తమిళ చిత్రాలే హాయి | Tamil movies best says Purna | Sakshi
Sakshi News home page

తమిళ చిత్రాలే హాయి

Published Sun, Aug 24 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

తమిళ చిత్రాలే హాయి

తమిళ చిత్రాలే హాయి

మలయాళ చిత్రాల కంటే తమిళ చిత్రాలలో నటించడమే హారుఅంటోంది కేరళ భామ పూర్ణ. మలయాళ చిత్రాలతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడిలో మంచి డ్యాన్సర్, మోడల్ ఉన్నారు. తొలుత డ్యాన్స్ కార్యక్రమాలతో జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత మోడలింగ్, సినిమా అంటూ ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో నటించి బహుభాషా హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇన్ని భాషల్లో నటించినా తమిళ చిత్రాల్లో నటించడమే సౌకర్యం అంటున్న పూర్ణ తన మనోభావాన్ని క్లుప్తంగా ఆవిష్కరించింది. అవేంటో చూద్దమా?
 
 నేను మలయాళ నటి నయినా తమిళంలోనే చక్కని కథాబలం ఉన్న పాత్రలో నటించాను. అలాగే మలయాళంలో కంటే తమిళ చిత్రాల్లో నటించడమే నాకు చాలా సౌకర్యం అనిపిస్తుంది. నన్ను ఒక స్టార్ నటిగా ట్రీట్ చేసింది కోలీవుడ్‌నే. అయితే లక్కీగా తెలుగు, కన్నడ భాషల్లో నటించిన చిత్రాలు ఎక్కువగా విజయం సాధించాయి. ప్రస్తుతం మలయాళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయి. అలాగని వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడంలేదు. నటిగా సత్తా చాటే పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. మలయాళంలో మంచి పాత్రలన్న నమ్మకం కుదిరితేనే అంగీకరించాలని నిర్ణరుుంచుకున్నాను.
 
 నాకు డాన్సర్‌గా మంచి పేరుంది. టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటాను. హీరోయిన్‌గా మంచి అవకాశాలొస్తుండగా టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యతనివ్వడం దేనికని చాలా మంది అడుగుతుంటారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. వెండితెరకంటే బుల్లితెరపై నటించడం నా కిష్టం. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రస్తుతం తెలుగులో అవును చిత్రానికి సీక్వెల్‌లో చేస్తున్నాను. ఒక కన్నడ చిత్రం, తమిళ చిత్రం అంగీకరించాను. అని అంటున్న పూర్ణా మలయాళంలో జూలీ చిత్రం రీమేక్‌లో నటిస్తోంది. 1974లో సేతుమాధవన్ తెరకెక్కించిన జూలీ చిత్ర రీమేక్‌లో పూర్ణా టైటిల్ పాత్ర పోషించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement