Kalaipuli s thanu
-
విభేదాలు సరే.. వ్యక్తిగత దూషణలెందుకు?: కమల్ హాసన్
సినీ పితామహుడుగా పేరు గాంచిన సినీ పంపిణీదారుడు డి.రామానుజన్ శత జయంతి వేడుకను మంగళవారం సాయంత్రం చెన్నై లోని ఏవీఎం రాజేశ్వరి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఆయన కృషి మరువలేనిదిఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. డి.రామానుజన్తో, ఆయన కుటుంబంతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఆధునికతకు పెద్దపీట వేసిన ఆయన తమిళ సినిమా ఉన్నతికి అవసరం అయిన వాటిని సమకూర్చారన్నారు. అలాంటి వ్యక్తికి శతజయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం అని ప్రశంసించారు. వ్యక్తిగత దూషణలెందుకు?ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విభేదాలు ఎక్కువ అవుతున్నాయని, దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. విభేదాలు కలగడం సహజమేనని, అయితే వాటిని వ్యక్తిగత దూషణల వరకు తీసుకువెళ్లరాదన్నారు. అప్పట్లో తనకు డి రామానుజన్‌కు మధ్య కూడా చిన్న వివాదం తలెత్తిందని, కానీ దాన్ని తాము తీవ్రంగా తీసుకోలేదని చెప్పారు. సమైక్యతా భావం ముఖ్యంఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అయితే సమైక్యతా భావం చాలా ముఖ్యమని కమల్ హాసన్ పేర్కొన్నారు. డి.రామానుజన్ శత జయంతి వేడుకలను నిర్మాత కలైపులి ఎస్.థాను చక్కగా నిర్వహించారని ప్రశంసిస్తూ ఈ సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పన్నీర్ సెల్వన్, దర్శకుడు నటుడు కె.భాగ్యరాజ్, నిర్మాత కేఆర్ వీసీ గుహనాథన్, ఆర్వీ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు హీరోలతో సైకో థ్రిల్లర్ మూవీ 'వైట్ రోస్'
నటుడు, నిర్మాత ఆర్.కె సురేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వైట్ రోస్. మరో కథానాయకుడిగా ఎస్.రుసో నటిస్తున్న ఇందులో కయల్ ఆనంది ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు మాజీ పోలీస్ అధికారి జాంగిట్ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. రాజశేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్కే సురేష్ స్టూడియో 9 సంస్థ, ఎస్.రుసోతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత కలైపులి ఎస్. థాను, నటుడు ఆది తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆస్పత్రిల్లో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సైకో థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి ఎన్.ఎస్.ఉదయకమార్ ఛాయాగ్రహణం, జోహన్ శివనేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి 👇 నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన ‘బిందు మాధవి అలా అనడంతో పెళ్లి గురించి ఆలోచించడం మానేశా’ -
దర్శకుడికి జాక్‌పాట్, స్టేజీపైనే రూ.10 లక్షల అడ్వాన్స్ చెక్!
సెల్ఫీ దర్శకుడు జాక్‌పాట్ కొట్టారు. జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటించిసంగీతాన్ని అందించిన చిత్రం సెల్ఫీ. వర్ష బొల్లమ్మ కథానాయికగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతినాయకుడిగా ఇందులో నటించారు. కలైపులి ఎస్.థాను సమర్పణలో మాదిమారన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీజీ ఫిలిం కంపెనీ పతాకంపై శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 1న విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఈ విజయాన్ని చిత్రయూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో పంచుకున్నారు. సెల్ఫీ చిత్రానికి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, భారీ ఎత్తున విడుదల చేసిన కలైపులి.ఎస్ థానుకు నిర్మాత శబరీష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా దర్శకుడు మదిమారన్ తన సంస్థలో మరో చిత్రం చేయడానికి ఇదే వేదికపై అడ్వాన్స్‌గా రూ.10 లక్షల చెక్కును థాను అందించడం గమనార్హం. చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్ -
సీఎం ఫండ్‌కు నిర్మాత రూ.10 లక్షల విరాళం
ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను కరోనా నివారణ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. బుధవారం ఉదయం ఆయన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలసి చెక్కు అందించారు. తన వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు కలైపులి చెప్పారు. చెక్‌తో పాటు సీఎంను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని జోడించారు. కరోనా కాలంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారని, వేగవంతమైన చర్యలు, వివేకమంతమైన నిర్ణయాలు, అవిశ్రాంతి కార్యాచరణలు దేశాన్ని తిరిగి చూసేలా చేస్తున్నాయని కొనియాడారు. చదవండి: నిర్మాత హత్యకు కుట్ర! రౌడీ షీటర్ అరెస్ట్ లాక్డౌన్ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే.. -
సూర్యకు జోడీగా...
‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్లో 40వ సినిమా. కలైపులి యస్ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. అందులో పల్లెటూరి రైతు పాత్ర ఒకటని సమాచారం. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఆండ్రియా నటిస్తారట. వెట్రిమారన్ తీసిన ‘వడ చెన్నై’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. ‘వాడివాసల్’లో సూర్య, ఆండ్రియా పాత్రలు పోటాపోటీగా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అవుతుంది. -
‘తప్పుగా చిత్రీకరిస్తే తలలు నరుకుతాం!’
పెరంబూరు: హీరో ధనుష్‌కు హత్యాబెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కర్ణన్ అనే చిత్రంలో ధనుష్ నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌పై ఇప్పటికే నడిగర్ తిలగం శివాజీ గణేశన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదులు, హత్యాబెదిరింపులు వస్తున్నాయి. కర్ణన్ చిత్రం 1999లో జరిగిన కొడియాంగుళం మణియాచ్చి జాతి ఘర్ణణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథా చిత్రం అని తిరునెల్వెల్లి, తూత్తుక్కుడి ప్రాంతాల్లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను వెంటనే నిలిపివేయాలంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. అదే విధంగా ఈ చిత్రంలో పోలీస్‌స్టేషన్‌కు మణియాచ్చి అని పేరు పెట్టినట్లు సమాచారం. ఆ పోలీస్‌స్టేషన్‌ను నటుడు ధనుష్ ధ్వంసం చేసే సన్నివేశం ఉందని, ఇలాంటి చిత్రాలను రూపొందించరాదనీ, ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ నటుడు కరుణాస్ సామాజిక వర్గానికి చెందిన పులిప్పడై సంఘం రాష్ట్ర కార్యదర్శి, నెల్లై నగర కార్యదర్శి భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం గురించి తప్పుగా చిత్రీకరిస్తే తలలు నరుకుతామని సివలపేరి సమీపంలోని మరుకాల్ తలై ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఓ వీడియోను రూపొందించి ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్లపై హత్యాబెదిరింపులకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: ‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్ నా విడాకులకు అతడు కారణం కాదు -
‘హిప్పీ’ షూటింగ్ మొదలైంది
-
‘హిప్పీ’ షూటింగ్ మొదలైంది..!
Rx 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ , దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టీఎన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం హిప్పీ. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు . ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘RX 100 సినిమా తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. ఆ తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ ఈ సినిమా కథ చెప్పారు. కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఆ తర్వాత నిర్మాత కలైపులి థాను ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. దాంతో మరింత ఉత్సాహం కలిగింది. కలైపులి థాను దక్షిణాదిలో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ తెలుసు. కబాలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత, బ్యానర్లో నటించడం, అలాంటి ప్రొడ్యూసర్‌తో నా కెరీర్ ఆరంభంలో రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్‌ని టాప్ లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు. దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా నాకు తెలుగులో తొలి స్ట్రయిట్ చిత్రం హిప్పీ. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ చూశాను. నాకు బాగా నచ్చింది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం చాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రస్టింగ్ ఎంటర్టైనర్ ఇది . తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. ‘హిప్పీ సినిమా కథ తెలుగు వారందరికీ నచ్చుతుంది. ఆర్ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత కార్తికేయ ఈ సినిమాకు యాప్ట్ అనిపించింది. కార్తికేయ కథ వినగానే ఓకే అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. -
‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ హీరోగా ‘హిప్పీ’
సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఈ యంగ్ హీరోతో కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి యస్.థాను సినిమా చేస్తున్నారు. తుపాకి, కబాలి, వేలై ఇల్లా పట్టదారి2, స్కెచ్ లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రస్తుతం థాను కార్తికేయ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘హిప్పీ’ అనే టైటిల్ ఫైనల్ చేశారు. రేపు (శుక్రవారం) కార్తికేయ పుట్టినరోజు జరుపుకోనుండటంతో ఒక రోజు ముందుగానే ‘హిప్పీ’ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శ కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ ‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. కార్తికేయ తన తొలి చిత్రానికి భిన్నంగా కనిపిస్తారు. ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేయాల్సి ఉంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే సినిమా. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ఉంటుంద’ని తెలిపారు. నిర్మాత కలైపులి యస్.థాను మాట్లాడుతూ ‘తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గ హీరో అనిపించింది. ఆయనతో ‘హిప్పీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఎక్కడా బడ్జెట్‌కు వెనకాడకుండా భారీగా రూపొందిస్తాం’ అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘ఆర్ఎక్స్ 100 తర్వాత ఓ పెద్ద సంస్థలో అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బావుంది. నిత్యం మన జీవితంలో జరిగే అంశాలను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది’ అని అన్నారు. -
రజనీ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్
-
రజనీ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్
సౌత్ సూపర్ స్టార్ రజనీ అభిమానుల కోసం కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ గిఫ్ట్ ఇచ్చాడు. రజనీ కెరీర్ లోనే భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి చిత్రంలోని ఐదు డిలీటెడ్ సీన్స్‌ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన కబాలి చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. -
మొదటి రోజే వంద కోట్లు!
బాలీవుడ్ సినిమాలు ఏవైనా వందకోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఆ ఫీట్‌ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేవుడి దయతో సినిమా బాగా ఆడుతోందని చెప్పారు. భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా కలెక్షన్లు బాగున్నట్లు కలైపులి తెలిపారు. సినిమా విషయంలో భాష ఎప్పుడూ సమస్య కాబోదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్లలో సినిమా విడుదలైందని, అమెరికాలో 480, మలేసియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 స్క్రీన్లలోను సినిమా విడుదలైనట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ నటుడికీ ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాలేదని, దాన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద సూపర్ స్టార్ ఒకరేనని, ఆయన రజనీకాంతేనని అన్నారు. సంఘ వ్యతిరేక శక్తుల వల్ల పైరసీ భూతాన్ని అడ్డుకోవడం కష్టం అవుతోందని కలైపులి ఎస్ థాను ఆవేదన వ్యక్తం చేశారు. 1978లో రజనీకాంత్ నటించిన భైరవి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించినప్పుడు ఆయనను కలైపులి ఎస్. థాను తొలిసారి కలిశారు. 1984లో నిర్మాతగా మారి అర్జున్ నటించిన యార్ సినిమా నిర్మించారు. రజనీకాంత్ ఆ సినిమాలో అతిథిపాత్ర పోషించారు. అప్పటినుంచి రజనీ తనకు బాగా సన్నిహితుడయ్యారని, 32 ఏళ్లుగా ఆయనతో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నానని అన్నారు. కొచ్చాడయాన్, లింగా సినిమాలు ఫ్లాప్ కావడంపై ప్రశ్నించగా.. కొచ్చాడయాన్లో రజనీ నటించలేదని.. కేవలం ఆయన గొంతు మాత్రమే ఉంటుందని అన్నారు. ఇక లింగాపై రకరకాల రూమర్లు వచ్చినా.. ఆ సినిమా రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పారు. -
రజనీకాంత్ ఓ కోహినూర్ డైమండ్! - టీఎస్సార్
‘‘యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్.. రజనీకాంత్ ఏం చేసినా సూపరే. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన ఓ కోహినూర్ డైమండ్. అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ‘కబాలి’ బంపర్ హిట్ అవుతుందనిపిస్తోంది’’ అని కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి అన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కబాలి’. పా.రంజిత్ దర్శకుడు. తమిళంలో కలైపులి ఎస్.థాను నిర్మించారు. తెలుగులో షణ్ముఖ ఫిలింస్ పతాకంపై ప్రవీణ్‌కుమార్ వర్మ, కె.పి.చౌదరి విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వరుణ్ తేజ్ ఆవిష్కరించగా, షణ్ముఖ ఫిలింస్ లోగోని టి. సుబ్బిరామి రెడ్డి ఆవిష్కరించారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ‘‘నాటి ‘బాషా’లో కనిపించినట్లుగా ‘కబాలి’లో రజనీగారు కనిపిస్తున్నారు. హార్డ్‌వర్క్, సింప్లిసిటీకి ఆయన ఎగ్జాంపుల్’’ అన్నారు. నిర్మాత ప్రవీణ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ - ‘‘తూర్పు గోదావరిలో డిస్ట్రిబ్యూటర్‌గా నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఓ పెద్ద సినిమా చేయాలని కేపీ చౌదరి అన్నప్పుడు ‘కబాలి’ బాగుంటుందనుకున్నా. రైట్స్ విషయంలో మోహన్‌బాబుగారు సహాయం చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఫైనాన్షియల్‌గా అల్లు అరవింద్ మద్దతునిచ్చారు’’ అన్నారు. ‘‘రజనీగారిని ‘రోబో’గా చూడడం కంటే ‘బాషా’గా చూడడంలో కిక్ ఎక్కువుంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చేది ఆయన ఒక్కరే’’ అని నాని అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.