లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది. అయితే, ఈనెల 6 నుంచి 10 వరకు మాత్రమే ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించారు. అయితే, అక్టోబర్ 3 తో ఆయనకు విధించిన గడువు ముగిసింది. అయితే, జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని బెయిల్ కోసం జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
70వ జాతీయ అవార్డ్స్‌లో జానీ మాస్టర్‌కు చోటు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్‌లో తిరుచిట్రంబళం (తిరు) సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment