Actress Poorna And Her Son With Husband Spotted In Relatives Marriage, First Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Poorna Son Latest Images: కొడుకుని పరిచయం చేసిన నటి పూర్ణ

Published Fri, Aug 4 2023 5:42 PM | Last Updated on Fri, Aug 4 2023 6:30 PM

Actress Poorna Son Photos And Details - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలు చాలావరకు తమ పిల్లల విషయంలో గోప్యత మెంటైన్ చేస్తుంటారు. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడా ఫొటోలు, వీడియోలు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ వారసుల్ని చాలా త్వరగానే ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇప్పుడు పూర్ణ కూడా అలానే తన కొడుకుతో ఫొటోలకు పోజులిచ్చింది.

నటి పూర్ణ.. కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో హీరోయిన్, రియాలిటీ షోకి జడ్జిగా బోలెడంత పేరు సంపాదించింది. 'శ్రీ మహాలక్ష‍్మీ' సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. సీమటపాకాయ్, అవును తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. నాని 'దసరా'లో చివరగా కనిపించింది. అయితే దుబాయికి చెందిన షానిద్ అసిఫ్ అలీని గతేడాది ఈమె పెళ్లి(నిఖా) చేసుకుంది. 

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!)

తొలుత ఎంగేజ్‌మెంట్ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన పూర్ణ.. మ్యారేజ్ గురించి ఏం చెప్పలేదు. పెళ్లెప్పుడు అని నెటిజన్స్ అడగడంతో ఆల్రెడీ అయిపోయిందని చెప్పి షాకిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అందరిలానే పూర్ణ కూడా కొడుకు విషయంలో గోప్యత పాటిస్తుందని అనుకున్నారు. కానీ ఆ పిల్లాడిని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈ మధ్య భర్తతో కలిసి ఓ పెళ్లికి వెళ్లిన పూర్ణ.. కొడుకుతో కలిసి కెమెరాకు పోజులిచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్స్.. పూర్ణ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో అని తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

(ఇదీ చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఇలా తయారైందేంటి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement