టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి.
నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లు సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment