
‘‘ప్రస్తుతం థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా చూస్తున్నారు. ఆ నేపథ్యంలో రూపొందిన ‘డార్క్ నైట్’ చిత్రం టీజర్ బాగుంది’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ పేర్కొన్నారు. హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధార్ధ్, త్రిగుణ్ (అదిత్ అరుణ్), సుభాశ్రీ రాయగురు, రమా ఇతర పాత్రలు పోషించారు. పటోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు.
ఈ సినిమా టీజర్‌ని వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘మా ప్రాంతం నుంచి వచ్చిన సురేష్ రెడ్డిగారు ‘డార్క్ నైట్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంతో ఆయన మరిన్ని చిత్రాలు తీసి, తెలుగు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలబడాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య ఆద్యంతం ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఈ సినిమాని మలిచాడు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు సురేష్ రెడ్డి కొవ్వూరి. ఈ చిత్రానికి సంగీతం: మిస్కిన్, కెమేరా: కార్తీక్ ముత్తుకుమార్.
Comments
Please login to add a commentAdd a comment