చికుబుకు చికుబుకు రైలే | Rajinikanth next schedule in hyderabad | Sakshi
Sakshi News home page

చికుబుకు చికుబుకు రైలే

Published Sun, Feb 16 2020 3:12 AM | Last Updated on Sun, Feb 16 2020 3:12 AM

Rajinikanth next schedule in hyderabad - Sakshi

హైదరాబాద్‌లోని ఓ రైల్వేస్టేషన్‌కు రాబోతున్నారు రజనీకాంత్‌. కానీ ఇది నిజమైన రైల్వేస్టేషన్‌  కాదండోయ్‌. సినిమా కోసం వేసిన సెట్‌ రైల్వేస్టేషన్‌ . రజనీకాంత్‌ హీరోగా శివ ఓ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ట్రైన్‌  బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement