పెరంబూరు: హీరో ధనుష్‌కు హత్యాబెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కర్ణన్ అనే చిత్రంలో ధనుష్ నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌పై ఇప్పటికే నడిగర్ తిలగం శివాజీ గణేశన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదులు, హత్యాబెదిరింపులు వస్తున్నాయి. కర్ణన్ చిత్రం 1999లో జరిగిన కొడియాంగుళం మణియాచ్చి జాతి ఘర్ణణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథా చిత్రం అని తిరునెల్వెల్లి, తూత్తుక్కుడి ప్రాంతాల్లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను వెంటనే నిలిపివేయాలంటూ ఫిర్యాదులు వస్తున్నాయి.
అదే విధంగా ఈ చిత్రంలో పోలీస్‌స్టేషన్‌కు మణియాచ్చి అని పేరు పెట్టినట్లు సమాచారం. ఆ పోలీస్‌స్టేషన్‌ను నటుడు ధనుష్ ధ్వంసం చేసే సన్నివేశం ఉందని, ఇలాంటి చిత్రాలను రూపొందించరాదనీ, ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ నటుడు కరుణాస్ సామాజిక వర్గానికి చెందిన పులిప్పడై సంఘం రాష్ట్ర కార్యదర్శి, నెల్‌లై నగర కార్యదర్శి భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం గురించి తప్పుగా చిత్రీకరిస్తే తలలు నరుకుతామని సివలపేరి సమీపంలోని మరుకాల్ తలై ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఓ వీడియోను రూపొందించి ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్‌లపై హత్యాబెదిరింపులకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
చదవండి:
‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్
నా విడాకులకు అతడు కారణం కాదు
Comments
Please login to add a commentAdd a comment