన్నిహితులు తెలిపారు.