మరోసారి పెరోల్ ఇవ్వండి: సంజయ్‌దత్ | Give parole again: Sanjay Dutt | Sakshi
Sakshi News home page

మరోసారి పెరోల్ ఇవ్వండి: సంజయ్‌దత్

Published Sat, Jan 11 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

Give parole again: Sanjay Dutt

సాక్షి, ముంబై: తన భార్య మాన్యతా దత్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 30 రోజులపాటు పెరోల్ మంజూరు చేయాలని సంజయ్ దత్ పుణే రీజియన్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సెలవు పొడగించాలని ఆయన మూడు రోజుల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కమిషనర్ ఇంతవరకు ఆయన ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మాన్యతా దత్‌కు కాలేయంలో ట్యూమర్ కావడంతో శుక్రవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు క్షయ కూడా సోకినట్టు తెలిసింది.


     ఇదిలా ఉండగా సంజయ్ దత్ గత డిసెంబరు 21న కూడా 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. భార్య ఆరోగ్యం కోసమే ఈ ప్రయత్నమని దత్ సన్నిహితులు తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement