![Pushpa Actor Dhananjay Knot with Dhanyatha On This date](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Dhananjay.jpg.webp?itok=_A9YDYoZ)
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు డాలీ ధనుంజయ్. సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ధనుంజయ్ ఈనెల ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 15,16 తేదీల్లో డాలి ధనుంజయ్- ధన్యతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ మైసూరులో జరగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ధనుంజయ. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
నటుడు డాలీ ధనంజయ్-ధన్యతల వివాహం మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. నటుడు ధనంజయ్‌కి ఇష్టమైన పట్టణం మైసూర్ . ఆ నగరంలోనే చిన్నప్పటి నుంచి చదువుకుని అక్కడే పెరిగారు. ఈ నేపథ్యంలో ధనంజయ్ తన పెళ్లి ప్లానింగ్స్ గురించి మాట్లాడారు. మైసూర్‌లో పెళ్లి చేసుకోవాలనేది నా కల.. ఎందుకంటే నా చదువు, సినీ రంగ ప్రవేశం అంతా మైసూరు నుంచే జరిగిందని వెల్లడించారు. మాత చాముండేశ్వరి అనుగ్రహం తనకు ఎప్పుడు ఉంటుందని ధనంజయ్ అన్నారు. అందుకే చాముండేశ్వరి దేవాలయం నమూనాలో పెళ్లి వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ‍్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ అదరగొట్టేశాడు.
ధనంజయ్ చేసుకోబోయే ధన్యత విషయానికొస్తే చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమలో మారింగి. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment