TV programs
-
హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే
సియోల్: హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. -
షార్క్ టైగర్స్
‘నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి. ఫండింగ్ ఉంటే ఎక్కడో ఉండేవాడిని’ అనేది బ్లాక్ అండ్ వైట్ జమాన నాటి మాట. ‘నీ దగ్గర ఐడియా ఉంటే చాలు...దానికి రెక్కలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు’ అనేది నేటి మాట. ‘ఐడియా’ ఉండి ఫండింగ్ అవకాశం లేని స్టార్టప్ కలల యువతరానికి ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లాంటి టీవిప్రోగ్రామ్స్ ఆశాదీపాల్లా మారాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల దావల్ తన సోదరుడు జయేష్‌తో కలిసి స్టార్టప్ కలను సాకారం చేసుకోబోతున్నాడు... దావల్కు కాలేజీ టీ స్టాల్లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం టీ స్టాల్లో పనిచేసే అబ్బాయి ఒక టబ్‌లో అవే నీళ్లలో గ్లాసులను కడగడం. దారిన పోయే మేక ఒకటి వచ్చి ఆ నీళ్లు తాగినా ఆ నీళ్లు అలాగే ఉండడం! టీ స్టాల్ యజమానికి చెప్పినా అతడు పట్టించుకోకపోవడం!! కాలేజీ టీ స్టాల్లోనే కాదు బయట రోడ్డు సైడ్ టీ స్టాల్స్, దాబాలలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు దావల్. ‘ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నాడు గుజరాత్‌లోని బవస్కంత గ్రామానికి చెందిన దావల్. యూట్యూబ్‌లో మెషిన్ డిజైనింగ్ సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఆరు నెలల్లో ఒక అవగాహన వచ్చింది.తండ్రితో కలిసి ఒక హార్డ్‌వేర్ షాప్‌కు వెళ్లి స్క్రాప్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా బతిమిలాడుకున్నాడు. స్క్రాప్ చేతికి వచ్చిన తరువాత ప్రయోగాలుప్రారంభించాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. ‘చేసింది చాలు. ఇక ఆపేయ్. స్క్రాప్ ఇచ్చేదే లేదు’ అన్నాడు హార్డ్‌వేర్ షాప్ యజమాని. దీంతో తనకు తెలిసిన ప్రొఫెసర్‌ను కలిసి విషయం చెప్పాడు. ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈసారి మాత్రం తన ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యి ఆటోమెటిక్ టీ–గ్లాస్ వాషింగ్ మెషిన్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ మెషిన్లోని వాటర్ జెట్‌తో 30 సెకండ్ల వ్యవధిలో 15 టీ గ్లాసులను శుభ్రపరచవచ్చు. దీని సామర్థ్యాన్ని పెంచే కొత్త మెషిన్ కూడా తయారు చేశాడు దావల్. దీని గురించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. కొందరుప్రొఫెసర్లను కలిసి ఈ మెషిన్ గురించి డెమో ఇచ్చాడు. వారికి నచ్చి అభినందించడమే కాదు లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన లక్షతో అయిదు మెషిన్లను తయారుచేసి కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్రలలో అమ్మారు. దావల్ సోదరుడు జయేష్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనేది కల. సోదరులిద్దరు ‘మహంతం’ పేరుతో స్టార్టప్ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా షార్క్‌ట్యాంక్ ఇండియా(సోనీ టీవీ) రియాల్టీ షోలో దావల్, జయేష్లు చెప్పిన స్టార్టప్ ఐడియా నచ్చి అయిదుగురు షార్క్స్(బిగ్–షాట్ ఇన్వెస్టర్స్) డీల్ ఆఫర్ చేయడమే కాదు ‘మీ విజయం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అభినందించారు. ఆ మాటే విజయమంత్రం ‘అపజయం మాత్రమే అంతిమం కాదు’ అనే మాటను ఎన్నోసార్లు విన్నాను. నా ప్రయత్నంలో విఫలమైనప్పుడల్లా ఈ మాటను గుర్తు తెచ్చుకునేవాడిని. మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాడిని. కొందరు నన్ను వింతగా చూసేవారు. కొందరైతే...నీకు నువ్వు సైంటిస్ట్‌లా ఫీలవుతున్నావు అని వెక్కిరించేవాళ్లు. అయితే నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సక్సెస్ కావడమే నా లక్ష్యం అన్నట్లుగా కష్టపడ్డాను. చివరికి ఫలితం దక్కింది. –దావల్ -
ఆలోచింపజేసేలా ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో
బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’అనే ఓ రియాలిటీ షో రాబోతున్న విషయం తెలిసిందే. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం ఈ షో ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేలా ఉంది. చదువు విలువతో పాటు కరోనా కాలంలో ప్రజల కష్టాలను తెలియజేసేలా ప్రోమోని అద్భుతంగా కట్ చేశారు. కరోనా కష్ట కాలంలో ఉద్యోగాన్ని కోల్పొయిన ఓ ప్రైవేట్ లెక్చరర్ .. ఈ షో వల్ల రూ.25 లక్షలు గెలుచుకుంటాడు. అయితే ఆ డబ్బులో సగం విద్యార్థుల ఫీజలకు ఉపయోగిస్తానని చెప్తాడు. చివరికి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా లుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’అని చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది.షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. మొత్తానికి ఈ నెల (ఆగస్టు) లోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రారంభం కాబోతున్నట్లు ప్రోమో ద్వారా తెలియజేశారు. -
Evaru Meelo Koteeswarulu: ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్
కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ అనే రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. ఇక ఈ షో ఈ ఏడాది టెలికాస్ట్ కాదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కరోనా ఉధృతి తగ్గగానే ఎన్టీఆర్ ఇంతకు ముందు కమిటైన సినిమాల షూటింగ్స్‌లో బిజీ కానున్నారని, ఆ సమయంలో ఈ షోకి డేట్స్ సర్థుబాటు చేసుకోవడం ఆయనకు వీలుకాదని, అందుకే షో వాయిదా పడబోతుందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జెమిని టీవీ యాజమాన్యం తాజాగా ఓ ప్రోమో వదిలి రూమర్లకు చెక్ పెట్టింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని ప్రోమో ద్వారా తెలిపింది. ‘EMK ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఇటు చూస్తున్న వారికి వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది’అని ప్రోమోని విడుదల చేసింది. అయితే ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. Evaru Meelo Koteeswarulu | Gemini TV Aadutunna valla kalalanu neraverustundi, itu chustunna vallaki 100 % Entertainment istundi EMK#EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu @tarak9999. pic.twitter.com/GtbKnRJQla — Gemini TV (@GeminiTV) June 5, 2021 -
విద్యార్థిని చితక్కొట్టారు, వీడియో వైరల్
లక్నో: దేశంలో విద్వేషపూరిత దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లక్నోలో డ్రైఫ్రూట్స్ విక్రయించే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద గ్రూపునకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేసిన ఘటన మరువకముందే.. అలలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని జీర్ణించుకులేకపోయిన కొందరు వ్యక్తులు ఓ విద్యార్థిని చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రోజున ఓ వార్త చానల్ ముజఫర్‌నగర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మాట్లాడించే కార్యక్రమం చేపట్టింది. ఆ సముహంలోని ఓ విద్యార్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో ఓ గ్రూప్ అతనిపై దాడికి దిగారు. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఆ టీవీ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఈ ఘటనను కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. ‘కేవలం ఉద్యోగాలు లేవని మాట్లాడినందుకు నాపై దాడి జరిగింది. వాళ్లు నన్ను టెర్రరిస్టు అంటూ.. భారత్‌కు, బీజేపీకి వ్యతిరేకివి అంటూ దాడికి తెగబడ్డారు. ముజఫర్‌నగర్ పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీడియోలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ’ని తెలిపారు. కాగా, ఈ ఘటనను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
టీవీ చానల్‌తో మాట్లాడుతున్న విద్యార్థిని చితక్కొట్టారు
-
టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే పదవుల తొలగింపు
టీ.నగర్: అన్నాడీఎంకే అధికారపూర్వక వక్తలు మినహా ఇతర కార్యకర్తలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే అధిష్టానం హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం అంగీకారంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. టీవీలలో జరిగే చర్చా కార్యక్రమాల్లో అధికారపూర్వక వక్తలు, ప్రతినిధులు మాత్రమే పాల్గొనాలని ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వార్తపత్రికలు, రేడియో, టీవీలకు పంపినట్లు తెలిపారు. అందువల్ల ప్రచారమాధ్యమాలు అన్నాడీఎంకే అధికార ప్రతినిధులను మాత్రమే చర్చా కార్యక్రమాలకు ఆహ్వానించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో పదవుల తొలగింపు: పుదుక్కోట్టైలో సంచలనం పుదుక్కోట్టైలో ఓపీఎస్ మద్దతుదారులకు పార్టీలో పదవులు ఇచ్చిన మరుసటి రోజే వారి పదవుల నుంచి తొలగించారు. పుదుచ్చేరి మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్న కార్తిక్ తొండైమాన్ పుదుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ అధ్యక్ష పదవికి అన్నాడీఎంకే ఇలంజర్, ఇలంపెన్‌గల్ పాసరై జిల్లా కార్యదర్శిగా ఉన్న రాజశేఖరన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడగా కార్తిక్ తొండైమాన్, రాజశేఖర్ ఓపీఎస్ వర్గంలో ఉన్నారు. దీంతో వీరి వద్ద ఉన్న పదవులను లాక్కున్నారు. అన్నాడీఎంకేలో పదవులను ఇవ్వాలని కార్తిక్ తొండైమాన్, రాజశేఖరన్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. దీంతో కార్తిక్ తొండైమాన్‌కు ఎంజీఆర్ ఇలంజర్ జిల్లా అధ్యక్ష పదవి, రాజశేఖరన్‌కు ఎంజీఆర్ ఇలంజర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవిని గత ఐదో తేదీన అప్పగించారు. దీంతో వారి మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజశేఖర్ పదవిని మరుసటి రోజే లాక్కోవడంతో మద్దతుదారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. -
తూచ్.. యుగాంతం ఉత్తదే!
ప్రతిసారీ ‘యుగాంతం వస్తుంది.. యుగాంతం వస్తుంది..’ అంటారు. భయపెడుతూ టీవీ ప్రోగ్రామ్స్ వస్తాయి. కథలు రాస్తారు. సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు ఎలా ఉంటాయంటే, ‘అమ్మో! ప్రపంచం అంతమైతే ఇదంతా జరుగుతుందా?’ అనేలా. మనకూ చావన్నా, ఇలాంటి అంతమయ్యే విషయాలన్నా ఇష్టమే! నిజమే కదూ!? చచ్చుకుంటూ చూస్తాం, చదువుతాం. యుగాంతం అని ప్రచారం చేసిన రోజు రానే వస్తుంది. ఎప్పట్లానే తెల్లారిందని అలారం చెబుతూనే ఉంటుంది. లేచి చూస్తే అంతా నార్మల్‌గానే ఉంటుంది. ‘ఇక అంతా అయిపోతుంది!’ అని బాధపడినవాళ్లూ, ‘అబ్బా! ఇంక అంతా అయిపోతుంది!’ అని సంబరపడినవాళ్లూ ఇంకేం అయిపోలేదని తెలుసుకుంటారు. ఇదీ యుగాంతం పేరుతో జరిగే సైకిల్. క్రీ.శ. ఒకటో శతాబ్దంలోనే భూగ్రహం అంతమైపోతుంది అన్నారు. యుగాంతం అన్నారు. ఆ తర్వాత ప్రతి పదేళ్లకో, యాభై ఏళ్లకో అంటూనే ఉన్నారు. 1996 అన్నారు. కాదు కాదు 97 అన్నారు. ఇది మాత్రం పక్కా.. 99 అన్నారు. తూచ్.. 2001 అన్నారు. ఇంతవరకైతే వచ్చాం కానీ 2003లో మాత్రం ఇంక ఉండం అన్నారు. ఇది ఫైనల్ ఇంక.. 2012 తర్వాత భూగ్రహం అంతమైపోతుంది.. యుగాంతమిదే అన్నారు. 2012ను మాత్రం గట్టిగానే గుద్ది చెప్పుకున్నారు అంతా. ఆ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. చూసి సంబరపడ్డాం కూడా! అది జరగదని మనకెంత నమ్మకమో!! 2012 కూడా వచ్చింది, పోయింది. యుగాంతం ఉత్తదే అని తేలిపోయింది. డేవిడ్ మీడ్ అనే ఓ క్రిస్టియన్ న్యూమరాలజిస్ట్ అయితే సెప్టెంబర్‡ 23, 2017న యుగాంతం వస్తుందని, నిబిరు అనే ఓ గ్రహం భూమిని ఢీకొనడంతో మొత్తం నాశనం అయిపోతుందని చెప్పుకొచ్చాడు. నాసా అలాంటి ఒక గ్రహమే లేదని కొట్టిపడేసినా ఆయన మాత్రం దీన్నే ప్రచారం చేస్తూ వచ్చాడు. చివరకు ఏమైంది? మళ్లీ తూచ్ యుగాంతం ఉత్తదే అని తేలిపోయింది. సరే, ‘మీ లెక్కలు తారుమారు అయ్యాయేంటీ?’ అని డేవిడ్‌ను కొందరు అడిగితే ఆయన ఏమన్నాడో తెల్సా? ‘అయ్యో! లెక్కల్లో ఎక్కడో తేడా కొట్టిందీ, అక్టోబర్ నెలాఖర్లో యుగాంతం ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇన్నిసార్లు ‘తూచ్.. యుగాంతం’ అనుకుంటూ ఉంటే ఆ భూగోళమే నవ్వుకుంటుందేమో కదా!! -
కామెడీ ట్రెండ్ సెట్టర్స్ ...
వారు కూర్చోరు, ప్రేక్షకుల్ని తిన్నగా కూర్చోనివ్వరు. స్టాండప్ అని ఎవరో ఆదేశించినట్టు నిలుచునే ఉంటారు. పంచ్‌లు పేలుస్తూ పకపకలు, జోకులతో నవ్వులు కురిపిస్తారు. వాళ్ల పేరే స్టాండప్ కమెడియన్స్. పని ఒత్తిడికి చెక్ చెప్పే ‘రెమెడి’యన్స్. నవ్వు నాలుగు కాలాలు ‘నిలిచే’ ఉంటుందంటూ.. ఇప్పుడు సిటీలో సరికొత్త హాస్య విందుకు తెరతీస్తున్న కామెడీ ట్రెండ్ సెట్టర్స్ వీరు. ..:: ఎస్.సత్యబాబు టీవీ ప్రోగ్రామ్స్ చూసేవారికి బాగా పరిచయమున్న అంశమే ఇది. ముఖ్యంగా హిందీ చానల్స్ చూసేవారికైతే కొట్టిన పిండి. ఆడియన్స్‌తో ప్రత్యక్షంగా సంభాషిస్తూ వేదిక మీద లేదా ఆడియన్స్ మధ్యలో నిలబడి నవ్వించే పద్ధతినే స్టాండప్ కామెడీగా, అలాంటి కామెడీని పండించేవారిని కామిక్లుగా పిలుస్తారు. కథలు అల్లడం, జోక్స్ గుప్పించడం, సింగిల్ లైన్ పంచ్‌లు విసరడం, మేజిక్ ట్రిక్స్ ప్లే చేయడం.. ఒకటనేమిటి ? ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఈ కామిక్స్ చేయనిదంటూ ఉండదు. ఇప్పుడు సిటీలో కాఫీ షాప్ నుంచి కార్పొరేట్ ఆఫీసుల దాకా, గ్యాలరీల నుంచి క్యాంపస్‌ల దాకా కాదేదీ కామెడీకి అనర్హం అంటూ వారు సందడి సృష్టిస్తున్నారు. వార్ టు హుషార్.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైనికులు విరామ సమయంలో పంచుకున్న వినోదమే ఈ హాస్య వల్లరికి మూలం. యుద్ధం నుంచి వచ్చాక కూడా బ్రిటన్‌లోని మ్యూజిక్ హాల్స్‌లో వీరు ఈ స్టాండప్ కామెడీని పండించారని, అలా అలా అది ప్రపంచవ్యాప్తం అయిందని అంటారు. ఏమైతేనేం.. ఇప్పుడు ఈ తరహా స్టాండప్ కామిక్‌లు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్ జిమ్‌క్యారీ సైతం తన కెరీర్‌ను స్టాండప్ కామెడీతోనే స్టార్ట్ చేశాడు. కెనడాకు చెందిన రస్సెల్ పీటర్స్ వంటివారు ఈ తరహా కామెడీ షోస్‌తో బాగా పాపులర్ అయ్యారు. మన ఇండియాలో వీర్‌దాస్, నితిన్ గుప్తా వంటివారు బాగా ఫేమస్ కాగా దాదాపు 50 మంది ప్రొఫెషనల్ కమెడియన్లుగా ఉన్నారు. నగరంలో పుంజుకుంటున్న ఈ సోలో ‘షో’ను హాబీగా 15 మంది, ఫుల్‌టైమ్ కెరీర్‌గా మలచుకున్నవారు అరడజను మంది వరకూ ఉన్నారు. క్లాప్.. స్టార్టప్.. సిటీలో ఈ స్టాండప్ కామెడీ షోస్‌కి క్లాప్ కొట్టింది రాజశేఖర్. గతంలో ప్రైవేట్ ఉద్యోగి. ఓ పబ్లిక్ స్పీకింగ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన ఆయన.. అదే ఆత్మవిశ్వాసంతో కామెడీ షోలకు శ్రీకారం చుట్టారు. ‘అప్పట్లో మేం పేరుపేరునా పిలిచినా మా షోలకు 10 మంది రావడం గగనమయ్యేది. ఇప్పుడు టిక్కెట్లు కొనుక్కుని మరీ వస్తున్నారు’ అంటూ స్టాండప్ కామెడీకి పెరుగుతున్న ఆదరణను వివరించారు రాజశేఖర్. ఆద్యంతం.. నవ్వించే పంతం.. ‘రిటైర్ అవుతున్నానని నాన్నగారు విచారంగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంది. ఏమ్మా నాన్న ఇక ఇంటిపట్టునే ఉంటారనా నీ ఆనందం? అని అడిగిన కొడుక్కి.. వంట బాధ తప్పుతుందనంటూ సమాధానం ఇచ్చింది’ ఓ అధికారి పదవి విరమణ సభలో స్టాండప్ కామెడీ పేల్చిన బుల్లి టపాసు ఇది. ఇలాంటి మతాబులెన్నో ఉంటాయి. ‘చాలా వరకూ రోజువారీ జీవితంలో అనుభవాలనే అంశాలుగా ఎంచుకుంటాం. అవయితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతార’ని అంటారు రాజశేఖర్. సినిమాలో హాస్యనటులకు ఉన్నట్టు కంటెంట్, ప్రిపరేషన్స్, కట్స్, టేక్స్ వంటివేమీ ఉండవు. అరగంట, గంటపాటు జరిగే షోలో ఫస్ట్ సెకన్ నుంచే నవ్వించాల్సి ఉంటుంది. కంటిన్యూగా జోక్స్ పేలుస్తుండాలి. ఒక జోక్ తుస్సుమందనుకో ప్రెజర్ పెరుగుతుంది. వరుసగా రెండు మూడు జోకులు తేలిపోయాయంటే దాన్ని అధిగమించి ప్రేక్షకుల్ని తిరిగి లాఫింగ్ లైన్లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఆడిటోరియాల్లో నవ్వించడం కన్నా కార్పొరేట్ కార్యాలయాల్లో నవ్వించడం కష్టం అంటారు రాజశేఖర్. ఎందుకంటే అక్కడంతా డ్యూటీ ఎట్మాస్పియర్ ఉంటుంది. మేనేజర్ నవ్వితేనే నవ్వుతారు. లేకపోతే ఇదీ జోకేనా అన్నట్టు చూస్తారు’ అని చెప్పారాయన నవ్వుతూ. కెరీర్.. సూపర్.. గంటకు రూ.25వేల దగ్గర్నుంచి నుంచి రూ.5 లక్షల దాకా చెల్లిస్తూ ప్రస్తుతం పలు సంస్థలు, హోటల్స్ ఎక్కడెక్కడి నుంచో స్టాండప్ కమెడియన్స్‌ని హైదరాబాద్ తీసుకొచ్చి షో ఇప్పిస్తున్నాయి ‘నేనీ కెరీర్ ఎంచుకున్నప్పుడు అందరూ విచిత్రంగా చూశారు. అయితే ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మన సిటీతో పాటు బెంగళూరు, ముంబై, చెన్నైలో కూడా షోస్ ఇస్తున్నాను. ఈ ప్రొఫెషన్లోకి మరింతగా యూత్‌ని ఆకర్షించడానికి ఫన్సీ సైడ్ అప్ సంస్థను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా గ్రూప్‌లో ఐదుగురున్నారు. టీసీఎస్‌లో జాబ్ చేస్తున్న రోహిత్స్వైన్, నేషనల్ లెవల్లో పబ్లిక్ స్పీకింగ్ చాంపియన్ అవినాష్ అగర్వాల్, డెలాయిట్ ఉద్యోగి ఉమేష్ సోమాని, సాయికిరణ్‌లతో గ్రూప్‌గా, ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాం’ అంటూ వివరించారు రాజశేఖర్. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైనార్ట్స్‌లో నెలకొక భారీ షో, మాదాపూర్‌లో రెడ్ పాయింట్ కెఫేలో ప్రతి గురువారం ‘స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్’ షో నిర్వహిస్తున్నారు. ‘ప్రతి గురువారం కామెడీ చేయడానికి కొత్త వారికి చాన్సిస్తున్నాం. వీక్లీ షోస్ టిక్కెట్ ద్వారా, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, లామకాన్ వంటి చోట్ల చేసే షోస్‌కి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాం’అని రాజశేఖర్ చెప్పారు. -
తమిళ చిత్రాలే హాయి
మలయాళ చిత్రాల కంటే తమిళ చిత్రాలలో నటించడమే హారుఅంటోంది కేరళ భామ పూర్ణ. మలయాళ చిత్రాలతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడిలో మంచి డ్యాన్సర్, మోడల్ ఉన్నారు. తొలుత డ్యాన్స్ కార్యక్రమాలతో జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత మోడలింగ్, సినిమా అంటూ ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో నటించి బహుభాషా హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇన్ని భాషల్లో నటించినా తమిళ చిత్రాల్లో నటించడమే సౌకర్యం అంటున్న పూర్ణ తన మనోభావాన్ని క్లుప్తంగా ఆవిష్కరించింది. అవేంటో చూద్దమా? నేను మలయాళ నటి నయినా తమిళంలోనే చక్కని కథాబలం ఉన్న పాత్రలో నటించాను. అలాగే మలయాళంలో కంటే తమిళ చిత్రాల్లో నటించడమే నాకు చాలా సౌకర్యం అనిపిస్తుంది. నన్ను ఒక స్టార్ నటిగా ట్రీట్ చేసింది కోలీవుడ్‌నే. అయితే లక్కీగా తెలుగు, కన్నడ భాషల్లో నటించిన చిత్రాలు ఎక్కువగా విజయం సాధించాయి. ప్రస్తుతం మలయాళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయి. అలాగని వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడంలేదు. నటిగా సత్తా చాటే పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. మలయాళంలో మంచి పాత్రలన్న నమ్మకం కుదిరితేనే అంగీకరించాలని నిర్ణరుుంచుకున్నాను. నాకు డాన్సర్‌గా మంచి పేరుంది. టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటాను. హీరోయిన్గా మంచి అవకాశాలొస్తుండగా టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యతనివ్వడం దేనికని చాలా మంది అడుగుతుంటారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. వెండితెరకంటే బుల్లితెరపై నటించడం నా కిష్టం. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రస్తుతం తెలుగులో అవును చిత్రానికి సీక్వెల్లో చేస్తున్నాను. ఒక కన్నడ చిత్రం, తమిళ చిత్రం అంగీకరించాను. అని అంటున్న పూర్ణా మలయాళంలో జూలీ చిత్రం రీమేక్‌లో నటిస్తోంది. 1974లో సేతుమాధవన్ తెరకెక్కించిన జూలీ చిత్ర రీమేక్‌లో పూర్ణా టైటిల్ పాత్ర పోషించడం విశేషం.