
ఇప్పుడంటే బాలీవుడ్ సౌండ్ తగ్గిపోయింది. ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చాయి. 2018లో రిలీజైన రైడ్ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులో దీన్ని మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేశారు. కాకపోతే సరిగా తీయలేక ఫెయిలయ్యారు.
(ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)
ఇప్పుడు రైడ్ చిత్రానికి సీక్వెల్ సిద్ధమైంది. మే 1న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. తొలి భాగానికి ఏ మాత్రం తగ్గని విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పొందుపరిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్ ముఖ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)