KGF Chapter 2 Movie Box Office Collections Day 6, Deets Inside - Sakshi

KGF 2 Box Office Collections: రాకీభాయ్‌ ఊచకోత.. ‘కేజీయఫ్‌ 2’ కలెక్షన్స్‌ ఎంతంటే..

Apr 20 2022 2:39 PM | Updated on Apr 20 2022 3:16 PM

KGF 2 Box Office Collection Day 6 - Sakshi

కేజీయఫ్ 2తో రాకీ భాయ్ ఇండియన్‌  బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్నాడు. యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకొని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి రికార్డును సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అక్కడ ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 238.70 కోట్లను రాబట్టింది. మంగళవారం ఒక్క రోజే 19.14 కోట్లను వసూలు చేయడం విశేషం. 

టాలీవుడ్‌లో  తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్‌ సాధించిన ఈ చిత్రం.. 6 రోజుల్లో రూ.62.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం  ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు  రజనీకాంత్‌ ‘రోబో’ పేరిట ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో 'కేజీయఫ్‌ 2' చిత్రానికి రూ. 74 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం .. మరో రెండు, మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుంది.

ఓవర్సీస్‌లోనూ రాకీభాయ్‌ హవా కొనసాగుతుంది. యూఎస్‌లో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. అక్కడ  ఈ చిత్రం ఏకంగా ఐదు రోజుల్లో 5 మిలియన్‌ డాలర్లను రాబట్టింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌, హీరోయిన్‌గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement