
హీరోయిన్ పూర్ణ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘సుందరి’. ఈ చిత్రంలో అర్జున్ అంబటి ప్రధాన పాత్రధారి. కల్యాణ్ జి గోగన దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. అర్జున్ అంబటి మాట్లాడుతూ – ‘‘అర్ధనారి’ సినిమా నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘సౌఖ్యం’లో విలన్ రోల్ చేశాను. తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా మంచి గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ బుల్లితెరపై ‘అగ్నిసాక్షి’లో నటించాను. ‘దేవత’ సీరియల్ చేస్తున్నాను.
కొంతగ్యాప్ తర్వాత ‘సుందరి’తో బిగ్ స్క్రీన్‌పైకి వస్తున్నాను. ఇందులో నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేశాను. పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తాను. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ఓ పాత్ర కోసం ఆడిషన్స్ ఇచ్చాను. సెలక్ట్ కాలేదు. ‘సినిమా, సీరియల్ అని కాదు.. యాక్ట్ చేయడం ముఖ్యం’ అని నాతో సుకుమార్‌గారు అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అలా అనడం హ్యాపీ అనిపించింది. ప్రముఖ నటులు ఎస్వీ రంగారావుగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment