ఓటీటీలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా.. స్ట్రీమింగ్‌పై ప్రకటన | Zebra Movie OTT Streaming Announced | Sakshi
Sakshi News home page

ఓటీటీలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా.. స్ట్రీమింగ్‌పై ప్రకటన

Dec 12 2024 11:56 AM | Updated on Dec 12 2024 12:48 PM

Zebra Movie OTT Streaming Announced

క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మాస్‌ ఎంటర్‌ట్రైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు.  సత్యదేవ్‌, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా..  ప్రియాభవానీ శంకర్ హీరోయిన్‌గా మెప్పించింది.  ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మజ ఫిల్మ్‌ ప్రైవేట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌  22న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.

యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ప్రేక్షకులను మెప్పించిన జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుందని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. అయితే, అధికారికంగా స్ట్రీమింగ్‌ తేదీ ఎప్పుడు అనేది మాత్రం ఆ సంస్థ ప్రకటించలేదు. త్వరలో అంటూ ఒక పోస్టర్‌ను మాత్రమే రిలీజ్‌ చేసింది. అయితే, డిసెంబర్‌ 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

 

కథేంటి?
సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్‌లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్‌లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్‌లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement