దయానిధి మారన్, ప్రభు, కనిమొళి
దివంగత మహానటుడు శివాజీ గణేషన్ తొలి అభిమాని కలైంజ్ఞర్ కరుణానిధి అని డీఎంకే పార్టీ ఉప కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేర్కొన్నారు. కరుణానిధి శత జయంతి సందర్భంగా డీఎంకే పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ గణేషన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రాన్ని స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కరుణానిధి సంభాషణలు అందించడం గమనార్హం.
కాగా ఈ చిత్ర ప్రదర్శనకు కనిమొళి, దయానిధి మారన్, పూచి మురుగన్ మొదలగు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ శివాజీ గణేషన్‌కు తొలి అభిమాని కలైంజ్ఞర్ అని చెప్పవచ్చును. శివాజీ గణేషన్ ఎలా నటిస్తున్నారో చూడు అంటూ ఇంటిలో టీవీ చూస్తూ వెళ్లి అమాంతం టీవీకి ముద్దుపెట్టే వారని చెప్పారు.
అలాంటప్పుడు తన తల్లి కూడా పరిహాసం ఆడేవారని అయినా శివాజీ గణేషన్ నటన చూసి కరుణానిధి నిగ్రహించుకునేవారు కాదన్నారు. కథానాయకులకు బహు తెలివిని, మార్గదర్శకాన్ని చూపిన చిత్రం పరాశక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటికీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వారిగానే కథానాయికలు ఉన్నారని, అయితే అప్పటి హీరోయిన్ పాత్రలు ఆలోచింపచేసేవిగానూ, సామాజిక సందేశాన్ని ఇచ్చేవి గానూ ఉండేవని అభిప్రాయపడ్డారు.
Kalaignar - Sivaji Ganesan’s #Parasakthi Special screening is happening now at Woodlands Theatre, Chennai. pic.twitter.com/pLJj5Vmcrm
— Christopher Kanagaraj (@Chrissuccess) June 4, 2023
చదవండి: మహాభారత్ నటుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment