KGF Chapter 2 Movie Twitter Review In Telugu | Actor Yash | Srinidhi Shetty | Prashanth Neel - Sakshi
Sakshi News home page

KGF Chapter 2 Twitter Review: ‘కేజీయఫ్‌ 2’ టాక్‌ ఎలా ఉందంటే..

Published Thu, Apr 14 2022 6:12 AM | Last Updated on Thu, Apr 14 2022 8:45 AM

KGF Chapter 2 Movie Twitter Review In Telugu - Sakshi

‘కేజీఎఫ్ చాపర్ట్ 2’ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ మొదటి పార్ట్‌ ‘కేజీఎఫ్‌’ భారీ విజయం సాధించడమే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం.. భారతీయ బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తుందంటే.. ప్రేక్షకులను అంచనాలు ఓ  రేంజ్‌లో ఉంటాయి. అందుకు తగ్గట్టే కేజీఎఫ్‌ 2 తెరకెక్కించానని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో కేజీఎఫ్‌ 2పై మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది.

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు  10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఓవర్సీస్‌తో పాటు  పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

 హీరో ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని ట్వీట్‌ చేస్తున్నారు.

బయట ప్రచారం చేసినంతగా కేజీయఫ్‌ 2 లేదని, రెగ్యులర్‌ మాస్‌ మూవీలాగే ఉంది. కేజీయఫ్‌ 2 మ్యాజిక్‌ని రీక్రియేట్‌ చేయడంలో ప్రశాంత్‌ నీల్‌ విఫలమయ్యాడని చెబుతున్నారు. 

కేజీఎఫ్‌ మూవీ ఫస్టాఫ్‌ అదిరిపోయిందని, యశ్‌ ఎంట్రీ, ఇంటర్వెల్‌ సీన్స్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement