Actress Poorna Gives Clarity On Marriage Cancelled Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Heroine Poorna : పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్‌ పూర్ణ

Aug 10 2022 1:49 PM | Updated on Aug 10 2022 3:59 PM

Actress Poorna AKA Shamna Kasim Clarity on Marriage - Sakshi

హీరోయిన్‌ పూర్ణ గత కొన్నిరోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలె దుబాయ్‌కు చెందిన  షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో పూర్ణ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్‌ ఆసిఫ్‌తో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది.

చదవండి: సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్‌ ఆన్సర్‌ 

తాజాగా ఈ వార్తలపై నటి పూర్ణ క్లారిటీ ఇచ్చింది. కాబోయే భర్తతో సన్నిహితంగా కలిసి దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఎప్పటికీ నావాడు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో పూర్ణ పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌కి చెక్‌ పెట్టినట్లయ్యింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement