
స్పెషల్ సాంగ్స్ చేయడంలో హీరోయిన్ తమన్నా సమ్‌థింగ్ స్పెషల్. హీరోయిన్‌గా చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు తమన్నా. ఇలా కెరీర్‌లో ఇప్పటికే పదికి పైగా ప్రత్యేక పాటల్లో నటించారీ బ్యూటీ. అయితే రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా...’, రాజ్‌కుమార్ రావు–శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కా రాత్’ సాంగ్స్‌లో తమన్నా నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నాతో పాటు యో యో హనీ సింగ్ కూడా ఉంటారట. ఇంకా ‘ఆజ్ కీ రాత్..’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ‘రైడ్ 2’లోని స్పెషల్ సాంగ్‌కూ కొరియోగ్రఫీ చేయనున్నారట. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రైడ్ 2’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. 2018లో వచ్చిన ‘రైడ్’కి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది.