డిఫరెంట్ జానర్‌లో సినిమాలు తీస్తా: కర్రి బాలాజీ | Karri Balaji Talk About Back Door Movie | Sakshi
Sakshi News home page

డిఫరెంట్ జానర్‌లో సినిమాలు తీస్తా: కర్రి బాలాజీ

Published Thu, Dec 30 2021 7:12 PM | Last Updated on Thu, Dec 30 2021 7:15 PM

Karri Balaji Talk About Back Door Movie - Sakshi

కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా నటించిన చిత్రం  'బ్యాక్ డోర్'. యూత్‌పుల్‌ అంశాలతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. తన తొలి సినిమాని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులు దర్శకుడు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్యాక్‌ డోర్‌’మూవీని సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.నా ప్రతి సినిమాను కూడా డిఫరెంట్ జానర్‌లో రూపొందిస్తాను. ఈ క్రమంలోనే నా తదుపరి సినిమాను ఆనంద భైరవి పేరుతో మీ ముందుకు తీసుకురానున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో  అంజలి, రాయ్ లక్ష్మి, మురళి శర్మ, రాశి సహా పలువురు ఫేమస్ యాక్టర్స్ భాగమవుతున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తాం. ముందు ముందు ఇలాగే ప్రేక్షకులు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement