
హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదరగొడుతుంది. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా కంటే బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను ఎంగేజ్‌మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది.
అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే... పూర్ణ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందట.ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలని మొదట డిసైడ్ అయినా ఇప్పుడు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే ఇప్పటికీ పూర్ణ తన సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను డిలీట్ కూడా చేయకపోవడంతో మరి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నదానిపై సందేహం కలుగుతుంది. దీనిపై పూర్ణ స్వయంగా ఏమైనా ప్రకటన చేయనుందా అన్నది త్వరలోనే తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment