KGF ఫ్యాన్స్‌ బీ రెడీ.. ఛాప్టర్‌-3 ఎప్పుడంటే | Yash's KGF 3 Update: Movie To Release In 2025 | Sakshi
Sakshi News home page

KGF-3 Update: కేజీఎఫ్ ఫ్యాన్స్‌ బీ రెడీ.. ఛాప్టర్‌-3 ఎప్పుడంటే

Published Sat, Sep 30 2023 9:28 AM | Last Updated on Sat, Sep 30 2023 10:35 AM

Yash's KGF 3 Update: Movie To Release In 2025 - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పేరు మారుమ్రోగింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్‌ చేసింది. దీంతో 2022లో  రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్‌. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.  

(ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్‌)

తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్‌డేట్‌ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్‌ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు​ 2024లో ప్రారంభించి..  2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం.

కేజీఎఫ్‌- ఛాప్టర్‌ 2  ఎండింగ్​లో పార్ట్‌-​ 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్​క్లూజన్​ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్​ హౌస్​ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్​డేట్​ను షేర్​ చేయలేదు. ప్రశాంత్​ నీల్ కూడా ప్రభాస్​తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్‌ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్​డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.​​

(ఇదీ చదవండి: విశాల్​ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్‌.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement