Evaru Meelo Koteeswarulu: ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్‌ | Evaru Meelo Koteeswarulu Latest Promo | Sakshi
Sakshi News home page

Evaru Meelo Koteeswarulu: ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్‌

Published Sat, Jun 5 2021 7:02 PM | Last Updated on Sat, Jun 5 2021 10:02 PM

Evaru Meelo Koteeswarulu Latest Promo - Sakshi

కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ అనే రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. ఇక ఈ షో ఈ ఏడాది టెలికాస్ట్‌ కాదనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  కరోనా ఉధృతి తగ్గగానే ఎన్టీఆర్‌ ఇంతకు ముందు కమిటైన సినిమాల షూటింగ్స్‌లో బిజీ కానున్నారని, ఆ సమయంలో ఈ షోకి డేట్స్‌ సర్థుబాటు చేసుకోవడం ఆయనకు వీలుకాదని, అందుకే షో వాయిదా పడబోతుందని వార్తలు వినిపించాయి. 

ఈ నేపథ్యంలో  జెమిని టీవీ యాజమాన్యం తాజాగా ఓ ప్రోమో వదిలి రూమర్లకు చెక్‌ పెట్టింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని ప్రోమో ద్వారా తెలిపింది. ‘EMK ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఇటు చూస్తున్న వారికి వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది​’అని ప్రోమోని విడుదల చేసింది. అయితే ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement