Actress Poorna Engagement: Actress Poorna Introduced Her Fiance, Engagement Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Poorna Engagement: సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌, కాబోయే భర్త ఫొటోను షేర్‌ చేసిన పూర్ణ

Jun 1 2022 2:42 PM | Updated on Jun 2 2022 2:44 PM

Actress Poorna Introduced Her Fiance, Engagement Pics Goes Viral - Sakshi

వ్యాపారవేత్తను పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

'అవును' హీరోయిన్‌ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 'కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను' అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆమె భర్త షానిద్‌ బడా వ్యాపారవేత్త. జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలను స్థాపించిన ఆయన వాటికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు.

పూర్ణ సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవల బ్యాక్‌డోర్‌, అఖండ వంటి చిత్రాలతో మెప్పించింది. పూర్ణ కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 12 ఏళ్లకు పైనే అయింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చిన ఆమె ఎంతోదూరం ప్రయాణించింది. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ కెరీర్‌ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి అనే సూత్రాన్ని నమ్ముతూ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది పూర్ణ.

చదవండి: విక్రమ్‌ సినిమా నటీనటుల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement