అలాంటప్పుడు ఈ వేడుకకు నన్నెందుకు పిలిచారు: మీనా | Actress Meena Comments On IIFA Awards 2024 Invitation Over Journalist Request To Speak In Hindi | Sakshi
Sakshi News home page

అలాంటప్పుడు ఈ వేడుకకు నన్నెందుకు ఆహ్వానించారు: మీనా

Published Thu, Oct 3 2024 12:41 PM | Last Updated on Thu, Oct 3 2024 2:52 PM

Actress Meena Comments On IIFA Awards 2024

సీనియర్‌ నటి మీనా సౌత్‌ ఇండియా ప్రేక్షకులతో మంచి అనుబంధమే ఉంది. బాలనటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె స్టార్‌ హీరోయిన్‌గా  గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా అబుదాబిలో జరిగిన ఐఫా-2024 అవార్డ్స్‌ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.  ఆ వేదిక మీద మీనా తమిళ్‌ మాట్లాడుతుండగా తనపై బాషా విభేదం చూపించారు.

ఒకప్పడు స్టార్‌ నటిగా కొనసాగిన మీనా.. ప్రస్తుతం  హీరోయిన్‌ ఓరియంటెండ్‌ సినిమాలో నటిస్తున్నారు.  ఇటీవల జరిగిన ఐఫా చిత్రోత్సవాల్లో  మీనా మాట్లాడుతుండగా..  ఆ సమయంలో ఒక యాంకర్‌ హిందీ భాషలో మాట్లాడమని చెప్పడంతో నటి మీనాకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇది హిందీ వేడుకనా, అయితే తనని ఎందుకు ఆహ్వానించారు..? తాను ఇది దక్షిణాది వేడుక అని భావించానంటూ అసంతప్తి వ్యక్తం చేశారు. 

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా (ఫొటోలు)

దక్షిణాది చిత్రాలు, దక్షిణాది నటీనటులు చాలా ఉత్తమ కళాకారులని, తాను దక్షిణాది నటినని చెప్పుకోవడానికి గర్వపడతానన్నారు. అదేవిధంగా ఐఫా చిత్రోత్సవ వేడుక దక్షిణాదికే కాకుండా భారతీయ కళాకారులను కలుపుతూ ఘనంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఇలా నటి మీనా మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement