పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి | Pushpa Actor Dhananjay Engagement And Wife Details | Sakshi
Sakshi News home page

Actor Dhananjay Engagement: చాలా ఏళ్లుగా ప్రేమలో.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్

Published Sat, Nov 2 2024 7:48 AM | Last Updated on Sat, Nov 2 2024 10:52 AM

Pushpa Actor Dhananjay Engagement And Wife Details

'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ.. పెళ్లికి రెడీ అయిపోయాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. దీంతో రహస్యంగా నిశ్చితార్థం అయిన విషయం బయటపడింది.

(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)

కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ‍్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి, సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. త్వరలో సీక్వెల్‌లోనూ అదరగొట్టేయనున్నాడు.

ధనంజయ్ ఎంగేజ్‌మెంట్ విషయానికొస్తే ధన్యతని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement