Dhananjay
-
డాక్టర్‌తో నిశ్చితార్థం చేసుకున్న 'పుష్ప' విలన్
'పుష్ప' మూవీలో జాలిరెడ్డిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ.. నిశ్చితార్థం చేసుకున్నాడు. డాక్టర్ ధన్యతతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?)కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని ధనంజయ పరిచయం చేశాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 17) నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఫిబ్రవరి 16న మైసూరులో వీళ్ల పెళ్లి జరగనుంది.'పుష్ప' తొలి భాగంలో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న ధనంజయ.. ఇప్పుడు పార్ట్ 2లోనూ ఉన్నాడు. ట్రైలర్లో ఒక్క షాట్లో ఇతడిని చూపించారు. ధనంజయ నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా తోటి యాక్టర్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్) View this post on Instagram A post shared by Pink Tickets (@pinkticketsofficial) -
పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి
'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ.. పెళ్లికి రెడీ అయిపోయాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. దీంతో రహస్యంగా నిశ్చితార్థం అయిన విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి, సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. త్వరలో సీక్వెల్లోనూ అదరగొట్టేయనున్నాడు.ధనంజయ్ ఎంగేజ్మెంట్ విషయానికొస్తే ధన్యతని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
జెఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ధనంజయ్
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో వామపక్ష అభ్యర్థులు గెలుపొందారు. బీఏపీఎస్ఏ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 73 శాతం ఓట్లు పోలయ్యాయి. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి ధనంజయ్ విజయం సాధించారు. జెఎన్యూఎస్యూ సెంట్రల్ ప్యానెల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ధనంజయ్ విజయం సాధించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరాపై ధనంజయ్ 922 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ధనంజయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. ఆయన బీహార్‌లోని గయ జిల్లాకు చెందిన విద్యార్థి. ధనంజయ్ 1996 తర్వాత జెఎన్యూ స్టూడెంట్స్ యూనియన్‌కి ఎన్నికైన మొదటి దళిత అధ్యక్షుడు. 1996లో బత్తిలాల్ బైరవ విజయం సాధించారు. ధనంజయ్ మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రత, స్కాలర్షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు మొదలైనవి తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. #WATCH नवनिर्वाचित JNU अध्यक्ष धनंजय ने कहा, "...अगर कोई है जिसने फीस वृद्धि के खिलाफ लड़ाई लड़ी है तो वह वामपंथी है। यह वामपंथ ही है जिसने सभी के लिए छात्रावास सुनिश्चित किया है और इसके लिए छात्रों ने हम पर अपना भरोसा दिखाया है..." pic.twitter.com/Wjo3X6OHac — ANI_HindiNews (@AHindinews) March 25, 2024 -
'పుష్ప' ధనుంజయ్ 'బడవ రాస్కెల్' ఎలా ఉందంటే?
టైటిల్: బడవ రాస్కెల్ నటీనటులు: ధనుంజయ్, అమృత అయ్యంగార్, నాగభూషణ్, రంగాయణ రఘు, స్పర్శ రేఖ తదితరులు దర్శకుడు : శంకర్ గురు నిర్మాత : సావిత్రమ్మ ,అడవి స్వామి సహనిర్మాత : ఖుషి బ్యానర్ : రిజ్వాన ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి ఎస్, దేవన్ గౌడ సంగీతం: వాసుకి వైభవ్ డిఓపి : ప్రీత జయరామన్ ఎడిటర్ : నిరంజన్ దేవరామనే లిరిక్స్ అండ్ డైలాగ్స్ : రామ్ వంశీకృష్ణ విడుదల తేదీ: ఫిబ్రవరి 18 'పుష్ప` సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు నటుడు ధనుంజయ్. కన్నడలో హీరోగా రాణిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం `బడవ రాస్కెల్`. శంకర్ గురు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో నటించి నిర్మించాడు ధనుంజయ్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈనెల 18న విడుదలైన బడవ రాస్కెల్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చదివేయండి.. కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శంకర్(ధనుంజయ్) ఆటో డ్రైవర్ రంగనాథ్ (రంగాయణ రఘు) కొడుకు. ఎంబీఏ చదివినప్పటికీ తండ్రికి సాయంగా ఉండాలని ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలో హీరో ఒక సంపన్న రాజకీయ నాయకురాయాలి కుమార్తె సంగీత (అమృత అయ్యంగార్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకుంటారు. మీ అమ్మ నాన్నలతో వచ్చి మన పెళ్లి విషయం మా పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్తుంది హీరోయిన్. సరేనని శంకర్ తన తల్లిదండ్రులతో వారి ఇంటికి వెళతాడు. ఆ సమయంలో అక్కడ జరిగిన సంఘటన ఇద్దరి జీవితాన్ని మలుపు తిప్పుతుంది, ఆ సంఘటన తర్వాత వాళ్లు దూరం అవుతారు. ఇంతలో హీరో కిడ్నాప్ అవుతాడు. అసలు హీరోహీరోయిన్లు ఎందుకు విడిపోయారు? శంకర్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? వీళ్ల ప్రేమకథకు శుభంకార్డు పడిందా? లేదా? అంటే బడవ రాస్కెల్ చూడాల్సిందే! విశ్లేషణ బడవ రాస్కెల్ ఒక మామూలు ప్రేమకథ, ఇందులో కొత్త పాయింట్ అంటూ పెద్దగా ఏమీ కనిపించదు. కాకపోతే దర్శకుడు ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టాడు. తల్లీ కొడుకు, తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాలా బాగా చూపించడంలో సఫలమయ్యాడు. కానీ ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద కూడా చూపిస్తే బాగుండేది. ఫస్టాఫ్ పరుగులు పెట్టినా సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ట్విస్టులు లేకుండా ఊహించినట్లే ఉంటుంది. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని తెలుస్తోంది. నటీనటుల పనితీరు మధ్య తరగతి యువకుడు శంకర్‌గా ధనుంజయ్ పాత్రలో లీనమయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. సంగీతగా హీరోయిన్ అమృత అయ్యంగార్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. శంకర్‌కు స్నేహితుడిగా నటించిన నాగభూషణ్ మంచి కామెడీ పండిస్తూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో తల్లిదండ్రులుగా రంగాయణ రఘు, తారలు మెప్పించారు. హీరోయిన్ తల్లిగా స్పర్ష రేఖ నెగెటివ్ షేడ్స్‌తో అలరించింది. సాంకేతిక నిపుణుల పనితీరు డైరెక్టర్ శంకర్ గురు మధ్యతరగతి విలువలను తెరపై చక్కగా చూపించాడు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా సన్నివేశాలను రూపొందించాడు. కానీ కథ, కథనం విషయంలో కొంత తడబడ్డట్లు కనిపించింది. వాసుకి వైభవ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. ప్రీతం జయరామన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మీద మరికొంత కసరత్తు చేసుంటే బాగుండేది. -
చేతిపైనే చివరి లేఖ..
బొబ్బిలి/ సాలూరు రూరల్: దేవుడిచ్చిన వందేళ్ల జీవితాన్ని అవగాహనా లోపంతో నాశనం చేసుకుంటున్నారు యువత. చిన్న చిన్న కారణాలు, అంతుబట్టని ఆలోచనలతో క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సాలూరు మండలం కోదుకరకవలసకు చెందిన ధనుంజయ్ (25) అనే యువకుడు రైలు ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. అక్కడి రైల్వే ట్రాక్‌పై శరీరం రెండు ముక్కలుగా ఉండటాన్ని చూసిన స్థానికులు, ట్రైన్ డ్రైవర్ (లోకోపైలట్) పోలీసు సిబ్బందికి సమాచారమందించారు. ధనుంజయ్ తన చేతిమీద, ఒక చీటీపై ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ‘సారీ అమ్మా..! నేను చనిపోతున్నా! ప్రస్తుతం బొబ్బిలి రైల్వే ట్రాక్‌పై ఉన్నా.. కాసేపట్లో తనువు చాలిస్తున్నా..! నాకు అందంగా ఉండాలని ఉంది. కానీ ఆ దేవుడు నన్ను అందంగా పుట్టించలేదు. అందువల్ల నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. నేను ఎందుకు చనిపోతున్నానో పర్సులో రాసి పెట్టాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా కుటుంబ సభ్యులు చాలా మంచివారు. మృతదేహాన్ని నా కుటుంబ సభ్యులకు అప్పగించండని రాసి ఉంది. అలాగే మృతుడు తన అరచేతిపైకూడా తాను ఎందుకు చనిపోతుందీ రాసుకున్నాడు. కూలి పనులతో పెంచింది.. ధనుంజయ్ తండ్రి కృష్ణ చనిపోవడంతో తల్లి గౌరమ్మ కూలిపనులు చేస్తూ కుమారుడ్ని పెంచి ంది. ధనుం జయ్ ఇంట ర్మీడియట్ (వొకేషనల్)ను 2011లో పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో రాజ మండ్రి, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లి వివిధ కారణాల వల్ల వెనక్కి వచ్చేశాడు. ఈ క్రమంలో తాను అందంగా లేడనే ఆత్మన్యూనతా భావానికి గురయ్యాడు. పైగా తల్లి కష్టపడి పనిచేసి పెంచుతోందని, తాను కుటు ంబానికి భారమయ్యానని తరచూ బాధపడేవాడు. తాను చనిపోతానని గ్రామస్తుల వద్ద తరచూ అనేవాడు. అనుకున్నట్లుగానే శుక్రవారం రాత్రి బొబ్బిలిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదని తల్లి గౌరమ్మ కన్నీటిపర్యంతమైంది. -
మరో సిరీస్ పై దృష్టీ
⇔ శ్రీలంకతో భారత్ మూడో వన్డే నేడు ⇔ సజీవంగా నిలిచేందుకు ఆతిథ్య జట్టు పోరు శ్రీలంక పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు రెండో వన్డేలో కఠిన పోటీ ఎదురైంది. స్పిన్నర్ అకిల ధనంజయ స్పిన్ మాయలో పడి టీమిండియా ఒక్కసారిగా ఓటమి దిశగా పయనించింది. 22 బంతుల వ్యవధిలో ఏడు వికెట్లు కూలినా... ‘మిస్టర్ కూల్’ ధోనికి అనూహ్యంగా భువనేశ్వర్ అండగా నిలవడంతో పరువు దక్కించుకోగలిగింది. ఈ పరిస్థితిలో శ్రీలంకతో కోహ్లి సేన మూడో వన్డేకు సిద్ధమవుతోంది. మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించి మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలవాలని భారత్ భావిస్తుండగా... ఎలాగైనా ఈ వన్డేలో నెగ్గి సిరీస్‌లో సజీవంగా ఉండాలని ఆతిథ్య జట్టు ఆలోచిస్తోంది. పల్లెకెలె: శ్రీలంక పర్యటనలో ఇప్పటికే టెస్టు సిరీస్‌ను దక్కించుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో నేడు మూడో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. అయి తే గురువారం నాటి రెండో వన్డేలో వరుస మారిన భారత మిడిలార్డర్లో లోపాలు బహిర్గతమయ్యాయి. ధనంజయ స్పిన్ తాకిడిని తట్టుకోలేక ఆరుగురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేర డం జట్టు మేనేజ్మెంట్ను ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో ప్రయోగాలు చేసినా ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలనే కసితో లంక ఉంది. స్లో ఓవర్ రేట్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు వన్డేల నిషేధం విధించడంతో శ్రీలంక జట్టుకు కపుగెడెర నాయకత్వం వహించనున్నాడు. ప్రయోగాలు కొనసాగేనా.. రెండేళ్లలో రాబోయే ప్రపంచకప్‌కు అత్యంత పటిష్టంగా సిద్ధం కావాలని భారత్ భావిస్తోంది. దీంట్లో భాగంగానే రెగ్యులర్‌గా కొనసాగుతున్న బ్యాటింగ్ ఆర్డర్‌ను రెండో వన్డేలో మార్చారు. మూడోనంబర్లో కోహ్లికి బదులు రాహుల్, ఆ తర్వాత కేదార్ జాదవ్‌లను బరిలోకి దింపారు. అయితే స్పిన్నర్ ధనంజయ గూగ్లీ బంతులకు వీరు గుభేల్మన్నారు. ఫామ్‌లో ఉన్నప్పటికీ లోకేశ్ రాహుల్ కోసం రహానే బెంచీకే పరిమితమయ్యాడు. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని రాహుల్ ఉపయోగించుకోలేకపోయాడు. అయితే ధనంజయ సూపర్ బంతులకు అటు కోహ్లి కూడా షాక్ తినాల్సి వచ్చింది. జాదవ్ తన షాట్ సెలక్షన్లో విఫలమయ్యాడు. మరి ఈ వన్డేలోనూ కోహ్లి ఇదే ఆర్డర్లో జట్టును నడిపిస్తాడా.. వేచి చూడాలి. ఎక్కువగా చేజింగ్‌కు మొగ్గు చూపే అతను ఈసారి టాస్ నెగ్గితే మిడిలార్డర్ ప్రాక్టీస్ కోసం ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కండరాలు పట్టేయడంతో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా... లేడా అనేది ఆసక్తికరంగా మారింది. ఫిట్‌గా లేకపోతే కుల్దీప్, శార్దుల్ ఠాకూర్లలో ఒకరికి చాన్స్ ఉంటుంది. ధోని తన సత్తా ఏమిటో చాటుకోగా... భువనేశ్వర్ బౌలింగ్‌లో విఫలమవుతున్నా అసమాన బ్యాటింగ్‌తో రెండో వన్డేలో ఆపద్భాందవుడిలా నిలిచాడు. పేసర్ బుమ్రా అదరగొడుతుండగా, స్పిన్నర్లు అక్షర్, చాహల్ ప్రభావం చూపిస్తున్నారు. ఒత్తిడిలో శ్రీలంక కెప్టెన్ తరంగ సస్పెన్షన్‌తో పాటు గుణతిలక గాయంతో దూరమవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. దీంతో వీరిద్దరి స్థానంలో చండిమాల్, తిరిమన్నె జట్టులోకి వచ్చారు. రెండో వన్డేలో గెలుపు ముంగిట నిలిచి బోల్తా పడిన లంక ఈసారి ఎలాంటి పొరపాటుకు తావీయకుండా ఆడాలని చూస్తోంది. సిరీస్‌లో ఉండాలంటే విజయం తప్పనిసరి కావడంతో పాటు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే లంకకు రెండు విజయాలు అవసరముంది. ముఖ్యంగా లంక బౌలింగ్‌లో ఇప్పుడు ధనంజయ సరికొత్త ఆశాకిరణంగా మారాడు. ఈ మ్యాచ్‌లోనూ జట్టు అతడిపైనే భారం వేసింది. అయితే పేసర్లు మలింగ, ఫెర్నాండో ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం వీరిని దెబ్బతీస్తోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, జాదవ్, పాండ్యా, ధోని, అక్షర్, చాహల్, భువనేశ్వర్, బుమ్రా. శ్రీలంక: కపుగెడెర (కెప్టెన్), డిక్వెలా, తిరిమన్నె, కుశాల్, చండిమాల్, మాథ్యూస్, సిరివర్ధన, ధనంజయ, చమీర, ఫెర్నాండో, మలింగ. పిచ్, వాతావరణం రెండో వన్డే మాదిరిగానే పిచ్ మరోసారి స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించనుంది. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అమ్మో మొసలి.. కాస్తంతలో తప్పిందే !
బెంగళూరు: ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్న హీరో, హీరోయిన్లు ధనుంజయ్, పారుల్‌లు కాస్తంతలో మొసలి బారి నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ విషయం వాళ్లకు కూడా ఆలస్యంగా తెలియడమే గమనార్హం. వివరాలు.. జెస్సీ సినిమా చిత్రీకరణలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో హీరో, హీరోయిన్లు ధనుంజయ్, పారుల్లపై ఓ పాటను చిత్రీకరించారు. సిగందూరులోని ఓ సరస్సులో నీటి తెప్పపై వెళుతున్న సందర్భంగా ఈ పాట చిత్రీకరణ సాగింది. ఆ సమయంలో హీరో, హీరోయిన్లు కూర్చున్న తెప్పకు అతి సమీపంలోనే ఓ మొసలి కనిపించింది. అయితే షూటింగ్ సమయంలో ఈ విషయాన్ని హీరో, హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులెవ రూ కూడా గుర్తించలేదు. తమ షూటింగ్‌ను పూర్తి చేసుకొని వారు అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఎడిటింగ్ పనులను ఆదివారం నిర్వహిస్తుండగా యూనిట్ సభ్యులకు షాక్ తగిలినంత పనైంది. ధనుంజయ్, పారుల్‌లు కూర్చున్న తెప్ప పక్కనే మొసలిని చూసిన యూనిట్ సభ్యులంతా ‘అమ్మో మొసలి, కాస్తంతలో తప్పిందే, అదృష్టవంతులు’ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. -
హృదయం ఊగిసలాట!
రావంత్, ‘ఎలుకా మజాకా’ ఫేమ్ పావని జంటగా, కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పల్లా రమణయాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే...’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాత మాట్లా డుతూ- ‘‘ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో షూటింగ్ జరిపాం. రాజ్‌కిరణ్ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణ. నృత్య దర్శకురాలు తార నేతృత్వంలో ‘నా చిన్ని నువ్వే నువ్వే..’ అనే పాటను తెరకెక్కించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తిరుమలశెట్టి డా. శ్రీరామమూర్తి, కథ-స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: ధనుంజయ్. -
'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి'
పాట్నా: డబ్బు ఉన్నవాళ్లకు చదువుండదు.. చదువొచ్చేవాళ్లకు డబ్బుండదు అనేది ఒక నానుడి. అయితే, డబ్బున్నవాడు అది అయిపోవడంతో ఆగిపోతాడేమోగానీ.. చదువున్నవాడు మాత్రం డబ్బు హెచ్చుతగ్గలవల్ల ఆగిపోడూ.. ఓ ప్రవాహంలా ముందుకు వెళుతూనే ఉంటాడు. అందుకోసం అనువైన మార్గాలు శోధిస్తాడు. సిగ్గు, బిడియం అనేది దరిచేరనీయరు.. ఎందుకంటే వారి లక్ష్యం ముందు ఇవన్నీ పూచిక పుల్లలు. బీహార్‌లోని మ్యాథమేటిషియన్ అనంద్ కుమార్ ప్రతి ఏటా దాదాపు 30 మంది నిరుపేద పిల్లలకు రూపాయి తీసుకోకుండా ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్ తీసుకున్న వారంతా ఫలితాల్లో మెరుస్తున్నారు. అయితే, ఫలితాల్లో తమను విజయం వరిస్తుందన్న సంతోషం కన్నా.. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ఉంటుంది.. అందుకు భారీ స్థాయిలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అసలే రెక్కాడితే డొక్కాడని తమ తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా ఇవ్వాగలరనే ఆందోళన బాగా వేదిస్తోంది. దీంతో ఎలాగైన తమ కలను నెరవేర్చుకోవాలని, దేశంలోని విశిష్ట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవాలని ఆశపడుతున్నారు. దీంతో వారు తమ పరిస్థితిని ఏమాత్రం తడుముకోకుండా వివరిస్తూ మాకు సాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఇలాసాయం కోరుతున్న వారిలో కొందరిని ఉదాహరణగా తీసుకుంటే.. దనంజయ్ కుమార్ (18) అనే విద్యార్థి సూపర్ కంప్యూటర్ 30లో శిక్షణ తీసుకొని ఐఐటీ ర్యాంకు సాధించాడు. అతడు ఇప్పుడు ఖరగ్‌పూర్ ఐఐటీ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలంటే కనీసం 45 వేలు ఫీజు కట్టాలి. పోనీ బ్యాంకులను అడుగుదామా అంటే ప్రవేశం పత్రాన్ని తీసుకొచ్చాకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. తన తండ్రి నెలకు సంపాధించేది కేవలం మూడువేల రూపాయలు. కానీ ఇంట్లో ఉంది మాత్రం ఎనిమిది మంది. వీటితో వారందరిని పోషించడమే కష్టం. అలాంటిది 45 వేలు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించడమంటే సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ధనంజయ్ కుమార్ తనను ఆదుకొని తన కల నెరవేర్చరూ అంటూ వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మాదేపూర్ నుంచి సుజిత్ కుమార్, నలందా నుంచి ప్రేమ్ పాల్, ససరాం నుంచి శరవణ్ అనే విద్యార్థులంతా తమకు ఆర్థిక సాయం చేసి విద్యను కొనసాగించేలా ఆదుకోండంటూ కోరుతున్నారు. -
అమ్మో..ఆర్టీసీ
= ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు = మరో ఘటనలో రెండు బస్సులు ఢీ = 22 మందికి గాయాలు = గాంధీలో చికిత్స అల్వాల్,బొల్లారం, గాంధీఆస్పత్రి,న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం,సుఖవం తం అన్న నినాదం..క్రమంగా కోల్పోతోంది. అదుపు తప్పుతున్న డ్రైవర్లు తరచూ ప్రమాదాలు చేస్తూ ప్రయాణికులను ఆస్పత్రుల పాల్జేస్తున్నారు. గురువారం నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆగివున్న లారీని ఒక బస్సు ఢీకొట్టగా..మరో ఘటనలో రెండు బస్సులు ఢీకొన్నాయి. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్సు (ఏపి29 జెడ్ 271) గురువారం మధ్యాహ్నం హకీంపేట డిపో సమీపంలో ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 22మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ ధనుంజయ్‌కు కాలు విరగడంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. మొత్తం 26మంది క్షతగాత్రులు రాగా వారిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే డిశ్చార్జీ చేశారు. ఆర్టీసీ అధికారులు ఆస్పత్రికి చేరుకొని ప్రమాదానికి కారణాలను ఆరాతీశారు. కాగా ప్రమాదానికి డ్రైవర్ ధనుంజయ్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా..సెల్ మాట్లాడుతున్నాడా అన్న దానిపై విచారిస్తున్నారు. క్షతగాత్రులు వీరే : కవిత, కొమరయ్య, లక్ష్మయ్య,మణెమ్మ, నరసమ్మ, నర్సింహ, నర్సింహరెడ్డి, పుష్ప, రాజవ్వ, రాజేందర్, రమణారెడ్డి, రాములు, రావుల కొమరయ్య, సాయిరవి, సావిత్రి, ఎస్‌కేరావు (కండక్టర్). ధనుంజయ (డ్రైవర్), వెంకటయ్య, యాదగిరి, దినేష్. మరో ఘటనలో రెండు బస్సులు ఢీ.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన బొల్లారం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హకీంపేట డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ నుంచి రిసాలాబజార్ మీదుగా కౌకూర్ భరత్‌నగర్‌కు వెళ్తోంది. బొల్లారం చెక్‌పోస్టు వద్ద శామీర్‌పేట వైపు వెళ్తున్న జనగాం డిపో బస్సు దాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లో ఉన్న పదిమందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే జనగాం డిపో బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు,108 సిబ్బంది సహకారంతో ప్రయాణికులకు ప్రాథమిక చికిత్సను అందించారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేయలేదు.