ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్‌లో అయితే ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో రూ.350 కోట్లకు పైగా రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దంగల్, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రూ. వెయ్యికోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్ 2’ నిలిచింది. ఇక టాలీవుడ్‌లోనూ కేజీయఫ్ 2 ఇంకా తగ్గలేదు. 15 రోజుల్లో ఈ చిత్రం 77.31 కోట్ల షేర్‌ని రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్‌గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు.
#KGFChapter2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office..
— Ramesh Bala (@rameshlaus) April 30, 2022
Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie
Comments
Please login to add a commentAdd a comment