ప్రముఖ డైరెక్టర్ మిష్కిన్ సోదరుడు, 'సవరకట్టి' చిత్రం ఫేమ్ ఆదిత్య దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం డెవిల్. విదార్థ్, పూర్ణ, అరుణ్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు మిష్కిన్ సంగీతాన్ని అందించడం విశేషం. హెచ్ పిక్చర్స్ హరి, టచ్ స్క్రీన్ జ్ఞానశేఖర్ కలిసి నిర్మించారు. ఇప్పటి వరకు దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న డెవిల్ ఫిబ్రవరి 2న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
డెవిల్ సినిమా కాదు..
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా మక్కువ అని అయితే అందులో ఉండాల్సిన నిజాయితీని గురువు మిష్కిన్ నుంచి నేర్చుకున్నానని చెప్పారు. పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు కేవలం సినిమా మాత్రమే కాదని, తన జీవితానికి రిలేట్ అయిన ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు.
నా తమ్ముడని సపోర్ట్ చేయడంలేదు
సంగీత దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ఈ మూవీ డైరెక్టర్ తన తమ్ముడు కావడంతో తాను అతనికి సపోర్ట్ చేస్తున్నానని కొందరు చెప్పుకోవడం బాధగా అనిపించిందన్నారు. చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించారన్నారు. తమ మధ్య ఏదో ఉందని పుకారు పుట్టిస్తున్నారని, నిజానికి ఆమె తనకు తల్లిలాంటి వారని, వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నానని మిష్కిన్ పేర్కొన్నారు. ఆయన మాటలు విని భావోద్వేగానికి లోనైన పూర్ణ స్టేజీపైనే ఏడ్చేసింది.
చదవండి: విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య
Comments
Please login to add a commentAdd a comment