
ప్రముఖ నట దిగ్గడం శివాజీ గణేశన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌కు చెందిన ఆయన దాదాపు 250కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. తమిళంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన జూలై 21, 2001లో కన్నుమూశారు. శివాజీ గణేశన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ), నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను పొందారు.
ఇటీవల ఆయన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, సీనియర్ నటి మీనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన సినిమాలో నటించిన ఫోటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన వర్ధంతి రోజున శివాజీ గణేశన్‌ను మీనా గుర్తు తెచ్చుకున్నారు. నన్ను భారతీయ సినిమాకి పరిచయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మీతో నటించినందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చింది. తాజాగా మీనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. మీనా చిన్నారిగా ఉన్న సమయంలో శివాజీ గణేశన్‌తో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీనా చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన మీనా సినిమాల్లో నటించింది. ఆ రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.
Comments
Please login to add a commentAdd a comment