పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే? | Komaram Puli Fame Nikesha Patel Family And Career Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: నటిగా పదేళ్ల కెరీర్.. కానీ ఒక్కటీ కలిసిరాలే!

Published Sat, Nov 2 2024 11:40 AM | Last Updated on Sat, Nov 2 2024 11:45 AM

Komaram Puli Fame Nikesha Patel Family And Career Details

హీరోయిన్‌గా తొలి సినిమా అనగానే సదరు బ్యూటీస్ బోలెడన్ని ఆశలు పెట్టేసుకుంటారు. ఒకవేళ స్టార్ హీరో మూవీ అయితే అదృష్టమంటే తమదే అని ఫిక్సయిపోతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే అనుకుంది. ఏకంగా పవన్ కల్యాణ్‌ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. కానీ ఏం లాభం.. మూవీ డిజాస్టర్ కా బాప్ అయింది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

యూకేలో సెటిలైన గుజరాతీ ఫ్యామిలీలో 1990లో పుట్టింది నికీషా పటేల్. టీనేజీలో ఉన్నప్పుడే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. మిస్ ఇండియా యూకే విజేతగా నిలిచింది. 15 ఏళ్లకే బీబీసీలోని పలు షోల్లోనూ పాల్గొంది. యాక్టర్ అవుదామని చెప్పి బాలీవుడ్‌లోకి వచ్చింది. ఛాన్స్ వచ్చినట్లే వచ్చి ఓ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగులో పవన్ 'కొమరం పులి' మూవీలో అవకాశమొచ్చింది.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)

తొలి సినిమా హిట్ అయితే హీరోయిన్ గా సెటిలైపోవచ్చని నికీషా పటేల్ అనుకుంది. కానీ ఇది కాస్త డిజాస్టర్ అయిపోవడంతో తర్వాత కెరీర్ ఖేల్ ఖతం అయిపోయింది. 'ఓం 3డి', అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ 2.0 లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇవేవి అయ్యే పనుల్లా కనిపించలేదు. దీంతో అయిందేదో అయిందని 2019 తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది.

34 ఏళ్ల నికీషా పటేల్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూకేలోనే ఉంటోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉన్నంతలో నెటిజన్లని ఎంటర్‌టైన్ చేస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement