Yash KGF Chapter 2: First Review By Film Critic Umair Sandhu, Viral On Social Media - Sakshi
Sakshi News home page

KGF Chapter 2 First Review: టెరిఫిక్ పెర్ఫార్మన్స్ .. షాకింగ్‌గా క్లైమాక్స్‌!

Published Sun, Apr 10 2022 9:43 AM | Last Updated on Sun, Apr 10 2022 10:09 AM

KGF Chapter 2: First Review By Film Critic Umair Sandhu - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎన్నో రికార్డులను సృష్టించింది. దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ చరిత్రలో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇక ఇప్పుడు అందరి చూపు కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 పైన పడింది.

మరో నాలుగు రోజుల్లో..అంటే ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్‌’ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతోనే యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలు పెంచుకోవడం సహజం. అందుకు తగ్గట్టుగానే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించామని చిత్ర యూనిట్‌ నమ్మకంగా చెబుతోంది. దీంతో కేజీఎఫ్‌ 2 విడుదల కోసం సీనీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుంది? ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డుని బద్దలు కొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్‌ రివ్యూ అంటూ ఐదు స్టార్లు ఇచ్చాడు ఓ సినీ క్రిటిక్‌. ఓవర్‌సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిని అని తనకు తాను డప్పు కొట్టుకునే ఉమైర్‌ సంధు సినిమా రిలీజ్‌కు ముందే కేజీఎఫ్‌2 చూశానంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. కేజీఎఫ్‌ కేవలం కన్నడ బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదని.. ఇదొక వరల్డ్‌ క్లాస్‌ మూవీ అని ప్రశంసల జల్లు కురిపించాడు.

‘కేజీఎఫ్‌ 2 కన్నడ ఇండస్ట్రీకి కిరీటం లాంటింది. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు.. ప్రతి సీన్‌ అదిరిపోయింది. యాక్షన్‌ సీన్స్‌, సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. డైలాగ్స్‌ చాలా షార్ప్‌గా, ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సంగీతం బాగుంది. బీజీఎం అయితే అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా టెరిఫిక్‌గా ఉంది. కేజీఎఫ్‌ 2 కేవలం శాండల్‌వుడ్‌ బాక్ల్‌బస్టర్‌ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్‌ క్లాస్‌ మూవీ. యశ్‌, సంజయ్‌ దత్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌ అయితే అందరికి షాకిస్తుంది’అని ఉమైర్‌  సంధు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో  శ్రీనిధి హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement