
‘దృశ్యం 2’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరోయిన్ మీనా. సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ (2014) సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్‌లో కూడా చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మీనా.
‘‘స్టార్ట్ రోలింగ్.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు మీనా. ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మాతృక ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment