Meena
-
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరున్న రాధాకృష్ణన్‌కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్‌కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్‌ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. -
హీరోయిన్ మీనా పొంగల్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
బర్త్ డే మూడ్‌లో నభా నటేశ్.. పెళ్లి కూతురిలా ది రాజాసాబ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్‌లో నభా నటేశ్..పెళ్లి కూతురిలా ముస్తాబైన ది రాజాసాబ్ హీరోయిన్!టోక్యోలో ఎంజాయ్ చేస్తోన్న మీనా..బుట్టబొమ్మలా తయారైన యాంకర్ శ్రీముఖి.. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by GQ India (@gqindia) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
-
ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్‌లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేశారన్నారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్‌కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. -
అలాంటప్పుడు ఈ వేడుకకు నన్నెందుకు పిలిచారు: మీనా
సీనియర్ నటి మీనా సౌత్ ఇండియా ప్రేక్షకులతో మంచి అనుబంధమే ఉంది. బాలనటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా అబుదాబిలో జరిగిన ఐఫా-2024 అవార్డ్స్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆ వేదిక మీద మీనా తమిళ్ మాట్లాడుతుండగా తనపై బాషా విభేదం చూపించారు.ఒకప్పడు స్టార్ నటిగా కొనసాగిన మీనా.. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెండ్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐఫా చిత్రోత్సవాల్లో మీనా మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ఒక యాంకర్ హిందీ భాషలో మాట్లాడమని చెప్పడంతో నటి మీనాకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇది హిందీ వేడుకనా, అయితే తనని ఎందుకు ఆహ్వానించారు..? తాను ఇది దక్షిణాది వేడుక అని భావించానంటూ అసంతప్తి వ్యక్తం చేశారు. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా (ఫొటోలు)దక్షిణాది చిత్రాలు, దక్షిణాది నటీనటులు చాలా ఉత్తమ కళాకారులని, తాను దక్షిణాది నటినని చెప్పుకోవడానికి గర్వపడతానన్నారు. అదేవిధంగా ఐఫా చిత్రోత్సవ వేడుక దక్షిణాదికే కాకుండా భారతీయ కళాకారులను కలుపుతూ ఘనంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఇలా నటి మీనా మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్.. కారణం ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది. అయితే, ఈనెల 6 నుంచి 10 వరకు మాత్రమే ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించారు. అయితే, అక్టోబర్ 3 తో ఆయనకు విధించిన గడువు ముగిసింది. అయితే, జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని బెయిల్ కోసం జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 70వ జాతీయ అవార్డ్స్‌లో జానీ మాస్టర్‌కు చోటు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్లో తిరుచిట్రంబళం (తిరు) సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. -
ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా.. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయింది! (ఫొటోలు)
-
హీరోయిన్ మీనా బర్త్ డే వేడుకల్లో శరత్‌కుమార్.. ఫోటోలు వైరల్
-
మీనాపై చాలా నీచంగా దుష్ప్రచారం చేశారు: శరత్‌కుమార్
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫైర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల గురించి యూట్యూబ్ ఛానళ్లలో చెడుగా మాట్లాడటం, ట్రోల్ చేయడం చాలా తప్పు అంటూ ఆయన మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్లో కూడా ఇలాంటి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా అధ్యక్షులు మంచు విష్ణు సుమారు 20కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించేలా చర్యలు తీసుకున్నారు. అందుకు మీనా కూడా మంచు విష్ణును అభినందించారు.మీనాపై దుష్ప్రచారం చాలా తప్పు: శరత్ కుమార్ సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన మీనా గురించి కూడా పలు యూట్యూబ్ ఛానళ్లు తప్పుగా వీడియోలు చేశాయి. ఆమె మరో పెళ్లి చేసుకోనుందంటూ తీవ్రంగా ప్రచారం చేశాయి. దీంతో ఆమె పలుమార్లు మండిపడ్డారు కూడా. తాజాగా శరత్‌కుమార్ ఈ అంశం గురించి మాట్లాడారు. నటి మీనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. ఒక ఆడబిడ్డ గురించి ఇలా తప్పుగా మాట్లాడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. మీనా గురించి తప్పుగా మాట్లాడే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ఫైర్ అయ్యారు. యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని అలా మాట్లాడేవారి దగ్గర ఏదైనా రుజువు ఉందా..? ఏది కావాలంటే అది మాట్లాడటం చాలా నీచమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు తలచుకుంటే రాత్రికి రాత్రే ఇలాంటి వాటిని అదుపు చేయవచ్చని శరత్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు.వాళ్లు పురుగులతో సమానం: రాధికయూట్యూబ్ ఛానళ్లలో సినీ సెలబ్రిటీల గురించి హీనంగా మాట్లాడే వారు పురుగులతో సమానమని రాధికా శరత్‌కుమార్ అన్నారు. కోలీవుడ్‌లో కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినంటూ చెప్పుకుంటున్న బైల్వాన్ రంగనాథన్ లాంటి వారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చాలా తప్పని అన్నారు. -
మంచు విష్ణును అభినందించిన మీనా
చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోహీరోయిన్లను విమర్శిస్తూ కొందరు చేసిన, చేస్తున్న వీడియోలతో పాటు కామెంట్లను తొలగించాలంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ యూట్యూబ్ ఛానల్స్‌లలో ట్రోలింగ్ వీడియోలను తొలగించమని హెచ్చరించారు. ఇక నుంచి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించమని ఫైర్ అయ్యారు. దీంతో ఆయనకు నెటిజన్ల నుంచి కూడా మద్ధతు లభించింది.అభ్యంతరకరమైన కంటెంట్‌తో యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టేలా మంచు విష్ణు చేశారు. మహిళలపై అసభ్యకర కంటెంట్‌తో రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌ల గుర్తింపును శాశ్వితంగా రద్దు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఆయన చూపిన దూకుడుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా సినీ నటి మీనా రియాక్ట్ అయ్యారు.అనేక యూట్యూబ్ ఛానెల్‌లలో మహిళలను అవమానించేలా కంటెంట్‌తో నిండిపోయాయి. తప్పుడు కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయంగా ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా వీటిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లను తిప్పకొట్టడంలో నటీనటులు ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇండస్ట్రీని కాపాడుకునేందుకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. చలనచిత్ర పరిశ్రమ గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. విష్ణు, మీ చర్యలు నిజంగా అభినందనీయం. అంటూ మీనా రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రముఖ నట దిగ్గడం శివాజీ గణేశన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌కు చెందిన ఆయన దాదాపు 250కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. తమిళంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన జూలై 21, 2001లో కన్నుమూశారు. శివాజీ గణేశన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ), నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను పొందారు.ఇటీవల ఆయన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, సీనియర్ నటి మీనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన సినిమాలో నటించిన ఫోటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన వర్ధంతి రోజున శివాజీ గణేశన్‌ను మీనా గుర్తు తెచ్చుకున్నారు. నన్ను భారతీయ సినిమాకి పరిచయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మీతో నటించినందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చింది. తాజాగా మీనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. మీనా చిన్నారిగా ఉన్న సమయంలో శివాజీ గణేశన్‌తో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీనా చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన మీనా సినిమాల్లో నటించింది. ఆ రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. నిర్మాత ఆవేదన
మీనా.. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్. దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లిందే లేదు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది. అయితే మీనా, ఆమె తల్లి తనను అవమానించారంటున్నాడు ఓ నిర్మాత.దురుసు వ్యాఖ్యలుమాణిక్యం నారాయణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. ఓ ప్రోగ్రామ్ చేయమని పిలవడానికి మీనా దగ్గరకు వెళ్లాను. కానీ అటు వైపు నుంచి నాకు సరైన స్పందన రాలేదు. మీనాయే కాదు ఆమె తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడారు. నేనొక నిర్మాతను.. నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది. అలాంటి నన్ను పట్టుకుని అలా చీప్‌గా మాట్లాడతారా? నాకు చాలా బాధేసింది.వాళ్లందరూ నా స్నేహితులేఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏదీ అడగకూడదని తెలిసొచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఖుష్బూ, రోజా, సుహాసిని ఇలా చాలామంది సూపర్ హీరోయిన్లు నాకు స్నేహితులే! వాళ్లు నా కుమారుడి వివాహానికి కూడా వచ్చారు. అయినా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండటమే నయం అని పేర్కొన్నాడు. ఈయన వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి.చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్ -
Meena London Trip: లండన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న మీనా
తమిళసినిమా: బాలతారగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ కథానాయకిగా ఎదిగిన అతి కొద్ది మంది నటీమణిల్లో మీనా ఒకరు. బాల నటిగానే రజనీకాంత్‌తో కలిసి నటించి, ఆ తర్వాత ఆయన సరసన కథానాయకిగా నటించిన చరిత్ర ఈమెది. బహుభాషా నటిగా పేరుగాంచిన మీనా తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో సూపర్ స్టార్స్ అందరితోనూ జతకట్టారు. మలయాళ చిత్రం దృశ్యం వరకు కథానాయకిగా నటించి రాణించిన మీనా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈమె జీవితంలో ఎదుర్కొన్న విచారకరమైన సంఘటన భర్తను కోల్పోవడం. అనారోగ్యం కారణంగా భర్త చనిపోవడంతో మీనా కొంతకాలం ఆ బాధ నుంచి బయటపడలేకపోయారు. అయితే కాలమే అన్నింటికీ మందు అన్నట్టుగా నటి మీనా మళ్లీ కోలుకుని నటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరుగా నటించటానికి సిద్ధమవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈమె లండన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వేసవి విడిదిగా లండన్‌కు వెళ్లిన నటి మీనా అక్కడ పలు సుందరమైన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి. మంచి మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తున్న మీనాను చూసి ఆమెను అలా చూసి ఎన్నాళ్లైయిందో అంటూ అభిమానులు కృషి అవుతున్నారు. -
నిశ్చితార్థం రద్దయిందని ఘోరం
యశవంతపుర: నిశ్చితార్థం రద్దయిందనే ఉన్మత్త ఆవేశంలో 16 ఏళ్ల బాలికను తల నరికి హత్య చేసి పరారైన కిరాతకుడు ప్రకాశ్‌ను కొడగు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోమవారపేట పరిధిలో సుర్జబ్బి ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న మీనా అనే బాలికతో అతనికి గతంలో ఇరుకుటుంబాల వారు నిశ్చితార్థం చేశారు. ఏడాది నుంచి ప్రేమ హత్యకు గురైన మీనా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని హమ్మియాళకు చెందిన ప్రకాశ్ చిన్నచిన్న పనులు చేసుకొనేవాడు. ఏడాది నుంచి మీనా వెంటపడ్డాడు. రోజూ మీనాను ప్రకాశ్ బైకులో ఎక్కించుకొని స్కూల్ వద్ద వదిలేవాడు. ఫలితాలు వచ్చిన రోజునే నిశి్చతార్థంలో ఇద్దరినీ పెద్దలు కూర్చోబెట్టి ఉంగరాలు మారి్పంచారు. అయితే కొంతసేపటికి అధికారులు వచ్చి మైనర్ బాలికకు ఎలా పెళ్లి చేస్తారని ప్రశ్నించటంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు బాలిక తల్లిదండ్రులు సుబ్రమణ్య, జానకి తెలిపారు. ఆ తరువాత మీనాను మాటల్లో పెట్టిన ప్రకాశ్ ఆమె తల నరికి తీసుకెళ్లాడు. ఆమె తల్లిదండ్రులపైనా దాడి చేసి పరారయ్యాడు. ప్రకాశ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నిజం కాదని తేలింది. ఒక గ్రామంలో దాగి ఉన్న నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.రామరాజన్ తెలిపారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి హత్య గురించి విచారించారు. -
Meena Durairaj: యెల్లో..యెల్లో..మీనా బ్యూటిఫుల్లో..! (ఫోటోలు)
-
అజిత్‌కి జోడీగా...
కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్‌బాబు సినిమాలో...మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి ప్రధానపాత్రను పోషించిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో అజిత్ క్యామియో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయన 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఈ చిత్రం చాలా కీలకమైనది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. కాగా విడాముయర్చి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి 'మార్క్ ఆంటోని' చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లి అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీల నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో నటుడు అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. ఇందులో ఆయనకు జంటగా మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నటి 'సిమ్రాన్' కాగా మరొకరు 'మీనా' అని తెలిసింది. కాగా నటి సిమ్రాన్ ఇప్పటికే అజిత్‌తో కలిసి వాలి, అవళ్ వరువాళా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించగా, నటి మీనా సిటిజెన్, విలన్ చిత్రాల్లో అజిత్‌తో జత కట్టారు. దీంతో తాజాగా ఇద్దరూ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఆయన సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ నెలలో సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారికంగా త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
63 ఏళ్ల టాప్ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా
కోలీవుడ్‌లో రెండు దశాబ్దాలకు పైగా ప్రముఖ హీరోగా కొనసాగిన సీనియర్ నటుడు రామరాజన్.. 2001 వరకు వరుసగా సినిమాల్లో కనిపించిన ఆయన ఆ తర్వాత పెద్దగా వెండితెరపై కనిపించలేదు. 2010లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రామరాజన్ బయటిప్రపంచానికి కూడా టచ్‌లో లేకుండాపోయారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ ఒక సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.. ‘సామానియన్’ అనే చిత్రం ద్వార ఆయన రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 63ఏళ్లు కాగా ఆయన సరసన మీనా నటిస్తే కథకు బాగా సెట్ అవుతుందని ఆయన భావించారట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. 1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామరాజన్ తన 18వ సినిమా 'కరగట్టకరణ్' సూపర్ హిట్‌గా నిలిచింది. ఇది 25 కేంద్రాలలో 100 రోజులు, ఎనిమిది కేంద్రాలలో 360రోజులు, నాలుగు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శించబడింది. అలా ఆయన 45 సినిమాల్లో హీరోగా నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువగా ఆయన సినిమాల్లో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ 23 ఏళ్ల తర్వాత ‘సామానియన్’ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాలో రామరాజన్ లాయర్‌గా నటిస్తున్నారు. దీంతో తన సరసన సీనియర్ హీరోయిన్ 'మీనా' అయితే బాగుంటుందని దర్శకుడు ఆర్. రాకేష్ ద్వారా ఆమెను సంప్రదించారట. అందుకు మీనా అంగీకరించలేదట. కొన్ని కారణాల వల్ల రామరాజన్ సినిమాలో నటించలేనని మీనా తెలిపిందని అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రజనీ-కమల్ లాంటి హీరోలను ఢీ కొట్టిన నటుడు రామరాజన్. అలాంటి హీరోతో నటించనని మీనా చెప్పడం ఏంటి..? అంటూ ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అదే రజనీకాంత్ సినిమాలో మీనాకు ఛాన్స్ వస్తే వదులుకుంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా పలురకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు విషయం తెలియాలంటే మీనా చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. 1998లో తిరుచెందూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామరాజన్ భారీ మెజరాటీతో గెలిచి ఎంపీగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నారు. -
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి
మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనా
-
నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి: మీనా
బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసిన మీనా.. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్‌గానూ మారింది. దక్షిణాదిన ఎందరో స్టార్ హీరోలతో జోడి కట్టి తనదైన నటనతో కోట్లాదిమందిని తన అభిమానులుగా మార్చుకుంది. దాదాపు మూడు దశాబ్దాలపాటు అగ్రతారగా వెలుగొందింది. కెరీర్ పీక్స్‌లో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. 2022లో మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై పలు పుకార్లు వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆమె పలుమార్లు వాటికి క్లారిటీ ఇచ్చింది.. అయినా కూడా ఆమెపై సోషల్ మీడియా దాడి తగ్గడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో హీరో ధనుష్‌తో మీనాకు లింక్ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు.. రెండో పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. అవి చదివిన తన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది. అయినా కూడా తాజాగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాయడం ప్రారంభించారు. దీంతో ఆమెకు ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రచారం గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నవారిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. వాస్తవాలు తెలుసుకొని రాస్తే.. అందరికీ మంచిది. దేశంలో నాలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారు. నా తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇప్పుడు ఎలా చెప్తాను. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉంటే తప్పకుండా నేనే మీడియాకు ప్రకటిస్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు.' అని చెప్పింది. -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా
మీనా పేరు చెప్పగానే చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. 90ల్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. మరోవైపు తమిళంలో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఈమెకు బోల్డ్ రోల్స్, గ్లామర్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురవగా.. పలు ఆసక్తికర విషయాల్ని మీనా బయటపెట్టింది. ఆయన సలహా వల్లే 'నేను నార్మల్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నా చుట్టూ ఉన్నవాళ్లు గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదా అని అడిగారు. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే పాత్రలు చేయాలని.. కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా నాకు సలహా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ప్రభుదేవాతో చేసిన సినిమాలో ఓ సీన్లో భాగంగా స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్నాను. కాకపోతే సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను' (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) వాళ్లకు దండం పెట్టాలి 'ఇక స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్న తర్వాత అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని తెగ భయపడిపోయాను. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ చేసే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని అప్పుడే అనిపించింది' అని తనకెదురైన అనుభవాల్ని తాజాగా ఓ తమిళ షోలో చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో 'దృశ్యం' సినిమాలతో పాటు పలు మలయాళ సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తోంది. మరోవైపు ఈమె భర్త విద్యాసాగర్.. 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మీనా కూతురు కూడా 'తెరి' అనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
ధనుష్‌తో లింక్ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా
బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసింది మీనా. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్‌గానూ మారింది. దక్షిణాదిన ఎందరో స్టార్ హీరోలతో జోడి కట్టి వారి సరసన ఆడిపాడింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు అగ్రతారగా వెలుగొందింది. కెరీర్ పీక్స్‌లో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. గతేడాది మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ బాధలో నుంచి నెమ్మదిగా కోలుకుని మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది మీనా. ఒకే ఒక్కసారి అలాంటి డ్రెస్ 'అప్పట్లో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు చేస్తుండేవారు. నాకూ చేయాలనిపించేది. కానీ అంత కంఫర్ట్‌గా అనిపించేది కాదు. అయితే ఒకసారి ట్రై చేసి చూద్దామనుకున్నాను. అలా తమిళ సినిమాలో ఒకే ఒక్కసారి బికినీ వేసుకున్నాను. కానీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. అందుకే మళ్లీ అలాంటి డ్రెస్ వేసుకోలేదు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్‌లో నాలుగు చిత్రాలు చేయొచ్చని విన్నాను. ఇక్కడ బిజీ అవడంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా అక్కడికి వెళ్లలేదు. నిన్నే పెళ్లాడతా నేను చేయాల్సింది గీతాంజలి సినిమాలో చిన్నపాపగా నేను చేయాల్సింది. కానీ అప్పుడు ఎగ్జామ్స్ ఉండటంతో అమ్మ ఒప్పుకోలేదు. అలా ఆ మూవీ మిస్ అయింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఒప్పుకోలేదు. నరసింహ సినిమాలో కూడా నేను చేయాల్సింది. అది కూడా మిస్ అయ్యాను. నా భర్తకు లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సింది. కానీ చికిత్స ఆలస్యం కావడంతో పరిస్థితి చేజారిపోయింది. తను వెళ్లిపోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆయన చనిపోయిన రెండు నెలలకే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ధనుష్‌తో లింక్ చేశారు హీరో ధనుష్‌తో లింక్ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు. అవి చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా ఆలోచించట్లేదు! ఒకానొక సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం' అని చెప్పుకొచ్చింది మీనా. చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. గట్టిగా బుద్ధి చెప్పనున్న వర్మ! -
టీడీపీ నేత బండారుపై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం
-
మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై కోర్టు చర్యలు తీసుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలి. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయి. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడుతుంది అనుకుంటున్నారా?. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నవా?. మంత్రి రోజా చేసే పోరాటానికి నేను అండగా ఉంటాను అని మీనా.. మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటించారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
జడ్జిపై టీడీపీ నేతల పోస్టులు.. రాష్ట్రపతి భవన్ నుంచి సీరియస్ లేఖ
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. ఇది కూడా చదవండి: ‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు -
రెండో పెళ్లి చేసుకోమని మీనాకు సలహా.. నటి ఏమందంటే?
సినిమా ఇండస్ట్రీలో కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్లిపోతుందంటారు. హీరోయిన్లు మారుతుంటారు, కానీ హీరోలు మాత్రం దాదాపు అలాగే ఉండిపోతారు. కానీ కొందరు హీరోయిన్లు వారి క్రేజ్‌ను కాపాడుకుంటూ పరిశ్రమలో ఏళ్లకు ఏళ్లు నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈమె ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కుంగిపోయిన మీనా కెరీర్ పీక్స్‌లో ఉండగా మీనా 2009లో బెంగళూరుకు చెందిన బిజినెస్మెన్ విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనిక అనే కూతురు జన్మించింది. అటు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతోషంగా సాగిపోతున్న మీనా జీవితం గతేడాది ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. గత సంవత్సరం జూన్‌లో ఆమె భర్త విద్యాసాగర్ మరణించడంతో తీవ్రంగా కుంగిపోయింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుని సినిమాలతో బిజీ అవుతున్న తరుణంలో మీనా రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ అవి ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అప్పుడు మీనా దగ్గరే ఉన్నా తాజాగా ఈ వ్యవహారంపై మీనా స్నేహితురాలు కాలా మాస్టర్ స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాకు మీనాతోనే కాదు, ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మేము ఫ్రెండ్స్‌గా కంటే కూడా అక్కాచెల్లెలిగానే ఎక్కువ కలిసిపోయాం. తనకు ఏ అవసరం వచ్చినా వెంటనే నేను అక్కడ వాలిపోతాను. విద్యాసాగర్ ఆరోగ్యం బాలేనప్పుడు మూడు నెలలపాటు నేను తన దగ్గరే ఉన్నాను. కానీ జరగకూడనిది జరిగిపోయింది. ఆ బాధ నుంచి బయటకు రావడానికి.. తను ఎప్పుడైనా ఉన్నట్లుండి ఫోన్ చేసినా కూడా భయమేసేది. ఆ మూడు నెలలు ముళ్ల మీదే ఉన్నట్లనిపించింది. మీనా భర్త మరణించాక ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. జీవితం ఇంకా చాలా ఉంది, ఆ బాధ నుంచి బయటకు రావాలని ఏవేవో చెప్పేదాన్ని. తను కూడా నేను చెప్పేది కరెక్టేనని తలూపుతూనే ఈ విషాదం నుంచి బయటకు రావడం ఎంత కష్టంగా ఉందో మాటల్లో చెప్పలేనని బాధపడేది. పెళ్లి ప్రస్తావన తెస్తే కోప్పడేవారు తర్వాత నెమ్మదిగా తను ఒప్పుకున్న సినిమాల కోసం సెట్స్‌కు రావడం మొదలుపెట్టింది. అప్పుడు తనతోపాటు నేను కూడా తిరిగి మామూలు మనుషులమయ్యాం. మీనా తల్లి గురించి తలుచుకుంటేనే బాధేసేది. మీనాది మరీ అంత పెద్ద వయసు కాదు కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వాళ్లు నాతో గొడవపడేవారు. ముందు నీ పని నువ్వు చూసుకో లేదంటే సైలెంట్‌గా ఉండు అని నా నోరు మూయించేవాళ్లు. తనకు కూతురు ఉందని, అంతకుమించి ఎటువంటి రిలేషన్స్ కోరుకోవడం లేదని మీనా నాతో అంది' అని చెప్పుకొచ్చింది ఆమె స్నేహితురాలు. చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే! -
మృగశిర కార్తెలో ‘మీనం‘ దివ్యౌషధం
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు, పండుగొప్ప ఇగురు, కొర్రమేను కూర, కొయ్యింగల పులుసు, గుమ్మడి చుక్క, కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో పచ్చి మెత్తళ్ల మామిడి, ఎండు మెత్తళ్ల వేపుడు, కట్టి చేపలు, బొమ్మిడాయిల పులుసు, రామల ఇగురు, చింతకాయ చిన్న చేపలు, చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు ► చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ► ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. ► మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. ► వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ► టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ► చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. ► గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. ► చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూంటాయి. -
పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్‌స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ
పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు. సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు. -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
అమ్మ గురించి అలాంటివీ రాయొద్దు.. మీనా కూతురు ఎమోషనల్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప కూడా జన్మించింది. అయితే గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గత నెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఎమోషనలయ్యారు. మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్, పలువురు సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగ రిలీజ్ చేశారు. నైనిక మాట్లాడుతూ.. 'అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌కు వెళ్లిపోయి చాక్లెట్స్ తింటూ కూర్చున్నా. ఆరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన తలైనా రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్, బోనీకపూర్, రాధిక, రోజా, సంఘవి, స్నేహా, జూనియర్ శ్రీదేవి, ప్రభుదేవా పాల్గొన్నారు. அம்மா வந்து ஒரு Heroine ah இருக்கலாம்.. ஆனா உங்கள மாதிரி ஒரு Human தான்.. அவங்களுக்கும் Feelings இருக்கு 🥲❤️❤️ #meena #nainika #meena40 #ladysuperstar #மீனா pic.twitter.com/rYZA4Avrk2 — Kamala மீனா (@MeenaNavy) April 22, 2023 -
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి..?
-
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్‌లో భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చాలా గ్యాప్‌తో తర్వాత ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. ఇదిలా భర్తను కొల్పోయిన బాధలో ఉన్న మీనాపై సోషల్ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి కేఆర్ విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా తీవ్రంగా ఖండిచింది. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగో ఓ సినీ క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోను పెళ్లి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని, గతేడాది భార్యతో విడాకులు తీసుకున్ని విడిపోయాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో మీనా కంటే చిన్నవాడని, నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడి కామెంట్స్‌ని కొట్టిపారేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?’,‘ఏదైనా చెబితే నమ్మే విధంగా ఉండాలి’ అంటూ సదరు ఫిలిం క్రిటిక్కు చురకలు అట్టిస్తున్నారు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్.. అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ కాగా గతంలోనే మీనా తాను తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మీనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మీనాకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయి. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు. -
రాజస్తాన్‌లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్‌లోని కాల్ సెంటర్‌ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరో అంటే క్రష్.. పెళ్లి రోజు నా గుండె పగిలింది: మీనా
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణించింది. కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. పెళ్లికి ముందు తనకు ఓ బాలీవుడ్ హీరో అంటే క్రష్ ఉండేదని, అలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. మీనా మనసు పడ్డ హీరో ఎవరో కాదు... బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్‌పై తనకు ఉన్న ప్రేమ గురించి చెబుతూ.. ‘హృతిక్ రోషన్‌ను చాలా ప్రేమించాను. నాకు హృతిక్ లాంటి అబ్బాయి కావాలి అని పెళ్లి ప్రపోజ్ చేస్తున్న మా అమ్మతో చెప్పాను. హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అని మీనా చెప్పుకొచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మీనా 40 ఏళ్ల సినీ ప్రయాణం.. స్టార్స్ గ్యాదరింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ తీశాం. తెరమీద పాత్రలు మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం(3వ తేదీ) ఎదురు చూస్తున్నాను’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తరాలు మారొచ్చు కానీ సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా సన్నివేశాలు తీశారు కృష్ణారెడ్డిగారు’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డిగారు’’ అని కె. అచ్చిరెడ్డి అన్నారు. ‘‘హీరోగా నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మంచి అవకాశం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం అని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు సోహైల్. -
మామ.. అల్లుడు వస్తున్నారు
సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్యారెక్టర్ ఉంటే తిరుగుండదు
‘‘యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్. -
హైదరాబాద్‌లో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం (ఫొటోలు)
-
భర్త చనిపోయాక తొలిసారి అలా కనిపించిన మీనా..
బాలనటిగా తెరంగేట్రం చేసిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నటిగా మంచి ఫామ్‌లో సమయంలో 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. ఓపక్క కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్న మీనా జీవితంలో గతేడాది పెను విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ నెలలో ఆమె భర్త కన్నుమూశారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది మీనా. సినిమాలకు కూడా సైన్ చేసి షూటింగ్స్‌లో పాల్గొంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ తిరిగి నార్మల్ అవడానికి ట్రై చేస్తోంది. అయితే భర్త చనిపోయాక మొదటిసారి డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. సీనియర్ హీరోయిన్ సంఘవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: నీ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు: విష్ణుప్రియ రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్‌డే అంటున్న బ్యూటీ -
పెను విషాదం తర్వాత చిన్న గ్యాప్.. మళ్లీ కెమెరా ముందుకు మీనా
నటి మీనా చిన్న విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో అగ్ర కథానాయిగా రాణించిన విషయం తెలిసిందే. కాగా ఈమె నటిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగానే విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలాంటిది నటి మీన జీవితంలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ ఈ ఏడాది కరోనా కారణంగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. దీంతో నటి మీనా బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ మధ్య నటి కుష్భు, సంఘవి, రంభ తదితరులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా ఇటీవల మానసిక వేదన నుంచి బయటపడటానికి నటి మీనా విదేశీ పర్యటన చేసి వచ్చారు. దీంతో కాస్త తేరుకున్న ఆమె మళ్లీ చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు. గతంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఆమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేయాల్సి ఉంది. దీంతో పాటు మలయాళంలో మోహన్‌లాల్ సరసన దృశ్యం–3 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. చదవండి: (నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి) -
మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా? ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఏమందంటే..
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లు సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?
నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలనటిగా తెరంగేట్రం చేసిన నటీమణుల్లో ఈమె ఒకరు. ఆ తర్వాత కథానాయిక స్థాయికి ఎదిగిన మీనా 1990 దశకంలో అగ్ర కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్రహీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా రజనీకాంత్‌తో బాలనటిగా నటించి ఆ తర్వాత యజమాన్, ముత్తు వంటి చిత్రాల్లో కథానాయికగా నటించడం విశేషం. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. అలా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారు. వీరికి నైనికా అనే కూతురు ఉంది. ఆ పాప కూడా తేరి తదితర చిత్రాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కాగా వివాహానంతరం కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటిస్తున్న మీనా జీవితంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన ఆమె భర్త గత జూన్ నెలలో కన్ను మూశారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మీనాకు రెండో పెళ్లి చేయడానికి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో మీనా కూడా పెళ్లికి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వరుడు కూడా తెలిసిన వ్యక్తేనట. ఆమె భర్త మిత్రుడే అని సమాచారం. అయితే దీని గురించి మీనా తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా మీనా మలయాళంలో మోహన్‌లాల్ జంటగా నటించిన దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో పార్ట్ 3 త్వరలో ప్రారంభం కాబోతుందని సమాచారం. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సీనియర్ నటి.. అందులో నిజమెంత?
సీనియర్ నటి మీనా గురించి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినిమాల్లో కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. కొద్ది నెలల క్రితమే మీనా జీవితంలో భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే. (చదవండి: అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్) అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుంటున్నారు. మెల్లమెల్లగా ఆమె తన ప్రొఫెషన్లో యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఆమెకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కూతురికి కోసమైనా రెండో పెళ్లి చేసుకోమ్మని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. మరీ ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు కూతురి భవిష్యత్తు దృష్ట్యా ఫ్యామిలీ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్‌పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్‌తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్‌గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్‌గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్‌గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
జీవితంలో మొదటిసారి ఆమెను చూసి అసూయ కలిగింది: మీనా
తమిళసినిమా: బాల నటి నుంచి కథానాయకిగా ఎదిగిన నటి మీనా. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఈమె తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటే‹Ù, నాగార్జున వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. అలాంటిది మీనా జీవితంలో ఇటీవల శోక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈమెను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి నటి కుష్భు, సంగీత, సంఘవి తదితర స్నేహితురాళ్లు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతోంది. దీంతో నటి మీనా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమా చారం. అదే విధంగా సామాజిక మాధ్యమాలపైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల స్నేహితురాలితో కలిసి విదేశీ పర్యటన చేశారు. తాజాగా తన ఇన్ స్ట్రాగామ్‌లో నటి ఐశ్వర్యారాయ్ గురించి ఓ పోస్ట్ చేశారు. తన డ్రీమ్ క్యారెక్టర్ నందిని(పొన్నియన్ సెల్వల్‌లో ఐశ్యర్యరాయ్ చేసిన పాత్ర) కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి, అసూయ కలిగిందన్నారు. తన జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీనటులందరికీ తన అభినందనలు అని నటి మీనా పేర్కొన్నారు. ఈమె ట్విట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ మీనా తాజాగా తన 46వ పుట్టిన రోజును సెలబ్రెటీ స్నేహితులు మధ్య జరుపుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 16న) మీనా బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె తన ఇండస్ట్రీ స్నేహితులు, అలనాటి స్టార్ హీరోయిన్లు సంగీత, సంఘవి, రంభలతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనాకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నారు. సంగీత, రమ్యకృష్ణ, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, రంభ, స్నేహ ఇలా చాలామంది తనకు ఆప్తమిత్రులని మీనా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భర్తను కొల్పోయి విషాదంలో ఉన్న మీనాకు వారంతా అండగా నిలుస్తున్నారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. సందర్భం వచ్చినప్పుడల్లా వారంత మీనాను కలిసి కాసేపు ఆమెతో గడుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టిన రోజు కావడంతో రంభ, సంగీత, సంఘవిలు కలిసి ఆమె బర్త్‌డేను సెలబ్రెట్ చేశారు. మీనాతో కేక్ కట్ చేయించి తనతో కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాటి కఠిన సమయంలో మీనాకు అండగా నిలుస్తున్న ఈ తారలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘నిజమైన స్నేహం అంటే మీది’, ‘మీనా గారు ఇండస్ట్రీలో మంచి స్నేహితులను పొందారు’ అంటూ ఆమె పోస్ట్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తాజాగా ఆమె గోప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తదనంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. (చదవండి: 'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ) ‘ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్‌కు(మీనా భర్త) ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు. అవయవ దానం గొప్పదనం గురించి ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా ఆర్గాన్స్‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను’అంటూ ఎమోషనల్ పోస్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. మీనా నిర్ణయం వెనుక ఆమె భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మీనా భర్తకు ఊపిరితిత్తులు మారిస్తే బ్రతికేవాడు. కానీ సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
భర్త చనిపోయాక మీనా తొలిసారి ఇలా.. ఫొటో వైరల్
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్ బర్త్‌డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ బర్త్‌డే విషెస్ ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ -
ఇన్నాళ్లకు మీనా నాకు చిక్కింది: అలీ భార్య జుబేదా
నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. జూలై 19న తన పుట్టినరోజు సందర్భంగా 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశాడు. అయితే దీన్నంతటినీ తన కెమెరాలతో క్యాప్చర్ చేసింది కమెడియన్ అలీ భార్య జుబేదా. సెట్స్‌లోకి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఇక ఈ సినిమా సెట్స్‌లో నటి మీనా కూడా ఉండటంతో ఆమెను కలిసింది జుబేదా. నీకు వీరాభిమానిని అంటూ మీనాతో మాటలు కలిపింది జుబేదా. గతంలో 'పెళ్లాం చెబితే వినాలి' సినిమా సమయంలో కలిశామని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిశామని చెప్తూ సంతోషపడిపోయిందామె. పెళ్లాం చెబితే వినాలి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి 7వ తరగతి పరీక్షలు మానేసి మరీ మిమ్మల్ని కలిశానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది జుబేదా. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దామన్నా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం, ఇన్నాళ్లకు మీనా తన యూట్యూబ్‌కు చిక్కిందని సంబరపడిపోయింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్నాననంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నానని తెలిపింది. తెలుగులో సినిమాలు చేయట్లేదని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పకుండా తెలుగులో మూవీస్ చేస్తాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చదవండి: యంగ్ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత తెలుగు సినిమాలకు అవార్డుల పంట, ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే? -
వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్ పోస్ట్
నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా, నటిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పెళ్లి అనంతరం కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సహానటి, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే గత నెల మీనా భర్త విద్యాసాగర్ హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే. చదవండి: లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో.. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్ కోవిడ్, ఊపరితిత్తుల సమస్యలతో అనారోగ్య బారిన పడ్డారు. ఆయన లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ జూన్ 29న తుదిశ్వాస విడిచారు. అయితే మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ మీనా భావోద్యేగానికి లోనయింది. భర్తను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పంచుకుంది. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి భర్త విద్యాసాగర్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం(బహుమతి). కానీ చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి ఆ దేవుడు తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా(నా) గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతరాలిని. మీలాంటి వారి ఆశ్వీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి’ అంటూ మీనా రాసుకొచ్చింది. కాగా మీనా, విద్యాసాగర్‌ను 2009 జులై 12న పెళ్లాడింది. వీరికి కూతురు నైనిక జన్మించింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
భర్త మరణాంతరం తొలిసారి స్పందించిన నటి మీనా
భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. చదవండి: ‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’ ‘విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మీనా. చదవండి: వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు.. కాగా గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. చదవండి: బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్‌డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్‌లో మీనా ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అశ్రునయనాల మధ్య మీనా భర్త అంత్యక్రియలు..రజనీకాంత్ కంటతడి
సాక్షి, చెన్నై: నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్ మరణం మీనా కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తగా, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు స్థానిక సైదాపేటలోని మీనా ఇంటికి తరలి వచ్చి ఆమె భర్త విద్యాసాగర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు మీనాను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కంటతడి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి మీనా భర్తను కోల్పోవడంతో ఆమె బంధువులు, సన్నిహితులు, అభిమానులు చలించిపోయారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న మీనాకు ఆ బాధ నుంచి కోలుకోవడానికి తగిన శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ విద్యాసాగర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. నటుడు రజనీకాంత్, మీనాలది సుదీర్ఘకాల సినీ అనుబంధం. ఆయన కథానాయకుడిగా నటించిన అన్భుళ్ల రజనీకాంత్ చిత్రంలో మీనా బాలనటిగా నటించారు. ఆ తరువాత యజమాన్, ముత్తు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో రజనీకి జంటగా మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ మీనా ఇంటికి వెళ్లి ఆమె భర్త భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. (చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా?) రజనీకాంత్‌ను చూడగానే మీనా అంకుల్ అంటూ బోరున ఏడ్చారు. దీంతో ఆమెను ఓదార్చిన రజనీకాంత్ కంటతడి పెట్టారు. అలాగే నటుడు, విజయకుమార్, శరత్‌కుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు సుందర్ సి, కుష్భు, చేరన్, నటి లక్ష్మి, సంగీత, రంభ, స్నేహ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్, శరత్‌కుమార్, విశాల్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నటి మీనా భర్త విద్యాసాగర్‌కు కోలీవుడ్ నివాళి (ఫొటోలు)
-
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఆయన మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడని స్థానిక మీడియాలో వార్తలు వెలుబడుతున్నాయి. మీనా ఫ్యామిలీ మొత్తానికి గతంలో కరోనా సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ... విద్యాసాగర్ కొన్ని నెలలుగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నాడు. (చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?) పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపై ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్ తరచూ దానా వేస్తూ అక్కడే గడిపేవాడట. కోవిడ్ సోకిన సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తులు పాడైపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ..దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మీనా, విద్యాసాగర్‌ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి(పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్) ఈ విధంగా స్పందించారు. -
నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
సీనియర్ హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌తో 2009లో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ( ఫైల్ ఫోటో ) ( ఫైల్ ఫోటో ) -
మీనా తల్లి కాబోతుందా?.. నెట్టింట వీడియో వైరల్
Actress Meena Is Pregnant Video Goes Viral: ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగువెలిగింది అందాల నటి మీనా. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అరుదైన దుబాయ్ గోల్డెన్ వీసాను కూడా అందుకుంది. అయితే కెరీర్ సరిగా లేని సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త సాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక పాప నైనిక ఉంది. ఆమె కూడా సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీసోడు చిత్రంలో అతనికి కూతురుగా యాక్ట్ చేసి మెప్పించింది. కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం వరకు సినిమాలు చేయలేదు మీనా. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా.. తల్లి, సోదరి తదితర పాత్రలతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మీనా ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మీనా పోస్ట్ చేసినా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపిస్తుంది. 'చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది.' అంటూ వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) ఈ పోస్ట్‌ను బట్టి చూస్తే మీనా ఓ సనిమాలో గర్భవతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే మీనా ఈ వీడియోను షేర్ చేసినట్లు సమాచారం. ఈ పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు 'కంగ్రాట్స్' అని, మరికొందరు 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్' అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1591342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బతుకంతా బాలల కోసం!
మీనా స్వామినాథన్ మరణం తరాలుగా ఆమె పని నుండి స్ఫూర్తిని పొందిన పరిశోధకులకు, అభ్యాసకులకు, కార్య కర్తలకు తీరని లోటు. అన్నింటికంటే కూడా భారతదేశ అంగన్వాడీ రంగానికి నష్టం. ఆమె ఒక మార్గదర్శక విద్యావేత్త, పరిశోధకురాలు, మహిళా సమానత్వం కోసం కృషి చేసిన కార్యకర్త. ఆమె భారతదేశ బాలలకు, ముఖ్యంగా అభాగ్యులకు విరామమెరుగక సేవలందించిన స్నేహితురాలు. స్వాతంత్య్రానంతర దశాబ్దాలలో, మీనా స్వామినాథన్‌తో పాటుగా ఒక తరం మహిళా నాయకులు కొన్ని విశిష్టమైన ఆలోచనలకు ఊపిరి పోశారు. కొత్తగా రెక్కలొచ్చిన దేశంలో ఆ ఆలోచనలు పలు వర్గాలవారి సంక్షేమ కార్యక్రమాలకు పునాదులు వేశాయి. సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్డీఎస్), సంచార శిశు లాలన కేంద్రాల వంటి వినూత్న సదుపాయాల కల్పనకు ఆచరణ రూపం ఇవ్వడంలో మీనా విస్తృత∙భాగస్వామిగా ఉన్నారు. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) ఏర్పాటుకు మూలం అయిన నివేదిక బృందానికి ఆమె నేతృత్వం అత్యంత కీలకమైనది. మీనా 1933లో జన్మించారు. ఆమె తల్లి ప్రముఖ తమిళ రచయిత్రి ‘కృతిక’ మధురం. తండ్రి సుబ్రహ్మణ్యం భూతలింగం. ఆయన ప్రభుత్వోద్యోగి, ఆర్థికవేత్త. మీనా కేంబ్రిడ్జ్‌లో తన కాబోయే భర్త, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను కలుసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో దేశ నిర్మాణానికి ఈ దంపతులిద్దరూ కట్టుబడి ఉన్నారు. బెంగాల్ కరవు వల్ల సంభవించిన వినాశనం తరువాత, స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశంలో ‘హరిత విప్లవ పితామహుడు’గా గుర్తింపు పొందారు. ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి విజేత కూడా! దేశానికి మీనా అందించిన సేవలు, కృషి కూడా అంతే విస్తృతమైనవి. 1970లో శిశు అభివృద్ధి అధ్యయన బృందానికి అధ్యక్షురాలయ్యే అవకాశం ఆమెకు లభించింది. ఈ బృందంలో చిత్రా నాయక్, జేపీ నాయక్, అనిల్ బోర్డియా వంటి ప్రముఖులు ఉన్నారు. 1972లో వెలువడిన ఆ బృందం నివేదిక ఒక శక్తి మంతమైన సంకల్పానికి పిలుపునిచ్చింది. ‘‘సాధారణ బాలలు, అభాగ్యులైన బాలల మధ్య ఏటా అంతరం పెరుగుతూ వస్తోంది. కనుక పాఠశాలకు పూర్వ దశలోనే సామాజిక న్యాయంతో ఆ అంతరాన్ని తగ్గించాలి. ఎందుకంటే మొదటి ఐదు సంవత్సరాలే బాలల్లో అన్ని రకాల అభివృద్ధికి కీలకం’’ అని మీనా వ్యాఖ్యా నించారు. ఆ నివేదిక ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిన ఐసీడీఎస్ ఆవిర్భావానికి మూలం అయింది. పిల్లలకు, తల్లులకు మెరుగైన సదుపాయాలు, సహాయ సహకారాలు ఉండాలని మీనా విశ్వసించారు. ‘‘నా బిడ్డను చూసు కోవాల్సిన అవసరం ఉన్నందున నేను పని చేయడం మానేశాను’’ అని ఒక స్త్రీ చెప్పినప్పుడు, సమాజం దానిని సహజమైన విష యంగా భావిస్తుంది. ఇది సరైన భావన కాదు. ఏదో కన్నాం, పుట్టారు అని కాకుండా... సంతోషం కోసమే సంతానం అనుకున్న ప్పుడు ఆ బిడ్డల సంరక్షణను తండ్రి, కుటుంబ సభ్యులు కూడా స్వీకరించాలి. సమాజానికి, ప్రభుత్వానికి కూడా పిల్లల వికా సంలో ప్రమేయం ఉండాలి’’ అంటారు మీనా. తల్లిపాలే ఆరోగ్యం అని ప్రచారం చేస్తున్నప్పుడు తల్లికి పౌష్టికాహారపు అవసరం తెలియజెప్పాలని కూడా మీనా చెబుతారు. 1979లోనే మీనా పట్టణ పేదల పిల్లల ఆరోగ్యం, వికాసం గురించి అనేక అధ్యయన పత్రాలను సమర్పించారు. పట్టణ పేదరికంలో పెరుగుతున్న లక్షలాది మంది పిల్లలు విధాన నిర్ణేతలకు కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వాలు గ్రామీణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కూడా పట్టణ బాలల్లో పేదరికం లేదన్న భావన ఏర్పడుతోందని అంటూ.. ‘‘ఫౌంటైన్లు, పార్కులు, నగర సుందరీకరణ కోసం నిధులు అక్కరలేదు. అదే వనరులను పేద పిల్లలకు అవసరమైన కార్య క్రమాల కోసం ఉపయోగించలేరా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు. మీనా 1985లో సీఎస్డీఎస్ కోసం భారతదేశంలోని తక్కువ ఆదాయం కలిగిన శ్రామిక మహిళల కోసం పిల్లల సంరక్షణ సౌకర్యాలపై ‘హూ కేర్స్?’ అనే పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ‘కాళి ఫర్ ఉమెన్’ అనే స్త్రీవాద ప్రచురణాలయం దీనిని అచ్చు వేసింది. ముందుమాటలో వినా మజుందార్: ‘రాజ్యాంగంలోని సమానత్వ నిబంధనల నుంచి ప్రయోజనం పొందగలమని ఆశించిన మన మొదటి తరం మహిళల మాదిరిగానే... స్వాతంత్య్రం వచ్చినప్పుడు మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీనా స్వామినాథన్ కూడా నమ్మారు’’ అని రాశారు. కానీ మహిళల సమస్యలు అలాగే ఉండిపోయాయి. మహిళలు సాధారణంగా అతి స్వల్ప వేతనం లభించే పిల్లల సంరక్షణ వంటి తక్కువ నైపుణ్యాలు అవసరమైన పనిలోకి వెళ్లే విధంగా సామాజిక, కుటుంబ పరమైన ఒత్తిళ్లకు గురవుతారు. తద్వారా వారు శ్రామికశక్తిలో భాగంగా కనిపించకుండా పోతారు. మీనా విద్యావేత్త. తన జీవితమంతా స్త్రీ, శిశు సంక్షేమానికి అవసరమైన అధ్యయనాలు చేస్తూ ప్రభుత్వానికి, పలు సంస్థలకు మార్గదర్శకంగా ఉన్నారు. ‘‘చివరికొచ్చే సరికి పరిశోధనా ఫలితాలన్నవి ఆచరణకు ప్రేరణవ్వాలి’’ అని అంటారు మీనా. యాభై సంవత్సరాల క్రితం, దేశవ్యాప్తంగా అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమంటే అదెంతో సాహస వంతమైన దృక్పథం అనే చెప్పాలి. మీనా అలాంటి ఆలోచన చేయగలిగారు. నేడు భారతదేశంలో పది లక్షల కంటే ఎక్కువ అంగన్వాడీలు ఉన్నాయి. అంతకు రెట్టింపుగా అంగన్వాడీ కార్య కర్తలు అనేక లక్షల మంది తల్లులకు, పిల్లలకు బహుళ సేవలను అందిస్తున్నారు. జార్జ్ బెర్నార్డ్ షా నాటకంలోని పాత్ర ఒకటి ఈ సందర్భంగా నాకు గుర్తుకు వస్తోంది: ‘‘మీరు జరుగుతున్నవి చూస్తారు. ‘ఎందుకు?’ అనుకుంటారు. కానీ నేను జరగనివాటిని కలగంటాను. ‘ఎందుకు కాదు?’ అని అడుగుతాను’’ అంటుంది ఆ పాత్ర. భారతదేశపు పిల్లల తరఫున మీనా స్వామినాథన్ అడిగిందీ ఇదే.. ‘ఎందుకు కాదు?’ అని! వ్యాసకర్త ఐఏఎస్ అధికారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మీనా జ్యువెలర్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
-
మీనా జ్యువెలర్స్ గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు
-
గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
Senior Actress Meena Receives UAE Golden Visa: ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇచ్చే గోల్డెన్ వీసాలను అందుకుంటున్నారు. 2019 నుంచి ఈ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ అరుదైన గౌరవాన్ని తాజాగా సీనియర్ హీరోయిన్, నటి మీనాకు దక్కింది. ఈ వీసాను స్వీకరించిన మీనా దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్ఫోలో పాల్గొన్నారు. తనకు గోల్డెన్ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల మీనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే అరబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. -
పది రోజుల్లో పెళ్లి.. మెసేజ్‌లు, వాయిస్ రికార్డులు చూపించి..
సంతబొమ్మాళి (శ్రీకాకుళం): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. ఆర్మీ జవాన్ ఇంటి ముందు బైఠాయించింది. ఈమెకు గ్రామస్తులంతా మద్దతు పలకడంతో సదరు వ్యక్తి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సంతబొమ్మా ళి మండలం యామలపేటకు చెందిన మురాల తులసీరావు, పార్వతిల కుమార్తె మీనాకు గాజువాకకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం కావాల్సి ఉంది. పది రోజుల క్రితం కుమార్తె తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇవ్వడానికి గాజువాక వెళ్లగా వరుడు పెళ్లికి నిరాకరించడంతో నిర్ఘాంతపోయారు. ఎందుకని ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పరపటి జగదీష్.. మీనాతో అతనికి ఉన్న స్నేహాన్ని తనకు చెప్పాడని, సెల్‌ఫోన్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డులను చూపించాడని అన్నాడు. అందుకనే తనకు ఈ సంబంధం వద్దని తెగేసి చెప్పాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆర్మీ జవాన్ జగదీష్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలతో పంచాయతీ పెట్టారు. మీనాను పెళ్లి చేసుకోవాలని జగదీష్‌ను కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో గురువారం జగదీష్ ఇంటిముందు నిరసన చేపట్టారు. దీంతో యువకుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న నౌపడ ఏఎస్ఐ నర్సింగరావు సిబ్బందితో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. మీనా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) -
మరోసారి కలసి నటించిన మోహన్ లాల్ మీనా
-
కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్
కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్ నటి మీనా తన అభిమానులను పలకరించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన మీనా ప్రస్తుతం తల్లి, సహానటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె మీడియా, సోషల్ మీడియాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ క్రమంలో న్యూ ఇయర్లో తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చిన మీనా ఓ బ్యాడ్ న్యూస్ పంచుకున్నారు. చదవండి: వారిని అలా చూస్తుంటే అసూయ కలుగుతోంది: స్టార్ హీరో అంతేకాదు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. 2022లో వారి ఇంటికి వచ్చిన తొలి గెస్ట్ ఎవరో చెబుతూ ఆసక్తికంగా చెప్పుకొచ్చారు. ఇంతకి ఆ గెస్ట్ ఎవరో తెలుసా.. అయితే ఆమె పోస్ట్ చూడాల్సిందే. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చదవండి: నాకింగా 29యే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఫన్నీగా, వ్యంగ్యంగా చేసిన ఆమె పోస్ట్ ప్రస్తుతం ఆకట్టుకుంటున్నప్పటికీ.. మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దీంతో మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. గెట్వెల్ సూన్ మేడం’ అంటూ ఆమె ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా మీనా చివరిగా దృశ్యం 2లో కనిపించారు. First visitor to my home in 2022, Mr Corona. It liked my entire family. But I'm not letting it stay 😊 Beware people. Please stay safe ND healthy. Be responsible and don't let it spread. Keep us in your prayers 🙏 #stayhome #beresponsible #dontspread #weareinthistogether pic.twitter.com/sVmXKNLBzO — Meena Sagar (@Actressmeena16) January 5, 2022 -
‘దృశ్యం 2’ మూవీ రివ్యూ
టైటిల్ : దృశ్యం2 నటీనటులు : వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థలు : సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ కథ, దర్శకత్వం : జీతు జోసెఫ్ సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్ ఎడిటర్: మార్తాండ్ కే విడుదల తేది : నవంబర్ 25,2021 ఈ ఏడాది ప్రైమ్ లో చాలా కొత్త చిత్రాలు వచ్చాయి. కాని కొన్ని మాత్రమే నెటిజన్స్ ను మెప్పించడంతో పాటు ప్రైమ్ కు బోల్డంత పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దృశ్యం 2, మలయాళ వర్షన్. దృశ్యం మొదటి భాగం థియేటర్స్ లో దుమ్మురేపింది. దృశ్యం 2 మలయాళ వర్షన్ ప్రైమ్ లో విడుదలై ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ఇప్పుడు అదే దారిలో తెలుగు వర్షన్ కూడా వెళ్లింది. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 తెలుగు వర్షన్ నేటి (నవంబర్ 25)నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. దృశ్యం 2 కథేటంటే..? దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలవుతుంది. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన రాంబాబు ఫ్యామిలీ ఉన్నత జీవితాన్ని గడుపుతుంటుంది. కెబుల్ బిజినెస్ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్ ఓనర్ అవుతాడు. అంతేకాదు ఏకంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇలా వారి జీవితంగా సాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్ అనిల్) భయంతో వణికిపోతుంటారు. ఇదే క్రమంలో రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత... తన స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు(సంపత్ రాజ్)సహాయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేయిస్తుంది. మరి వరుణ్ కేసులో పోలీసులకు దొరికి ఆధారాలేంటి? కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా బయటపడ్డాడు అనేదే ‘దృశ్యం 2’కథ. ఎవరెలా చేశారంటే..? రాంబాబు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. దృశ్యం మాదిరే.. ఇందులో కూడా కథ మొత్తాన్ని తన భుజానా వేసుకొని నడిపించాడు. ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్ లో చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ని అద్బుతంగా పండించాడు. ఈ మూవీతో వెంకటేశ్ నటుడిగా వెంకటేశ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. రాంబాబు భార్య జ్యోతి పాత్రకు మీనా న్యాయం చేసింది. నటన పరంగా బాగానే ఉన్నా.. డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇక రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్ అనిల్ కు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఐజీగా సంపత్ రాజ్, కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఈ మూవీ మలయాళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, సూపర్ హిట్ అయింది. అయినా.. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రెష్ లుక్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. మాతృకతో పోలిస్తే.. తెలుగు వర్షన్లో కొన్ని స్వల్ప మార్పులు చేశాడు దర్శకుడు. మలయాళంలో చివరి వరకు చెప్పని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని తెలుగులో ముందుగానే చెప్పాడు. మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. వరుణ్ కేసును పోలీసులు సీక్రెట్‌గా విచారిస్తున్నారని తెలియడంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కథ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో రాంబాబు ఇచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. కోర్టు సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. మొత్తంగా దృశ్యం 2’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయాలకొస్తే..అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పితే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ వెంకటేశ్ నటన కథ, కథనం సెకండాఫ్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Drushyam 2 : వరుణ్ మర్డర్ కేసు నుంచి రాంబాబు బయటపడ్డాడా?
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దృశ్యం 2’. సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలైంది. ఇందులో వెంకటేశ్ థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. వరుణ్ మర్డర్ కేసు విషయంలో రాంబాబు ఫ్యామిలీపై పోలీసు నిఘ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ హత్యను రాంబాబే చేశాడని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది తెలియాలంటే నవంబర్ 25న ‘దృశ్యం 2’ చూడాల్సిందే. -
ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్
Venkatesh Drushyam 2 Movie Release Date Confirmed: వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. The truth has begun to unveil itself. But the question is - has it left a permanent scar on Rambabu? Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN ▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH — Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021 -
‘పెద్దన్న’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Old school melodrama of brother sister sentiment didn't work initially with lot of filler scenes but movie picks pace exactly after an hour and gets intense and massy by end of first half #Peddanna #Annaththe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #AnnaattheFDFS — HarveySpector (@PoolaShirt) November 4, 2021 ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా వుంది.. అవుట్ డేటడ్ కామెడీ.. ఓవర్ సెంటిమెంట్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి.. రజిని మార్క్ మాస్ సీన్స్ మాత్రమే హైలెట్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. Just finished FDFS in #melbourne. @directorsiva best till date. It’s a sure shot industry hit. Mark my tweet. #Rajinikanth awesome sir. #Annaatthe — Glitz (@Jesse19100220) November 4, 2021 #Annaatthe first half - Superstar Rajinikanth is in fine form and his sister sentiment with @KeerthyOfficial picks up the momentum only towards the intermission with a twist. The interval bang with a powerful action episode packs a punch. @immancomposer songs are a big plus! — Rajasekar (@sekartweets) November 4, 2021 Basic gaa eedi @rajinikanth divasam yeppudoo chesesaaru..aa Sankarudi valla kona voopiri tho kottukunnaadu Robo nunchi Shivaji varaku..tarvatha aa sankarudu koodaa kaapaadaleka poyyaadu..yendhukuraa Rajini ga distributors ante antha kaksha niku💦💦 #Annaatthe #Peddanna — pSPk (@SimplySukiP) November 4, 2021 Okayish 1st half...Thalaivar pure mass from pre-interval to interval block🔥#Annaatte #Peddanna https://t.co/ehuMGyB9Se — 𝖀𝖕𝖕𝖎 (@__UpendraDhfm) November 4, 2021 One word Review: BLOCKBUSTER #Annaatthe: 🌟🌟🌟🌟 (4/5) 1½ Good in parts,2½ Bang for buck. Tantalizing Post-Interval sequence & climax.#Rajinikanth engages more with his lively emotions than action. Keerthi- Commendable Jaggu bhai- vicious villain role👌@directorsiva 🔥🔥 — Arun Kumar (@Prasannaactor) November 4, 2021 #Peddanna okkati ante okka show kuda fast filling lo ledhu Motham green ye ..oreyy bheemji entha pani chesav ra ayya — Nippu NagaRRRaju (@GopiNagaTeja) November 4, 2021 #Annaatthe First Half Report : “TORTURE UNLIMITED” 👉1950’s Outdated Story 👉Forced Emotions 👉Over-action Scenes & Over-action Comedy 👉ONLY POSITIVE - “MASS INTERVAL FIGHT”#peddanna #Rajini #Rajinikanth #Nayanthara #KeerthySuresh #AnnaattheReview #AnnaattheDeepavali — PaniPuri (@THEPANIPURI) November 4, 2021 #Annaatthe 1st half: #SuperstarRajinikanth's one-man show! @immancomposer songs are a highlight. Story revolves around brother - sister relationship; high on emotional melodrama! Interval block shot - massy & sentimental. — MALAYSIA RJ ARIVU (@MalaysiaRJArivu) November 4, 2021 #Annaatthe - A mashup of Dir Siva's earlier blockbusters with #SuperstarRajinikanth as the Annan who'll go to any lengths to protect his Thangam sister. Heavy sentimental action melodrama with Imman's overpowering score. Valiant #Thalaivar's efforts & evergreen screen presence👍 — Kaushik LM (@LMKMovieManiac) November 4, 2021 Hearing Super Duper Reviews For #Annaatthe Movie.. Congrats And Wishing For Massive BB Hit To Superstar @rajinikanth Sir And Our Dear @directorsiva Sir From THALA AJITH Fans ❤❤#Valimai || #Thala || #AjithKumar pic.twitter.com/RFFefOCuQ5 — EMPEROR AJITH FANS™ (@EmperorAjithFC) November 4, 2021 Trailer Routine Unna Banda Siva Gadu Masssss Audience Ki Min Guarantee Movie Ichi Untadani Anukunnane 😣 Asalu Families Chuse Scope Ivvaleda Kamal ? #Annaatthe #Peddanna https://t.co/m0WAFLk7JC — gupta (@guptanagu8) November 4, 2021 Hyderabad It's #HappyDeepavali morning.. People will be busy. But tickets are still getting booked on #bookmyshow early in the morning#Annaatthe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #Peddanna #PeddannaDeepavali #PeddannaFDFS #AnnaattheFDFS #AnnaattheReview — The Cursed Knight™ (@thecursedknight) November 4, 2021 First Half: Annaatthe is going to be one of the most emotional movies of Thalaivar.. Going to work for B and C like anything.. Siva Hit six in the pitch which works for him🔥🔥🔥🔥#AnnaattheDeepavali #AnnaattheFDFS #Annaatthe #AnnaattheReview#Rajinikanth pic.twitter.com/6dMbt6cIfm — midhun (@midhuntweets4u) November 4, 2021 #Thalaivar and @immancomposer hold the entire movie firmly🙌 Movie is almost similar to Viswasam, Vedalam & Thirupachi.. Will workout big time with family audience and ladies ✌️ 3-4 mass theatre moments for fans🔥 Tamilnadu box office will be on fire🥳#Annaatthe — ரௌடி (@Rowdy_3_) November 4, 2021 -
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నత్తె’ మూవీ స్టిల్స్
-
మీనా కూతురుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైరల్
అందాల నటి మీనా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించారు. 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 16) మీనా తన 45వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మీనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనా కూతురు అచ్చం తల్లి లాగే ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ హీరోగా నటించిన ‘పోలీసోడు’చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత ‘భాస్కర్ ఒరు రాస్కెల్’లో అరవింద్ స్వామితోనూ నటించింది. ఇక మీనా విషయానికొస్తే శివాజీ గణేశన్ నటించిన నెంజన్ గళ్ చిత్రంలో తొలిసారి మీనా తెరపై కనిపించారు. తెలుగులో మీనా మొదటిసారి కనిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన సిరిపురం మొనగాడు. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కూతురుతో హీరోయిన్ మీనా క్యూట్ ఫోటోలు
-
Sakshi Special Edition: ముసి ముసి నవ్వుల.. మీనా
-
‘మంచు’ వారి ఇంట్లో మోహన్‌లాల్ సందడి, ఫోటోలు వైరల్
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబుకు మలయాళ, తమిళ సీనియర్ నటులతో మంచి స్నేహం ఉంది. రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికి మోహన్‌బాబుతో టచ్‌లో ఉంటారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా మోహన్‌బాబుని కలిసి వెళ్తుంటారు. తాజాగా మలయాళీ ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. మంచువారి ఇంట్లో సందడి చేశాడు. మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి. మోహన్‌లాల్ నటిస్తున్న ‘బ్రో డాడీ’మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
బాలయ్య సినిమాలో మీనా.. ప్రత్యేకంగా ఆ సీన్ కోసమేనట
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అఖండలో మాదిరే ఈ సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ హీరోయిన్ మీనా కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో బాలకృష్ణకు జోడీగా మీనా కనిపించనున్నారట. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతోందని సమాచారం. ఇక మెయిన్ హీరోయిన్గా శృతిహాసన్ నటించబోతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. ఇక మీనా విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.