పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు ‘కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్’ అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు.
ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్సులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, ప్రముఖ నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ... నా మీద నమ్మకముంచిన ‘బ్యాక్ డోర్’ నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం’అన్నారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్.
Comments
Please login to add a commentAdd a comment