sivaji ganesan
-
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రముఖ నట దిగ్గడం శివాజీ గణేశన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌కు చెందిన ఆయన దాదాపు 250కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. తమిళంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన జూలై 21, 2001లో కన్నుమూశారు. శివాజీ గణేశన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ), నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను పొందారు.ఇటీవల ఆయన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, సీనియర్ నటి మీనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన సినిమాలో నటించిన ఫోటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన వర్ధంతి రోజున శివాజీ గణేశన్‌ను మీనా గుర్తు తెచ్చుకున్నారు. నన్ను భారతీయ సినిమాకి పరిచయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మీతో నటించినందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చింది. తాజాగా మీనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. మీనా చిన్నారిగా ఉన్న సమయంలో శివాజీ గణేశన్‌తో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీనా చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన మీనా సినిమాల్లో నటించింది. ఆ రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
సూపర్ హిట్ మూవీ.. శివాజీ గణేశన్‌కు రజినీ కళ్లు చెదిరే గిఫ్ట్!
సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పాదయప్ప'. తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ తండ్రిగా శివాజీ గణేశన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రజినీకాంత్, శివాజీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి చాలా చిత్రాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రమే పాదయప్ప. అయితే ఈ సినిమాకు అప్పట్లో రెమ్యునరేషన్ విషయాకొస్తే కేవలం లక్షల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడైతే కోట్లలోనే చూస్తున్నాం. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) అంతకుముందు సినిమాల వరకు శివాజీ గణేశన్ పారితోషికం రూ.20 లక్షల వరకు తీసుకునేవారట. అయితే పాదయప్ప చిత్రానికి దాదాపు రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. కానీ రజినీకాంత్ శివాజీ గణేశన్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా రెమ్యునరేషన్ వచ్చేలా చేశారట. పాదయప్ప సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్ల పారితోషికం ఇప్పించాడట. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతోంది. అయితే ఆ సమయంలో కోటిన్నర రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువే. శివాజీ గణేశన్ తీసుకున్న అత్యధిక పారితోషికం కూడా అదేనట. అయితే 1999లో ఈ సినిమా రిలీజ్ కాగా.. శివాజీ గణేశన్ 2001లో కన్నుమూశారు. -
ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు టీవీకి ముద్దుపెట్టేవారు: కనిమొళి
దివంగత మహానటుడు శివాజీ గణేషన్ తొలి అభిమాని కలైంజ్ఞర్ కరుణానిధి అని డీఎంకే పార్టీ ఉప కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేర్కొన్నారు. కరుణానిధి శత జయంతి సందర్భంగా డీఎంకే పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ గణేషన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రాన్ని స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కరుణానిధి సంభాషణలు అందించడం గమనార్హం. కాగా ఈ చిత్ర ప్రదర్శనకు కనిమొళి, దయానిధి మారన్, పూచి మురుగన్ మొదలగు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ శివాజీ గణేషన్‌కు తొలి అభిమాని కలైంజ్ఞర్ అని చెప్పవచ్చును. శివాజీ గణేషన్ ఎలా నటిస్తున్నారో చూడు అంటూ ఇంటిలో టీవీ చూస్తూ వెళ్లి అమాంతం టీవీకి ముద్దుపెట్టే వారని చెప్పారు. అలాంటప్పుడు తన తల్లి కూడా పరిహాసం ఆడేవారని అయినా శివాజీ గణేషన్ నటన చూసి కరుణానిధి నిగ్రహించుకునేవారు కాదన్నారు. కథానాయకులకు బహు తెలివిని, మార్గదర్శకాన్ని చూపిన చిత్రం పరాశక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటికీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వారిగానే కథానాయికలు ఉన్నారని, అయితే అప్పటి హీరోయిన్ పాత్రలు ఆలోచింపచేసేవిగానూ, సామాజిక సందేశాన్ని ఇచ్చేవి గానూ ఉండేవని అభిప్రాయపడ్డారు. Kalaignar - Sivaji Ganesan’s #Parasakthi Special screening is happening now at Woodlands Theatre, Chennai. pic.twitter.com/pLJj5Vmcrm — Christopher Kanagaraj (@Chrissuccess) June 4, 2023 చదవండి: మహాభారత్ నటుడు కన్నుమూత -
నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు
ప్రముఖ నటుడు ప్రభు తమని మోసం చేశాడంటూ ఆయన తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండ మోసం చేశారని ఆరోపిస్తూ ప్రభు, ఆయన సోదరుడు రామ్‌కుమార్‌లపై వారిద్దరి సోదరిమణులు శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌లు దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుమారులనే సంగతి తెలిసిందే. వీరితో పాటు ఆయనకు శాంతి, రజ్వీ కూమార్తెలు కూడా ఉన్నారు. అయితే శివాజి గణేశన్ చనిపోయిన 20 ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో ఇది కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తండ్రి మరణం తర్వాత 271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగ పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు తెలియకుండ ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు. అదే విధంగా వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు , రామ్ కుమార్ అపహరించడమే కాకుండా శాంతి థీయేటర్లో ఉన్న రూ. 82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్లు వారు ఆరోపించారు. తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని.. జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్లో వారి పేర్లను పేర్కొన్నారు. చదవండి: తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ -
గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
Sivaji Ganesan Birth Anniversary Google Doodle: భారీ బడ్జెట్లు, హై టెక్నికల్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియన్ సినిమాలు.. ఇవన్నీ ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్లో నిలబెతున్నాయి. వెండితెరపై తమ కటౌట్లతో విదేశీ అభిమానం సైతం సంపాదించుకుంటున్నారు మన నటులు ఇప్పుడు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే కేవలం ‘నటన’ ద్వారా తన స్టార్‌డమ్‌ను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి శివాజీ గణేషన్. ఈరోజు ఆయన 93వ జయంతి (అక్టోబర్ 1, 2021). ► మెథడ్ యాక్టర్‌గా పేరున్న శివాజీ గణేషన్.. తన నటన ద్వారా కమల్ హాసన్, రజినీకాంత్‌లాంటి వాళ్లెందరిపైనో ప్రభావం చూపించిన వ్యక్తి. ► అసలు పేరు గణేస(ష)మూర్తి.. పుట్టింది తమిళనాడు విల్లుపురంలో అక్టోబర్ 1, 1928న. ► ఏడేళ్ల వయసుకే థియేటర్ ఆర్టిస్ట్ అవతారం.. నాటకాల్లో ఆడ పాత్రలతో మంచి గుర్తింపు ► 1945లో శివాజీ కంద హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేసన్ అయ్యింది. ► 1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. ► భావోద్వేగాలు పండించడంలో శివాజీ గణేషన్ దిట్ట. ప్రత్యేకించి కంచు కంఠంతో తమిళ సినిమాలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు ► విశేషం ఏంటంటే.. భారత సినీ రంగం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడు ఈయనే!. ► 1960 ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్(వీరపాండియ కట్టబొమ్మన్కుగానూ) అవార్డును అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ నుంచి అందుకున్నారు. ఈ చిత్ర డైలాగులు నేటికి తమిళ నాట ప్రతిధ్వనిస్తుంటాయి. ► అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు కూడా ఈయనే!. 1962లో కల్చరల్ ఈవెంట్ కోసం శివాజీ గణేషన్ హాజరయ్యారు. అంతేకాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ, శివాజీని కల్చరల్ అంబాసిడర్‌గా గుర్తించారు కూడా. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో భారతీయ నటుడి హోదాల్లో పర్యటించారు శివాజీ గణేషన్. ► 1961లో ‘పాశమలర్’ కుటుంబ సమేత చిత్రంగా ఓ ట్రెండ్ సృష్టించగా.. 1964లో వచ్చిన ‘నవరాత్రి’ తొమ్మిది గెటప్‌లతో సరికొత్త రికార్డు సృష్టించాడు ► దైవ మగన్, పుదియా పరవై ..ఇలా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ► తేవర్ మగన్(క్షత్రియ పుత్రుడు)లో క్యారెక్టర్‌కి నేషనల్ అవార్డు(స్పెషల్ జ్యూరీ) దక్కింది శివాజీ గణేసన్కి. కానీ, ఎందుకనో ఆయన ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. ► 1995లో ఫ్రాన్స్ గౌరవం, 1997లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్. ► తమిళ సీనియర్ నటుడు ప్రభు ఈయన తనయుడే. ఇక మనవడు విక్రమ్ ప్రభు(తెలుగులో వచ్చిన గజరాజు హీరో) కోలీవుడ్‌లో యంగ్ హీరోగా ఉన్నాడు. ► ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ శివాజీ గణేషన్‌ను ‘మార్లోన్ బ్రాండో ఆఫ్ సౌత్ఇండియన్’గా అభివర్ణించింది. ► ఓ స్టార్ హీరో సినిమాలో పాటలు లేకపోవడం జరిగింది కూడా శివాజీ గణేసన్ విషయంలోనే. ఆయన నటించిన ‘అంధ నాల్’లో ఒక్క పాట కూడా ఉండదు. ► పరదేశీ(1953), పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త(అలెగ్జాండర్ పాత్ర), నివురు గప్పిన నిప్పు, బెజవాడ బొబ్బులి, విశ్వనాథ నాయకుడు(నాగమ నాయక పాత్ర), అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాలతోనూ అలరించారు. ► ఆత్మబంధువు లాంటి తమిళ డబ్బింగ్ సినిమా, అందులోని పాటల్ని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఇష్టపడుతుంటారు. ► 1999 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పడయప్ప(నరసింహా) శివాజీ గణేసన్ తెర మీద కనిపించిన చివరి సినిమా. ► శ్వాసకోశ సంబంధిత సమస్యలతో జులై 21, 2001న ఆయన కన్నుమూశారు. ► కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్(ఫ్రాన్స్), దాదా సాహెబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు అందుకున్నారు శివాజీ గణేషన్. ► శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గూగుల్ ఇవాళ డూడుల్‌తో ఆయన్ని గుర్తు చేసింది. ► బెంగళూరుకు చెందిన నూపూర్ రాజేష్ చోక్సీ.. ఈ డూడుల్‌ను క్రియేట్ చేశాడు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
'శివాజి గణేషన్..ఆయన చేయని పాత్రలు లేవు'
చెన్నై: మహానటుడు శివాజీ గణేషన్ తెరపై నటనకంటూ ఒక మైలురాయిని నిర్ణయించి వెళ్లారని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పేర్కొన్నారు. నటనకే అడుగులు నేర్పిన నటుడు శివాజి గణేషన్ తెరపై ఆయన ధరించని పాత్రలు లేవు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక తమిళ భాషలోనే 275 చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా తెలుగు వంటి ఇతర భాషల్లోనూ శివాజీ గణేషన్ అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి దిగ్గజ నటుడు 2001 జులై 21న కళామతల్లిని వదలి వెళ్లిపోయారు. కాగా బుధవారం శివాజీ గణేషన్ 20వ వర్ధంతి సందర్భంగా పలు వురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. శివాజీ గణేషన్ పెద్దకొడుకు రామ్‌కుమార్ ఉదయాన్నే స్థానిక అడయారులో నెలకొల్పిన శివాజీ గణేషన్ స్మారక మండపానికి వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండవకొడుకు నటుడు ప్రభు, మనవడు విక్రమ్ ప్రభు వేరే ఊరులో ఉన్నందున అక్కడే వారు నివాళులర్పించారు. కాగా నటుడు కమలహాసన్ శివాజిగణేషన్కు నివాళులు అర్పించారు. -
‘తప్పుగా చిత్రీకరిస్తే తలలు నరుకుతాం!’
పెరంబూరు: హీరో ధనుష్‌కు హత్యాబెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కర్ణన్ అనే చిత్రంలో ధనుష్ నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌పై ఇప్పటికే నడిగర్ తిలగం శివాజీ గణేశన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదులు, హత్యాబెదిరింపులు వస్తున్నాయి. కర్ణన్ చిత్రం 1999లో జరిగిన కొడియాంగుళం మణియాచ్చి జాతి ఘర్ణణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథా చిత్రం అని తిరునెల్వెల్లి, తూత్తుక్కుడి ప్రాంతాల్లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను వెంటనే నిలిపివేయాలంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. అదే విధంగా ఈ చిత్రంలో పోలీస్‌స్టేషన్‌కు మణియాచ్చి అని పేరు పెట్టినట్లు సమాచారం. ఆ పోలీస్‌స్టేషన్‌ను నటుడు ధనుష్ ధ్వంసం చేసే సన్నివేశం ఉందని, ఇలాంటి చిత్రాలను రూపొందించరాదనీ, ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ నటుడు కరుణాస్ సామాజిక వర్గానికి చెందిన పులిప్పడై సంఘం రాష్ట్ర కార్యదర్శి, నెల్లై నగర కార్యదర్శి భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం గురించి తప్పుగా చిత్రీకరిస్తే తలలు నరుకుతామని సివలపేరి సమీపంలోని మరుకాల్ తలై ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఓ వీడియోను రూపొందించి ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్లపై హత్యాబెదిరింపులకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: ‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్ నా విడాకులకు అతడు కారణం కాదు -
వివేక్‌పై అభిమానుల ఆగ్రహం
చెన్నై,పెరంబూరు: సీనియర్ హాస్యనటుడు వివేక్‌పై శివాజీగణేశన్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే విజయ్ నటించిన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నాయకులు తీవ్రంగా ఖండించడంతో పాటు, నటుడు విజయ్‌పై ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే వేదికపై నటుడు వివేక్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఇరుకున పడేశాయి. 1980లో శివాజీగణేశ్, వైజయంతిమాల జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటను అపహాస్యం చేసే విధంగా వివేక్ చేసిన వ్యాఖ్యలకు శివాజీగణేశన్ సమూగ నల పేర్వై సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై ఆ సమాఖ్య అధ్యక్షుడు చంద్రశేఖరన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు వేదికనెక్కే ఛాన్స్ రాగానే అక్కడ చేరిన ప్రజలను చూసి ఏదేదో మాట్లాడతారన్నారు. అందుకు నటుడు వివేక్ అతీతం కాదన్నారు. ఆయన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై దివంగత మహానటుడు శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడిఇరుక్కుం అనే పాటను పరిహాసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ నటుడినైనా పొగుడుకోవచ్చని, ఏ సంగీత దర్శకుడినైనా ప్రశంసించుకోవచ్చని, అయితే ఒకరి ప్రాపకం కోసమే ఎంతో ప్రజాదరణ పొందిన పాటను పరిహసించడం వివేక్‌కు తగదని అన్నారు. నటుడు వివేక్ ఇంతకు ముందు కూడా పరాశక్తి చిత్రంలో శివాజీగణేశన్ న్యాయస్థానంలో చెప్పే సంభాషణలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారని అన్నారు. ఇక ముందు కూడా వివేక్ ఇలానే ప్రవర్తిస్తే అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వివేక్ వివరణ: కాగా శివాజీగణేశన్ అభిమానుల ఆగ్రహానికి స్పందింవిన నటుడు వివేక్ 1980లో శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటలో ప్రేమ భావం కలుగుతుందనీ, నటుడు విజయ్ చెప్పిన దానిలో మంత్రశక్తిలా అనిపిస్తోందని తాను చెప్పానరి, అభిమానులు, మనసు కలిగిన వారు అర్థం చేసుకోవాలని నటుడు వివేక్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'సారీ.. నేను రాలేను.. పన్నీర్ వస్తారు'
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీస్వామి చెప్పారు. తన బదులు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వస్తారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తన తండ్రి విగ్రహ ప్రారంభానికి రాకుండా తనను అవమానించారని నటుడు ప్రభు ఇటీవల రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కే రాజుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం నేరుగా ప్రభుకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. తాను రాలేకపోవడానికి కారణాలు వివరించారు. 'గణేశన్ మెమోరియల్‌ను స్వయంగా ప్రారంభించాలని నాకు ఆశగా ఉంది. అయినప్పటికీ ముందుకు ఖరారు అయిన కొన్ని కార్యక్రమాల కారణంగా నేను ఆరోజు అందుబాటులో ఉండటం లేదు. అందుకే, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రారంభోత్సవానికి వస్తారు' అని పళనీ స్వామి చెప్పారు. అక్టోబర్ 1 శివాజీ గణేశన్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. గతంలో ఆయన విగ్రహం చెన్నైలోని కామరాజర్ సాలయ్ వద్ద ఉండేది. అయితే, ప్రజల సౌకర్యం రీత్యా వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో తిరిగి రూ.2.80కోట్ల వ్యయంతో ఆద్యార్ ప్రాంతంలో పూర్తిగా ద్రవిడియన్ పద్థతిలో నిర్మించారు. -
శివాజీగణేశన్ అభిమానులకు శుభవార్త
సాక్షి, పెరంబూరు: శివాజీగణేశన్ స్మారక మండపాన్ని అక్టోబర్ ఒకటిన ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. శివాజీగణేశన్ భౌతికంగా లేకపోయినా, సినీ జగం ఉన్నంత కాలం అందులో ఆయన జీవించే ఉంటారు. శివాజీగణేశన్ స్మారక మండపం నెలకొల్పాలన్నది ఆయన అభిమానుల చిరకాల కోరిక. అలాంటి మండపాన్ని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్మించాలని భావించినా, అది జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం శివాజీగణేశన్ కు స్మారక మండపం కట్టించడానికి ముందుకొచ్చింది. స్థానిక అడయారులోని సత్యా స్టూడియో ఎదురుగా 2.80 కోట్లతో గత ఏడారి డిసెంబరులో మండపం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మేలో సర్వాంగసుందరంగా స్మారకమండపం పూర్తయ్యింది. స్థానిక మెరీనా తీరంలో శివాజీగణేశన్ శిలావిగ్రహాన్ని తొలగించి అడయారులోని స్మారకమండపంలో ఏర్పాటు చేశారు. మండపం ప్రారంభం కోసం శివాజీగణేశన్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. వారికి శుభవార్త ఏమిటంటే శివాజీగణేశన్ 90వ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు ఒకటవ తేదీన ఆయన స్మారక మండపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మండపాన్ని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించనున్నారు. -
జాగ్రత్త... ఆయనకు పట్టిన గతే పడుతుంది
సాక్షి, చెన్నై : నూతన రాజకీయ పార్టీతో త్వరలో తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సీనియర్ నటుడు కమల్ హాసన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఆయన ప్రభుత్వంపై ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా డెంగ్యూ నివారణలో ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు చేయగా, ప్రభుత్వం నుంచి గట్టి కౌంటరే కమల్‌కు పడింది. కేవలం అధికారం కోసమే కమల్ తహ తహలాడుతూ కలలు కంటున్నాడని రాష్ట్ర మంత్రి డీ జయకుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కమల్ వైఖరిని ఎండగట్టారు. ‘రాజకీయాలంటే 100 రోజులు ఆడే సినిమా అని ఆయన (కమల్) అనుకుంటున్నాడేమో. ముఖ్యమంత్రి పదవి అంటే మార్కెట్లో దొరికే బొమ్మ కాదు. ప్రజలు గుర్తించి, వాళ్లు అంగీకరిస్తేనే అధికారం, పదవులు దక్కుతాయి. ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే కాదు’ అని జయకుమార్ అన్నారు. గతంలో ఇలాగే అభిమానులు ఉన్నారు కదా అన్న భరోసాతో నటుడు శివాజీ గణేశన్ రాజకీయాల్లోకి వచ్చి ఘోరంగా దెబ్బతిన్నారని, తొందరపడితే కమల్‌కి కూడా అదే గతి పడుతుందని జయకుమార్ చెప్పారు. నటులు మీటింగ్‌లు పెడితే అభిమానులు లక్షల్లో వస్తారేమో. కానీ, అంతా ఓట్లు వేస్తారన్న గ్యారెంటీ లేదు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల్లోకి వెళ్లాలిగానీ, సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం కాదు. ముందు కమల్‌ను పిట్ట కూతలు ఆపి, రాజకీయ పార్టీని స్థాపించమనండి అని జయకుమార్ చురకలంటించారు. శివాజీ ఫెయిల్యూర్ స్టోరీ... ఎంజీఆర్ సమకాలీకుడు అయిన శివాజీ గణేశన్ 1955 లో డీఎంకేకు మద్ధతుదారుడిగా ఉండేవారు. తర్వాత కొంతకాలానికి కామ్రాజ్ విజ్ఞప్తి మేరకు తర్వాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తర్వాత కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ అనంతరం ఆయన రాజకీయాలకు దూరంకాగా, తిరిగి 1987లో తమిజగ మున్నేట్ర మున్నాని పేరిట కొత్త పార్టీని స్థాపించి రీఎంట్రీ ఇచ్చారు. రెండేళ్లకే పార్టీని జనతాదళ్ పార్టీలో విలీనం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. హీరోగా అశేష అభిమానం సంపాదించుకున్న ఆయన నేతగా మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. -
శివాజీగణేశన్ భారతరత్నకు అర్హుడు కాదా?
సాక్షి, తమిళసినిమా: మహా నటుడు శివాజీగణేశన్‌కు ఇప్పటి వరకూ భారతరత్నను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటీ. అందుకు ఆయన అర్హుడు కాదా? అంటూ ప్రశ్నించారు గాంధీ మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్. ఈయన రాసిన తిరైయుళగిన్ తవప్పుదల్వన్, రామాయణ రహస్యం పుస్తకాల పరిచయ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక టీ. నగర్‌లోని సర్ పీటీ త్యాగరాయర్ ఆవరణలో జరిగింది. తమిళరువి మణియన్ మాట్లాడుతూ శివాజీగణేశన్ నటించిన చిత్రాలు కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించాయని పేర్కొన్నారు. సినిమాలనే అసహ్యించుకునే పెరియార్ తమిళభూమి నుంచి వాటిని పారద్రోలారని అనే వారన్నారు. అలాంటి పెరియార్ శివాజీగణేశన్ నటనను అభినందించారని తెలిపారు. అదే విధంగా శివాజీగణేశన్ నటించిన మృదంగ చక్రవర్తి చిత్రం చూసి నటుడంటే శివాజీనే అని సహనటుడు ఎంజీఆర్ అభినందించారని గుర్తు చేశారు. తన చిత్రాల ద్వారా దేశ కీర్తిని చాటిన నటుడు శివాజీగణేశన్ అని పేర్కొన్నారు. తన అందమైన వాచకంతో తమిళ భాష గొప్పతనాన్ని తెలిపిన మహా నటుడు శివాజీగణేశన్ అని కీర్తించారు. అలాంటి మహా నటుడికి భారతరత్న అవార్డు ఇంకా అందించక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. శివాజీగణేశన్‌ను కేంద్రప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. ఎంఎస్ .సుబ్బలక్ష్మి, లతామంగేష్కర్, బిస్మిల్లాఖాన్, రవిశంకర్, సత్యజిత్‌రే, సచిన్టెండూల్కర్ వంటి వారిని కేంద్రప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిందని, శివాజీగణేశన్ ఎందులో తక్కువని ప్రశ్నించారు. శివాజీగణేశన్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆ కుటుంబం అభిమానానికి దాసోహం..
- ఘనంగా శివాజీ, కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ నగరి: అభిమానానికి శివాజీ కుటుంబం ఎప్పుడూ దాసోహమేనని నటుడు శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు అన్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ పరిధి సత్రవాడలో శివాజీ గణేశన్ అభిమాని దివంగత మునియప్పన్ జ్ఞాపకార్థం నిర్మించిన దివంగత శివాజీ గణేశన్ విగ్రహం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి పెదనాన్న రామ్‌కుమార్‌తో పాటు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1998లో తన తాత కామరాజనాడార్ విగ్రహావిష్కరణకు విచ్చేశాడు. నేడు ఆయన విగ్రహావిష్కరణకు తాను విచ్చేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తోందన్నారు. నటనకు హద్దులు లేవని తన తాత శివాజీ గణేశన్ నిరూపించారని అన్నారు. అందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఓ పండుగలా చేయడమే నిదర్శనమని అన్నారు. తన తాత, తండ్రి బాటలోనే తాను కూడా ప్రజల అభిమానాన్ని పొందడానికి కృషి చేస్తున్నాను. రామ్‌కుమార్ మాట్లాడుతూ.. కామరాజనాడార్ తన తండ్రికి ఆదర్శమన్నారు. నేడు వారి ఇద్దరి విగ్రహాలు ఒకేచోట ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను శివాజీ గణేశన్ అభిమానినని, రాజకీయంగా తనకు మార్గం చూపింది ఆ కుటుంబమే అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ వీఎస్.భానుమూర్తి, భారతదేశ శివాజీ సంఘం నిర్వాహకులు మరుదుమోహన్, చంద్రశేఖర్, జయపెరుమాళ్, స్థానిక నాయకులు వరదప్ప మొదలియార్, రామచంద్రన్, ఏకనాథన్, దేవన్, ఏకాంబరం, శ్రీనివాసన్, ఇలంగో, రాజా, కుమార్, నటరాజన్, వినాయకం, జయరామన్, కృష్ణన్, సీఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తీర్థయాత్రలా అనిపించింది!
‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్‌కి దక్షిణాదిలో ఉన్న ఆప్తుల్లో మహానటుడు స్వర్గీయ శివాజీ గణేశన్ ఒకరు. శివాజీ తనయుడు ప్రభుతో బిగ్ బి ఎంతో ఆత్మీయంగా ఉంటారు. ఇటీవల ఆయన చెన్నై వెళ్లినప్పుడు, ప్రభు మంచి విందు ఏర్పాటు చేశారట. చెన్నైలోని టీ నగర్లో ఉన్న ప్రభు ఇంటికి అమితాబ్ లంచ్ చేయడానికి వెళ్లినప్పుడు జనం గుమిగూడారట. ఉత్తరాది తారలను దక్షిణాది వారు గుర్తుపట్టరేమోననే తన సందేహం పటాపంచలైందని అమితాబ్ పేర్కొన్నారు. అలాగే, మహానటుడు శివాజీ ఇంటికి వెళ్లడం ఓ తీర్థయాత్రలా అనిపించిందని అమితాబ్ అనడం విశేషం. -
‘దొంగాట’ ఆడియో ఆవిష్కరణ
-
మా అమ్మాయి పాట వింటే...ఎల్లారీశ్వరి గుర్తొచ్చింది!
‘‘సినిమా నిర్మాణం అంత సులువు కాదని మహానటుడు శివాజీ గణేశన్ నాతో అనేవారు. ‘నటుడిగా సంపాదించిన డబ్బు జాగ్రత్త చేసుకో! చేతులు కాలితే ఎవరూ సహాయం చేయరు’ అనేవారాయన. నిర్మాణం అంత సులువు కాదని నాకు తెలుసు. కానీ, సినిమాలు నిర్మించాను. అయితే, నా బిడ్డ లక్ష్మి నిర్మాతగా చేస్తానంటే ప్రోత్సహించలేదు. అయినా చేసింది. ఈ చిత్రం రషెస్ చూశాను. అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నటుడు మోహన్‌బాబు అన్నారు. విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’. అడివి శేష్, మధు నందన్ ముఖ్య పాత్రలు చేశారు. రఘు కుంచె, సాయి కార్తీక్, సత్య మహావీర్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాటల సీడీని మోహన్‌బాబు ఆవిష్కరించారు. మోహన్‌బాబు ప్రసంగిస్తూ, ‘‘రామారావుగారు, నాగేశ్వరరావు, దాసరి గార్ల నుంచి ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఇప్పటి తరంలో క్రమశిక్షణ లేదు. ఎవరో కొందరు మాత్రం క్రమశిక్షణగా ఉంటున్నారు. ఆ సంగతలా ఉంచితే, లక్ష్మిని చక్కగా చదువుకుని, గృహిణిగా స్థిరపడమని చెప్పాను. ఆమె బాగా చదువుకుంది. కానీ, సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఓ తండ్రిగా తనకు మంచి చిత్రాలు తీయమని చెప్పాను. మంచి సినిమాలు చేస్తోంది. వాస్తవానికి మా లక్ష్మి మంచి గాయని అయితే బాగుంటుందనుకున్నాను. ఎస్పీ బాలు, జేసుదాసు వంటి గాయకుల దగ్గర నా కోరిక చెబితే, ‘పాటలెందుకు? చక్కగా చదువుకొమ్మ’న్నారు. మద్రాసులో ఓ విద్వాంసుడు దగ్గర చేర్పిస్తే, పాటలు వదిలేసి, వంటలు నేర్చుకుంది. మొత్తం మీద గాయని కాలేదు. ఇప్పుడు ఈ చిత్రంలో తను పాడిన పాట విని, నమ్మలేకపోయాను. చాలా బాగా పాడింది. ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఎల్.ఆర్. ఈశ్వరి గొంతును గుర్తు చేసింది. నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఏ ఆర్టిస్ట్ ప్రతిభ అయినా బయటికొచ్చేది ప్రతినాయకుడిగా చేసినప్పుడే! భారతదేశంలో ప్రతినాయకుడిగా నేను ప్రదర్శించినన్ని హావభావాలు వేరే ఏ నటుడూ ప్రదర్శించలేదు’’ అన్నారు. లక్ష్మి మాట్లాడుతూ- ‘‘నేను సింగర్ కావాలని నాన్న చాలా తపన పడ్డారు. నేనేం చేసినా మా నాన్నగారు గర్వపడేలా చేయాలనుకుంటాను. ఈ పాట మా నాన్నను గర్వపడేలా చేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న కథానాయిక తమన్నా, మంచు కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘హీరోయిన్గా నేను పరిచయమైంది మోహన్‌బాబు గారి బ్యానర్లోనే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం - ఈ కుటుం బమే. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ నా తొలి చిత్రం ‘శ్రీ’ నాటి నుంచి తెలుసు’’ అన్నారు. కె. రాఘవేంద్రరావు, విష్ణు, మనోజ్, సుమంత్, మధుశాలిని, దేవి, నిర్మల, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివాజీ’ విగ్రహాన్ని తొలగించండి
సాక్షి, చెన్నై:తమిళ సినీలోకానికి ఎంజీయార్, నడిగర్ తిలగం శివాజీ గణేశన్ రెండు కళ్లు లాంటి వారు. వీరు ఇప్పుడు మన మధ్య లేరు. అయితే, వారి జ్ఞాపకాలు వెండి తెర వెలుగుల రూపంలో దర్శనం ఇస్తున్నాయి. వీరిని గౌరవిస్తూ ప్రభుత్వాలు ముందుకె ళుతున్నాయి. ఆ దిశగా తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అత్యంత జన సంచారంతో నిండిన ప్రదేశం మెరీనా తీరంలో నడిగర్ తిలగంకు 2006లో డీఎంకే ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ తీరంలోని కామరాజర్ రోడ్డులో నడిగర్ తిలగం నట ఖ్యాతిని, అభిమానాన్ని, గౌరవాన్ని చాటే విధంగా గాంభీర్యంగా ఈ విగ్రహం దర్శనం ఇస్తుంటుంది. అయితే, ఈ విగ్రహం మరి కొద్ది రోజుల్లో అక్కడి నుంచి కదలబోతున్నది. ఇందుకు కారణం ఆ విగ్రహానికి వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్. వ్యతిరేకత: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం, అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో వార్తల్లోకి ఎక్కింది. నిలువెత్తు విగ్రహం కారణంగా ఆ మార్గంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న ఓ వ్యక్తి పిటిషన్ వివాదానికి దారి తీసింది. ఈ పిటిషన్‌కు వ్యతిరేకత బయలు దేరింది. విగ్రహాన్ని తొలగించొద్దంటూ సినీ ప్రముఖులు కమిషనరేట్‌ను ఆశ్రయించారు. చివరకు బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టే రీతిలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, న్యాయమూర్తి సత్యనారాయణన్ నేతృత్వంలోని బెంచ్ వ్యవహరించింది. పోలీసులను వివరణ కోరగా, ఆ విగ్రహానికి వ్యతిరేకంగానే రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేనని, ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ బెంచ్‌కు పోలీసులు చేసుకున్న విన్నపం వివాదానికి మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది. అరుుతే ఈ పిటిషన్‌ను తాము విచారించబోమంటూ ఆ బెంచ్ చేతులు ఎత్తేసింది. అదే సమయంలో విగ్రహం తొలగింపునకు జరుగుతున్న కుట్రలపై రాజకీయ పక్షాలు కదిలాయి. తమ గళాన్ని గట్టిగా వినిపించాయి. ఆ విగ్రహాన్ని తొలగించొద్దంటూ డిమాండ్ చేశాయి. అయితే, ఫలితం శూన్యం. తొలగించాల్సిందే: చివరకు శివాజీ విగ్రహం వ్యవహారానికి సంబంధించిన పిటిషన్ల విచారణలన్నీ న్యాయమూర్తి అగ్ని హోత్రి, కేకే శశిధర్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు చేరాయి. విచారణను ముగించిన ఈ బెంచ్ గురువారం తీర్పును వెలువరించింది. విగ్రహం అదే చోట ఉంచుతారా..? లేదా తొలగిస్తారా..? అన్న ఉత్కంఠతో శివాజీ అభిమానులు ఎదురు చూశారు. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పు నిరాశలో ముంచింది. ఆ విగ్రహాన్ని తొలగించాలని, ఇందుకు తగ్గ చర్యలు తీసుకోవచ్చని ఆ బెంచ్ ఆదేశించింది. ఈ విగ్రహం వ్యవహారంపై తాము పలు కోణాల్లో పరిశీలనలు జరిపినట్టు వివరించింది. పోలీసుల వాదనలు విన్నాం, నివేదికలు పరిశీలించామని పేర్కొన్నారు. ఈ విగ్రహం కారణంగా ఆ మార్గంలో ప్రమాదాలు జరుగుతున్నట్టు స్పష్టం కావడంతో ఇక, అక్కడి నుంచి మరో చోటకు మార్చుకోవచ్చంటూ బెంచ్ ఇచ్చిన తీర్పు శివాజీ అభిమానులను డైలమాలో పడేసింది.ఎంజీయార్ విగ్రహానికి అవమానం: తమ అభిమాన కథానాయకుడి విగ్రహాన్ని తొలగిస్తారా..? అంటూ ఏకంగా తిరునల్వేలిలో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీయార్ విగ్రహానికి అవమాన పరిచే రీతిలో చెప్పుల మాల వేశారు. దీనికి కారణమైన శివాజీ అభిమాని ముత్తుకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పలు చోట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా, అప్పీలుకు వెళ్లేందుకు కసరత్తుల్లో ఉన్నారు. ఇక, కోర్టు తీర్పుతో ఆ విగ్రహాన్ని ఆగమేఘాలపై మరో చోటకు మార్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.