
యాక్షన్ ప్రిన్స్, శాండల్‌వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్‌కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది.
అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా..
ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్లో ఆయనకు మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా.. అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు.
దీనిపై మాట్లాడిన ధృవ సర్జా.. అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment