
‘‘సుందరి’ చిత్రంలో నేను చేసినది స్టార్ హీరోయిన్స్ స్థాయివారు చేసే పాత్ర.. నేనింకా ఆ స్థాయికి రాలేదు. కానీ నా మీద నమ్మకంతో దర్శక–నిర్మాతలు ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు. నయనతార నాకు స్ఫూర్తి. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది’’ అని హీరోయిన్ పూర్ణ అన్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘సుందరి’. కల్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించారు. అర్జున్ అంబటి హీరోగా నటించారు. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘సుందరి’ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఇన్ని రోజులు వేచి చూశాం. మా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి అతిగా స్పందిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కల్యాణ్ జి గోగన. ఈ కార్యక్రమంలో నటులు అర్జున్ అంబటి, రాకేందు మౌళి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత ఖుషి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీవల్లి చైతన్య, సహ నిర్మాత: కె. రామిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment