Manchi Rojulu Vachayi Movie
-
డిసెంబర్ మొదటి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
Telugu Upcoming Web Series & Movies Of December 2021: కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వధారణమైపోయింది. మరి డిసెంబర్ ప్రారంభంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో చూసేద్దాం.. అఖండ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలవుతోంది. మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు. తడప్ ఆర్ఎక్స్ 100.. తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తడప్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి తడప్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్గా కనిపించనుంది. మిలాన్ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా డిసెంబర్ 3వ తేదీన రిలీజవుతోంది. బ్యాక్ డోర్ పూర్ణ లీడ్ రోల్లో నటించిన మూవీ బ్యాక్ డోర్. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. బ్యాక్ డోర్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్కైలాబ్ సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో వచ్చే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ♦ ద పవర్ ఆఫ్ ది డాగ్ (హాలీవుడ్) - డిసెంబర్ 1 ♦ లాస్ ఇన్ స్పేస్ (వెబ్ సిరీస్) - డిసెంబర్ 1 ♦ కోబాల్ట్ బ్లూ (హాలీవుడ్) - డిసెంబర్ 3 ఆహా ♦ మంచి రోజులు వచ్చాయి (తెలుగు) - డిసెంబర్ 3 అమెజాన్ ప్రైమ్ ♦ ఇన్ సైడ్ ఎడ్జ్ (హిందీ వెబ్‌సిరీస్) - డిసెంబర్ 3 జీ5 ♦ బాబ్ విశ్వాస్(హిందీ) - డిసెంబర్ 3 బుక్ మై షో ♦ ఎఫ్9 (తెలుగు) - డిసెంబర్ 1 -
ఆహాలో ‘మంచి రోజులు వచ్చాయి’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ వేదికగా సందడి చేసేందుకు సైతం రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లామ్ఫాం ఆహా వేదికగా ‘మంచి రోజులు వచ్చాయి’డిసెంబర్ 3నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా కాగా ఎస్కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
20 రోజుల్లో కథ రాసుకుని..30 రోజుల్లో సినిమా తీశా..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కరోనా సమయంలో సరదాగా 20 రోజుల్లో కథను రాసుకుని, 30రోజుల్లో మంచిరోజులు వచ్చాయి సినిమాను తీశానని ఆ సినిమా దర్శకుడు మారుతి పేర్కొన్నారు. ఆదివారం అనుశ్రీ సినిమా థియేటర్ మ్యాట్నీషోకు ఆయన, హీరో సంతోష్ శోభన్, నటులు సుదర్శన్, శ్రీనివాసరావు, నిర్మాత ఎస్కేఎన్ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ అందరూ థియేటర్లకు ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ కరోనా కాలంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని భయం అనే కాన్సెప్ట్‌తో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా తీశామన్నారు. తమ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేసినా నష్టం లేకపోయినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావాలన్న లక్ష్యంతో విడుదల చేశామన్నారు. సినిమా మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటానన్నారు. గోపీచంద్ హీరోగా ప్రతిరోజు పండగ నిర్మాణ టీమ్‌తో కమర్షియల్ సినిమా తీస్తామన్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మారుతి తెలిపారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ యూవీ క్రియేషన్స్, వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమాలు చేస్తున్నానన్నారు. పాలసీమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానుభావుడు సినిమా ద్వారా ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను నటునిగా వచ్చానని, దర్శకుడు మారుతి ఈ సినిమా ద్వారా మంచి క్యారెక్టర్ ఇచ్చి బ్రేక్ ఇచ్చారన్నారు. అనుశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ హరిబాబు, అనుశ్రీ థియేటర్ మేనేజర్ శంకర్, విష్ణు, రాజేష్ పాల్గొన్నారు. -
ఓసీడీ ఉంది..ఎప్పటి నుంచో అవి వాడుతున్నా: హీరోయిన్
Mehreen Reveals About Her Real Life Ocd Disease: 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మెహ్రీన్ ఇటీవలె 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెహ్రీన్..పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది. మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్‌కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.చదవండి: విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్లు అలవాటు. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 ఉంటున్నాయి. నా మేకప్ స్టాఫ్ అయితే చేతులు చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాత నా ఫేస్ టచ్ చేయాలి. మొదటి నుంచి నాకు ఈ ఓసీడీ ఉందని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. చదవండి: ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ -
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచి రోజులు వచ్చాయి నటీనటులు : సంతోష్ శోభన్, మెహరీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మాత : ఎస్కేఎన్ దర్శకత్వం : మారుతి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ విడుదల తేది : నవంబర్ 4, 2021 Manchi Rojulu Vachayi Review: ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు మారుతి. అలా ఆయన తెరకెక్కించిన మరో చిన్న చిత్రమే ‘మంచి రోజులు వచ్చాయి’.దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అతి భయస్తుడైన తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్(అజయ్ ఘోష్)కి కూతురు పద్మ తిరుమల శెట్టి అలియాస్ పద్దు(మెహ్రీన్ ఫిర్జాదా) అంటే ప్రాణం. తన కూతురు అందరి ఆడపిల్లలా కాదని, చాలా పద్దతిగా ఉంటుందని భావిస్తాడు. అయితే పద్దు మాత్రం బెంగళూరు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ.. సహోద్యోగి సంతోష్(సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సంతోషంగా ఉండే గోపాల్ని చూసి అసూయ పడిన పక్కింటి వ్యక్తులు పాలసీ మూర్తి, కోటేశ్వరరావు.. ఆయనలో లేనిపోని భయాలను నింపుతారు. కూతురు ప్రేమ విషయంలో లేనిపోని అనుమానాలను నింపుతారు. దీంతో గోపాలం కూతురి విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. ఎలాగైన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో గోపాల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రియురాలు పద్దు ప్రేమను దక్కించుకోవడానికి సంతోష్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్ ఘోష్ పాత్రే. గుండు గోపాల్‌గా అజయ్ అదరగొట్టేశాడు. కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా తనదైన కామెడీ యాక్టింగ్‌తో నవ్వించాడు. పద్దుగా మెహ్రీన్, సంతోష్‌గా సంతోష్ శోభన్ పాత్రల్లో పెద్దగా వైవిద్యం కనిపించదు కానీ.. వారిమధ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పాలసీ మూర్తిగా శ్రీనివాసరావు అద్భుత నటనను కనబరిచాడు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి, రజిత తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఎలా ఉందంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’కూడా అలాంటి చిత్రమే. ‘భయం’అనే అంశాన్ని తీసుకొని ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికోసం కరోనా పరిస్థితును కూడా వాడుకున్నాడు. ఫస్టాఫ్ అంతా మారుతి మార్క్ కామెడీ, పంచులతో సరదాగా గడిచిపోతుంది. డాక్టర్‌గా వెన్నెల కిశోర్ ఫ్రస్ట్రేషన్, సప్తగిరి అంబులెన్స్ సీన్స్, అప్పడాల విజయలక్ష్మీ ఫోన్ కాల్ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కరోనా పరిస్థితుల సన్నీవేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఊహకందే విధంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో భయం గురించి సాగిన చర్చ ఆలోచింపజేసేదిగా ఉంటుఉంది. ఇక సాంకెతిక విభాగానికి వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.