
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ శుక్రవారం సీనియర్ నటుడు సంజయ్ దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి దిగిన ఫోటోను ఆమె తన ట్వీటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ సంజయ్ సర్, నేను ఒకే హోటల్‌లో ఉన్నామని తెలిసి ఆయనను కలిశాను. ఆయన గతంలోకంటే చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని కంగనా ట్వీట్ చేశారు.
జయలలిత బయోపిక్ తలైవి సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న కంగనా ఇవాళ ఉదయం సంజు బాబాను కలిశారు. మరోవైపు సంజయ్ దత్ యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కాగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సంజయ్ దత్ విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు.