అలాంటి వారితో జాగ్రత్త : పూర్ణ | Actress Poorna Says Be careful with Unknown Persons | Sakshi
Sakshi News home page

అలాంటి వారితో జాగ్రత్త : పూర్ణ

Published Tue, Jun 30 2020 9:32 AM | Last Updated on Tue, Jun 30 2020 9:32 AM

Actress Poorna Says Be careful with Unknown Persons - Sakshi

‘అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి’ అని నటి పూర్ణ హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ పెళ్లి పేరుతో మోసం చేస్తారని, అలాంటి వారితో కొత్తగా అవకాశాల కోసం వచ్చే నటీమణులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. తాను కూడా అలా ఒక వ్యక్తి నుంచి మోసపోయానని చెప్పింది. దక్షిణాదిలో నటిగా మంచి పేరు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా విషయం తెలిసిందే. ఒక వ్యక్తి ఆమెను పెళ్లి పేరుతో ఇటీవల మోసం చేసే ప్రయత్నం చేయగా ఆమె మేల్కొని పోలీసులకు పట్టించింది. దీని గురించి నటి పూర్ణ తనట్విట్టర్‌లో పేర్కొంటూ తన బంధువుల స్నేహితుల ద్వారా అన్వర్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పింది.
(చదవండి : పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌ పూర్ణ)

ఆ తర్వాత అతను తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తమ కుటుంబానికి పరిచయం చేసినట్లు తెలిపింది. అలా వారు ఇటీవల తమ ఇంటికి వచ్చారని చెప్పింది. వారిని ప్రత్యక్షంగా చూడడంతో తమకు అనుమానం కలిగిందని తెలిపింది. వారి వివరాలను అడగ్గా బదులు చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపింది. ఆ తర్వాత ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారని చెప్పింది.తాము వారు అడిగిన డబ్బు ఇవ్వనడంతో బెదిరించారని, ఇంటి నుంచి బయటికి వస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అని బెదిరించారని తెలిపింది. రంగస్థలం వేదికపై పాల్గొనడానికి వస్తావుగా అంటూ బెదిరించారని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. ఇలాంటి వారితో పలువురు అమ్మాయిలు మోసపోయినట్లు తెలిసిందని, ఇప్పటికీ వారి బండారం బయటపడిందని చెప్పింది. రంగుల ప్రపంచమైన సినిమా రంగంలోకి అవకాశాల కోసం పలువురు యువతులు వస్తున్నారని, వారంతా హోటల్లో బస చేస్తూ అవకాశాల వేటలో పడుతున్నారని చెప్పింది. అలాంటి వారు అవకాశాల పేరుతో మోసాలకు దిగే వారితో జాగ్రత్తగా ఉండాలని పూర్ణ హెచ్చరించింది. అవకాశాలను కల్పిస్తామని వచ్చే వారి గురించి తమకు తెలిసిన వారితోగానీ, స్నేహితులతోగానీ చర్చించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement